breaking news
handreeniva
-
హంద్రీనీవా విస్తరణ పనుల్లో నాణ్యత డొల్ల
కర్నూలు సిటీ/పత్తికొండ రూరల్ : హంద్రీనీవా కాలువ విస్తరణ పనుల్లో డొల్లతనం బట్టబయలైంది. పనుల్లో నాణ్యతతో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రధాన కాలువ లైనింగ్ దెబ్బతిని గండి పడడంతో కర్నూలు, అనంతపురం కడప, చిత్తూరు జిల్లాలోŠల్ 6.05 లక్షల ఎకరాలకు సాగు, 33 లక్షల మందికి తాగునీటిని అందించేందుకు హంద్రీనీవాను చేపట్టారు. ఈ కాలువ సర్కిల్–1 పరిధిలో 216 కి.మీ వరకు ఉంది. ఇందులో కర్నూలు జిల్లాలో 0 కి.మీ నుంచి 134 కి.మీ వరకు ప్రవహిస్తుంది.ఏటా 40 టీఎంసీల నీటిని శ్రీశైలం వెనుక జలాల నుంచి (బ్యాక్‌వాటర్) ఈ కాలువ ద్వారా తరలించాలనేది లక్ష్యం. అందుకు కాలువను 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. అయితే, ఏటా నీటి ప్రవాహంతో కాలువలో పూడిక పేరుకుపోతుండటంతో ప్రవాహ సామర్థ్యం తగ్గిపోతోంది. ఈ కారణంగా 40 టీఎంసీలలో 60 శాతం నీటిని కూడా తరలించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రధాన కాలువను విస్తరించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. రెండు ప్యాకేజీలుగా సుమారు రూ.601 కోట్లతో అంచనాలు వేశారు. ప్యాకేజీ–1 కింద రూ.171 కోట్లు, ప్యాకేజీ–2లో రూ.430 కోట్లతో టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టారు. 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంతలో పత్తికొండ సమీపంలోని పందికొన గ్రామం 108 కి.మీ దగ్గర ప్రధాన కాలువకు గండిపడి లైనింగ్ దెబ్బతింది. దీనికి కారణం కాల్వ పక్కన ఉండే వాగులో నుంచి నీరు రావడమేనని ఇంజనీర్లు చెబుతున్నారు. కానీ, కాల్వ విస్తరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంవల్లే లైనింగ్ దెబ్బతిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.విస్తరణ పనుల్లో నాణ్యతపై అనుమానాలు..హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచే పనులు ఈనెల 10లోపు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో కాంట్రాక్టర్లు హడావుడిగా పనులుచేస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే కాలువకు గండిపడి లైనింగ్ దెబ్బతినింది. నిజానికి.. అక్కడ నాణ్యమైన బంక మట్టివేసి రోలింగ్ చేశాకే లైనింగ్ చేయాలి. కానీ, నాణ్యతలేని నల్లమట్టి వాడడంవల్లే ఇటీవలి వర్షాలకు సిమెంట్ లైనింగ్ దెబ్బతినిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై హంద్రీనీవా ఎస్ఈ పాండురంగయ్యను వివరణ కోరగా.. కాలువకు ఎలాంటి ప్రమాదంలేదని, కాల్వ పక్కనున్న వంక నీరు కాల్వగట్టుపై నుంచి రావడంతోనే సిమెంట్ కాంక్రీట్ ఊడిపోయిందన్నారు. -
బాబూ.. పోలవరం ఎత్తు తగ్గించడం సంపద సృష్టా?: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ఏపీలో సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాయమాటలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అలాగే, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. కచ్చితంగా వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తాజాగా అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకూడదన్న దురుద్దేశంతోనే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా పొందాలంటే 10 శాతం సభ్యుల బలం ఉండాలన్న నిబంధన ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అబద్ధాలు చెప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే.చంద్రబాబు.. సంపద సృష్టిస్తా అన్నవ్ కదా ఏమైంది?. సంపద సృష్టి ఎక్కడ జరిగిందో కూటమి చెప్పాలి. సంపద సృష్టి అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటమా?. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు వైఎస్ జగన్ అంగీకరించలేదు. ఎన్డీయేలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. వైఎస్సార్ కృషి వల్లే హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయి. హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించిన దుర్మార్గుడు చంద్రబాబు. 45 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మించిన ఘనత వైఎస్సార్‌దే. హంద్రీనీవా కాలువల వెడల్పు చేసిన తర్వాతే.. లైనింగ్ పనులు చేపట్టాలి. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కనపెట్టి.. నిధులన్నీ అమరావతికే మళ్ళించటం ద్రోహం చేయడమే అవుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రత్యేకత చాటుకుంటున్న ’మేఘా’
