breaking news
heath condition
-
వైద్యం కోసం విమానం దిగిన ప్రయాణికురాలు
శంషాబాద్: విమానం ఎక్కిన తర్వాత అనారోగ్య సమస్య తలెత్తడంతో ఓ ప్రయాణికురాలు టేకాఫ్ జరిగే విమానాన్ని నిలిపివేసి దిగిపోయిన సంఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బుధవారం మధ్యాహ్నం బెల్గావి వెళ్లేందుకు ఇండిగో విమానం 7512 విమానం సాయంత్రం 4.10 గంటలకు టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమైంది. ఇంతలోనే ఓ ప్రయాణికురాలు మౌనా రవి తాను తీవ్రమైన చర్మ సమస్యతో ఇబ్బంది ఎదుర్కొంటున్నానని తనను దింపివేయాలని కోరింది. దీంతో అధికారులు విమానం టేకాఫ్‌ను నిలిపివేసి ఆమెను అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నపటికి మళ్లీ ప్రయాణం కొనసాగించలేదు. దీంతో ఆమె లేకుండానే సాయంత్రం 5.25 గంటలకు విమానం టేకాఫ్ తీసుకుని బెల్గావ్ బయలుదేరింది. బెంగళూరు విమానం రద్దు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన విమానం రద్దయ్యింది. 74 మంది ప్రయాణికులతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు టేకాఫ్ తీసుకుని బయలుదేరాల్సిన విమానాన్ని ఆపరేషనల్ కారణాలతో రద్దుచేసినట్లు ఎయిర్‌లైన్ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
HYD: నేను ఆరోగ్యంగానే ఉన్నా: సీపీ సందీప్ శాండిల్య
సాక్షి, హైదరాబాద్ : తాను ఆరోగ్యంగానే ఉన్నానని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఆరోగ్యం గురించి స్వయంగా వివరాలు వెల్లడిస్తున్న ఒక వీడియోను విడుదల చేశారు. తనను ఒకరోజు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. మంగళవారం యథావిధిగా విధులకు హాజరవుతానని శాండిల్య వెల్లడించారు. కాగా, సీపీ సందీప్ శాండిల్య సోమవారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్ పాత కమిషనరేట్‌లో ఉండగా సందీప్ చాతి నొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనను అధికారులు హుటాహుటిన హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శాండిల్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో సందీప్ శాండిల్యను సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు పరామర్శించారు. ఇదీ చదవండి..ఐదేళ్ల చిన్నారి హత్య.. తల్లి మీద పగతో పొరుగింటి మహిళ ఘాతుకం -
తప్పక తప్పుకున్నా
ఇర్ఫాన్ ఖాన్ హెల్త్ కండీషన్ సడెన్‌గా అప్సెట్ అవ్వడంతో ఇండస్ట్రీ జనాలతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. న్యూరో ఎండోక్రైమ్ ట్యూమర్ ట్రీట్మెంట్ నిమిత్తం ప్రస్తుతం ఇర్ఫాన్ ఖాన్ లండన్‌లో ఉన్నారు. ఈ కారణంగా తాను అప్పటికే నటిస్తోన్న ఓ వెబ్ సిరీస్ ఆగిపోయిందని ఇర్ఫాన్ పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఇర్ఫాన్ మాట్లాడుతూ – ‘‘గోర్మింట్’ అనే సెటైరికల్ వెబ్ సిరీస్ కోసం కొన్ని నెలలు షూటింగ్ చేశా. ప్రస్తుతం నేనున్న పొజిషన్ చూస్తుంటే ఈ వెబ్ సిరీస్‌లో ఇక భాగం అవ్వలేనని అర్థం అయింది. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ సిరీస్ ఐడియా నన్ను చాలా థ్రిల్ చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తప్పక తప్పుకుంటున్నా. ఫైనల్ ప్రొడక్ట్ చూడాలని చాలా ఆత్రుతగా ఉన్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతున్న మాజీమంత్రి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య చికిత్స కోసం గురువారం జూబ్లిహిల్స్ అపో లో ఆస్పత్రిలో చేరారు. గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోవడంతో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు స్టెంట్ అమర్చి పూడిపోయిన భాగాన్ని ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.


