breaking news
high majority
-
శభాష్.. అవినాష్
సాక్షి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, యువ నాయకుడు వైఎస్ అవినాష్‌రెడ్డికి 2019 ఎన్నికల్లో జిల్లా ప్రజలు భారీ మెజార్టీని అందించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి 2011 ఉప ఎన్నికల్లో అందించిన మెజార్టీ తర్వాత ఇదే రెండవది కావడం విశేషం. 2014 ఎన్నికల్లో అవినాష్ 1.91 లక్షల మెజార్టీ సాధించారు. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక వి«ధానాలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూ....మరోప్రక్క ప్రత్యేక హోదా కోసం పదవిని సైతం తృణ ప్రాయంగా వదిలేసిన వైఎస్ అవినాష్‌రెడ్డిపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా సమస్యలపై అనునిత్యం పోరాడుతూ వచ్చారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రజా నేతను గుర్తించిన ప్రజలు తమకున్న మమకారాన్ని ఓట్ల రూపంలో చూపించారు. ప్రతి రౌండులోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థికి మెజార్టీ పెరుగుతూనే ఉంది. తాజా ఎన్నికల్లో సుమారు 3.55 లక్షల మెజార్టీని జిల్లా ఓటర్లు అందించారు. ఒక్క పులివెందులలోనే 84,631 ఓట్ల మెజార్టీని పొందారు. ఆయనపై టీడీపీ పక్షాన నిలిచిన ఆదినారాయణరెడ్డికి సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగులో కూడా మెజార్టీ రాలేదు. బద్వేలులో 1,55,152 ఓట్లు పోల్ కాగా వైఎస్ అవినాష్‌రెడ్డికి 1,02,845 ఓట్లు వచ్చాయి. కడపలో ఆయన 1,03,202 ఓట్లు తెచ్చుకుని ప్రత్యర్థిపై 50,690 ఓట్ల మెజార్టీని సాధించారు. ప్రొద్దుటూరులో1,08,712 ఓట్లు రాగా 43,471 ఓట్ల మెజార్టీని సా«ధించారు. కమలాపురం సెగ్మెంట్లో అవినాష్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిపై 37,268 ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. జమ్మలమడుగులో టీడీపీ అభ్యర్థిపై 51,641 మెజార్టీని సాధించి రికార్డు సృష్టించారు. మైదుకూరులోనూ 28,800 ఓట్లకు పైగా మెజార్టీతో భారీ విజయాన్ని నమోదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైఎస్ అవినాష్‌రెడ్డికి వచ్చిన ఓట్లు కలుపుకుంటే భారీ మెజార్టీ రికార్డు నమోదైంది ఎన్నికలు జరిగిన ప్రతిసారి వైఎస్ అవినాష్‌రెడ్డి మెజార్టీలో రికార్డులు సృష్టిస్తూ వస్తున్నారు. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి భారీ మెజార్టీ జిల్లాలోని రాజంపేట పార్లమెంటు స్థానానికి సంబంధించి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అఖండ మెజార్టీతో ఓటర్లు గెలిపించారు. 2014లో 1.77 లక్షల పైచిలుకు ఓట్లతో గెలిచిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఈసారి 2.64 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీని అందించారు. జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలతోపాటు చిత్తూరుజిల్లాలోని పలు నియోజకవర్గాలు రాజంపేట పరిధిలోకి వస్తాయి. ప్రజా సమస్యలతోపాటు ప్రత్యేక హోదా విషయంలో పదవిని కూడా త్యాగం చేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పట్ల ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీడీపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటిలలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి భారీ మెజార్టీ లభించింది. ఏది ఏమైనా జిల్లాలోని ఇరువురు ఎంపీలకు భారీ మెజార్టీ అందించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. -
కూటమి సవాల్ కాదు.. బీజేపీదే అధికారం
న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల్లో ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఓటమిని కూడా విజయంగా చెప్పుకునేందుకు ఆ పార్టీ సరికొత్త కారణాలు వెతుక్కుంటోందని సోమవారమిక్కడ అన్నారు. ప్రాంతీయ విపక్ష కూటమితో కలసి కాంగ్రెస్ బలమైన కూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ‘2014లోనూ ఈ పార్టీలన్నీ బీజేపీని వ్యతిరేకించాయి. 2019లోనూ వీరం తా కలిసి పనిచేయటం మాకు ఇబ్బందేం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుంది’ అని ఆయన చెప్పారు. ఈ కూటమిలోని చాలాపార్టీలకు వారి రాష్ట్రాల బయట పెద్దగా ప్రభావం లేవని.. అలాంటప్పుడు ఈ కూట మి అదనపు ఓట్లను ఎలా పొందగలుగుతుందన్నా రు. కాంగ్రెస్ మంత్రులు ఓటమిపాలైనప్పటికీ.. ఎం దుకు సంబరాలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ చెప్పాలని షా డిమాండ్ చేశారు. విశ్వాస పరీక్ష కోసం యడ్యూరప్ప ఏడ్రోజుల గడువు అడిగినట్లు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ లాయర్ అబద్ధమాడారన్నారు. -
‘హంగ్’లారుస్తూ..
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ప్రాదేశిక ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాక కూడా, కొందరు నేతలకు ఆర్థికభారం తప్పడం లేదు. జిల్లాలో 28 మండలాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మండల పరిషత్‌లలో హంగ్ ఏర్పడింది. మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుని పోస్టులు దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మొత్తం 59 మండలాలకు గాను 835 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా మండలాల్లోని ఎంపీటీసీ స్థానాల సంఖ్యను బట్టి, మెజారిటీ సభ్యులను గెలుచుకున్న పార్టీకి పాలక వర్గాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈనెల 13వ తేదీన వెలువడిన ఫలితాలు కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలకు నిరాశనే మిగిల్చాయి. మొత్తం 59 మండలాల్లో కాంగ్రెస్ ఏకంగా 25 మండలాల్లో పాలక వర్గాలను ఏర్పాటు చేసే అవకాశం దక్కించుకుంది. టీఆర్ఎస్-3, టీడీపీ-2, ఇండిపెండెంట్లు ఒక చోట అవకాశం దక్కించుకున్నారు. మిగిలిన 28చోట్ల ఎవరికీ సరిపోను మెజారిటీ రాకపోవడంతో ఒకరి సభ్యులను ఒకరు లాగేసుకునే ప్రయత్నాలు జరుగుతాయన్న ఆందోళన అన్ని పార్టీల్లోనూ ఉంది. దీంతో ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే రహస్య ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఎంపీపీ పదవులను ఆశిస్తున్న వారు, తమకు మద్దతుగా కూడగట్టిన సభ్యులను క్యాంపులకు తీసుకువెళ్లారు. జూన్ 2వ తేదీ తర్వాతే మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు జరిగే వీలుంది. దీంతో అప్పటి వరకు వీరిని కాపాడుకునేందుకు పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలకు తిప్పుతున్నారు. కొందరు ఇతర రాష్ట్రాలకూ తరలివెళ్లారు. మొత్తానికి క్యాంపులు నిర్వహిస్తున్న నేతలకు ఖర్చులు మాత్రం తడిచి మోపెడు అవుతున్నాయి. చండూరు మండలంలో 14ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్-4, టీడీపీ-4, స్వతంత్రులు-3, టీఆర్ఎస్-1, సీపీఎం-1, బీజేపీ-1చొప్పున ఎంపీటీసీలను గెలుచుకున్నాయి. టీడీపీకి ఉన్న 4 ఎంపీటీసీ సభ్యులకు ముగ్గురు స్వతంత్రులు తోడయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన గట్టుప్పల్-2ఎంపీటీసీ సభ్యుడు అవ్వారు శ్రీనివాస్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే హైదరాబాద్‌లో నలుగురు కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులతో క్యాంపు పెట్టారు. కాంగ్రెస్‌లో నుంచి ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు టీడీపీ గూటికి చేరారు. వీరిని టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు తోకల వెంకన్న రెండురోజుల కిందట క్యాంపునకు తరలించారు. ఆత్మకూరు(ఎం)మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్దానాలకు గానూ టీఆర్ఎస్కు 6 ఎంపీటీసీ స్థానాలు, కాంగ్రెస్‌కు 4 ఎంపీటీసీ స్థానాలు, టీడీపీ ఒక్క ఎంపీటీసీ స్థానాల చొప్పున కైవసం చేసుకున్నాయి. అయితే ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను కైవసం చేసుకునే మెజారీటి స్థానాలు టీఆర్ఎస్కు ఉన్నా, ఫలితాలు వెలువడిన 13వ తేదీ నుంచీ టీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యులు రహస్య శిబిరంలోనే ఉన్నారు. కట్టంగూర్ మండల పరిషత్ అధ్యక్ష పదవి కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యు లు ఇద్దరు స్వతంత్ర, , టీడీపీ అభ్యర్థితో కలిసి మూడు రోజుల క్రితం క్యాంపునకు తరలి వెళ్లారు. మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్‌కు 4, టీఆర్ఎస్కు 3, సీపీఎంకు 3, స్వతంత్ర అభ్యర్థులు 2, టీడీపీ 1 గెలుచుకున్నాయి. కాంగ్రెకు పార్టీకి చెందిన నలుగురు, ఇద్దరు స్వతంత్ర, ఒక టీడీపీ అభ్యర్థితో బేరసారాలు జరుగుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలోని 6మండలాల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. తిరుమలగిరి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు 8మంది ఇండిపెండెంట్లు , కాంగ్రెస్ 3, టీఆర్ఎస్కు 3స్థానాలు వచ్చాయి. ఇండిపెండెంట్ ఎంపీటీసీ సభ్యులు చేజారిపోకుండా క్యాంప్‌నకు తరలించారు. మోత్కూరు మండలంలో 16ఎంపీటీసీలకు కాంగ్రెస్ -4, ఇండిపెండెంట్లు నలుగురు (ఒక కూటమి) టీఆర్ఎస్-3, సీపీఐ 3, టీడీపీ ఇద్దరు అభ్యర్థులు (రెండో కూటమి) గెలుపొందారు. రెండు కూటములకు సమానంగా రావడంతో ఎవరి అభ్యర్థులను వారు క్యాంప్‌లకు తరలించారు. రామన్నపేట మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీకి -3, సీపీఎం-2, బీజీపీ-1, కాంగ్రెస్-4 , ఇండిపెండెట్లు-5 వచ్చాయి. ఇండెంపెండెంట్ల కీలకంగా మారారు. వీరి సహకారంతో టీడీపీ ఎంపీపీ పీఠం దక్కించుకునేందకు ప్రయత్నిస్తింది. ఎవరికి వారే క్యాంపులకు వెళ్లి పోయారు. కేతేపల్లి మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ సీపీఎం, టీఆర్ఎస్ , టీడీపీలు మూడు పార్టీలు కలిసి పోత్తుతో పోటి చేశాయి. ఈ కూటమికి 7 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కు 3, ఇండింపెండెంట్కు 1 స్థానం దక్కింది. మోజారిటీస్థానాలు సీపీఎం, టీఆర్ఎస్, టీడీపీలకు ఉన్నా , ఎంపీపీ రేసులో ఉన్న కొర్లపాడు సీపీఎం అభ్యర్థి గుత్త మంజుల ఆరుగురు ఎంపీటీసీ సభ్యులను ఆరు రోజలు కిందటే క్యాంపునకు తీసుకవెళ్లారు. మఠంపల్లి మండలంలో మొత్తం 13 ఎంపీటీసీలకు గాను టీడీపీ 7, కాంగ్రెస్ 3, సీపీఎం 1, సీపీఐ 1, వైఎస్సార్సీపీ 1 స్థానాన్ని గెలుపొందాయి. కాగా సీపీఎం ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలకు ముందే కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్‌కు ఎంపీటీసీల బలం 4కు చేరింది. టీడీపీ ఎంపీటీసీలలో చీలిక వస్తుందేమోనని ఆందోళనతో టీడీపీ ఎంపీటీసీలు 7 గురు సీపీఐ ఎంపీటీసీతో కలిసి రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. మేళ్లచెరువు మండలంలో మొత్తం 21 ఎంపీటీసీలకు గాను వైఎస్సార్సీపీ 5, టీడీపీ 5, కాంగ్రెస్ 8, ఇండిపెండెంట్లు 2, సీపీఐ 1 ఎంపీటీసీలు గెలుపొందాయి. టీడీపీ, ైవె ఎస్సార్సీపీలు ఎంపీపీ విషయంలో ఎన్నికలకు ముందే జత కట్టడంతో వారి బలం 10 మంది సభ్యులతో ఉంది. కాంగ్రెస్ పార్టీ తమ 8 మంది సభ్యులతో పాటు 1 సీపీఐ, 1 ఇండిపెండెంట్‌తో ఎంపీపీ పీఠం కోసం సిద్ధమయ్యారు. ఇక మిగిలిన కిష్టాపురం ఎంపీటీసీ సభ్యుడు కీలకం కావడంతో టీడీపీ, వైఎస్సార్సీపీల కూటమి కిష్టాపురం ఎంపీటీసీ సభ్యుడితో కలిసి ఇతర రాష్ట్రాలకు క్యాంప్‌కు వెళ్లారు.