కరీంనగర్: తెలంగాణలో పుడమిని చీల్చుకుంటూ గోదారమ్మ పొంగిపొర్లుతూ ఉరకలేస్తోంది. భూగర్భంలో నుంచి ’మేఘా’ గాయత్రి పంపింగ్ హౌసులో జలాలు ఉవ్వెత్తున ఉబుకుతున్నాయి. శివుడి శిరస్సుపై నుంచి గంగమ్మ జాలువారినట్టు పుడమిని నమ్ముకున్న రైతన్నల ఆశలకు అంకురార్పణ చేస్తూ తెలంగాణలోని మగాణిని పచ్చదనం పరిచేందుకు గోదారమ్మ బిరబిరా పరుగులెడుతోంది. గాయత్రి భాగర్భ పంపింగ్ కేంద్రం నిర్మాణంతో ఏటిలో నుంచి కాలువల్లోకి పొంగిపొర్లుతూ బీళ్లు బారిన పొలాల గట్లలోకి తడార్చేందుకు జలాలు ఉరకలేస్తున్నాయి. గొంతెండిన పొలాలను పులకరింపజేస్తూ పంటపొలాల్లో విత్తులు మొక్కై ఫలాలు అందించేందుకు భూమి పొరల్లోంచి చీల్చుకుంటూ వస్తోన్నాయి. మానేరులో గోదారమ్మ సాగరాన్ని తలపిస్తూ గాయత్రి పంపింగ్ హౌస్ కళకళలాడుతోంది. బీడుబారిన పొలాలను పులకరింపజేస్తూ మిడ్ మానేరుకు పరుగులు తీస్తోంది. తెలంగాణలో ’మేఘా ఇంజనీరింగ్’ ఓ అత్యద్భుతాన్ని ఆవిష్కరించింది. ’మేఘా ఇంజినీరింగ్’ భూగర్భంలో విశ్వవిఖ్యాతిగాంచిన గాయత్రి నీటి పంపింగ్ కేంద్రాన్ని తెలంగాణ కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో నిర్మించింది. ఈ కేంద్రాన్ని ఆగస్టు 11న ప్రారంభించి నేటి వరకు 22 రోజులు అవుతుండగా 3 పంపింగ్ మిషన్లతో 11. 40 టిఎంసీల నీరు మిడ్ మానేరుకు చేరుకున్నాయి. తొలిగా ప్రారంభించిన క్రమసంఖ్యలో 5వ మిషన్ 16 రోజుల్లో నిరంతరాయంగా 380 గంటపాటు, రెండోది వరుసలో 4వ మిషన్ 378 గంటలు పని చేయడంతో ఈ రెండు మిషన్లు ఒక్కొక్కటి దాదాపు 4.30 టిఎంసీల నీటిని పంప్ చేశాయి. అలాగే మూడోది 1వ మిషన్ 10రోజుల్లో 248గంటలు పని చేసి 2.80టిఎంసీల నీటిని తోడింది. ’మెగా’ మహాద్భుతం గాయత్రి పంపింగ్ కేంద్రాన్ని భూగర్భంలో 470 అడుగులు 327 మీటర్ల పొడవున నిర్మించి విశ్వవిఖ్యాతి ఘనత సాధించింది. ఈ నిర్మాణంలో తొలిదశలో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో 5 మిషన్లున్నాయి. మోటారు, పంపు కలుపుకుంటే ఓ మిషన్. మలిదశలో మరో రెండు మిషన్లు సిద్ధమవుతుండగా ఇప్పటికే ఓ మిషన్ డ్రైరన్ కూడా పూర్తయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రం గుండెకాయల పని చేస్తూ బీళ్లుబారిన లక్షల ఎకరాల చేనులకు సాగునీరు అందించేందుకు గోదారమ్మ పరుగులు పెడుతూ రైతన్నల కళ్ళల్లో ముంగిట్లో బంగారు కలలను , గుండెల్లో మొక్కవోని ధైర్యాన్ని చిగురింపజేస్తోంది. 2019 జూలైలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లింక్ 1లోని లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) నుంచి నీటిని పంపింగ్ చేస్తున్న ’మేఘా’ తన రికార్డును తానే అధిగమించింది. ప్రపంచ నెంబర్ వన్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా స్థాయిలో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమిస్తూ అతి పెద్ద పంపులు ఏర్పాటు చేసి ఎలాంటి సాంకేతిక సమస్యకు తావివ్వలేదు. అత్యద్భుతమైన ప్రాజెక్టుపై విమర్శలు చేస్తోన్న నోళ్లకు తాళాలు వేసుకునేలా ’మేఘా పంపింగ్ కేంద్రాలు’ గంగమ్మను భూ ఉపరితలంపైకి ఉబికిస్తూ నలుదిక్కులు ఘనతను పిక్కటిల్లెలా చాటుతోంది. ఇప్పటి వరకు అతిపెద్ద పంపింగ్ కేంద్రాలుగా హంద్రీనీవా తొలిదశలోని 12 కేంద్రాలు, రెండోదశలో 18 కేంద్రాలు ఖ్యాతిని గడించాయి. అంతేకాకుండా పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పంపింగ్ కేంద్రం చూసినా ’మేఘా ఇంజనీరింగ్’ నిర్మించినవే. ఏపీలోని హంద్రీనీవా అతి పెద్దది, ముఖ్యంగా అతి పొడవైనది అంతే కాకుండా ఎక్కువ పంపింగ్ కేంద్రాలతో రికార్డులను సొంతం చేసుకుంది. తొలిదశలో 12 కేంద్రాలు, 2వ దశలో 18 కేంద్రాలున్నాయి. తొలిదశలో 1వ పంపింగ్ కేంద్రం కృష్ణానది శ్రీశైలం ఎగువ భాగం మాల్యాలో నిర్మించారు. ఈ పంపింగ్ కేంద్రంలో 12 మిషన్లు ఉన్నాయి. ఒక్కొక్క మిషన్ 9.56 క్యూసెక్కుల నీరు అలాగే 5 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యంతో నిర్మించారు. దాదాపు నీటి పంపింగ్ ఎత్తు 38 మీటర్లు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే లింక్ 1లో ఒక్కొక్క మిషన్ సామర్ధ్యం 40 మెగావాట్లు. ఒక్క లక్ష్మీ మేడిగడ్డ కేంద్రంలోనే 17 మిషన్లు వున్నాయి. మొత్తం సామర్ధ్యం 680 మెగావాట్లు. హంద్రీనీవా మాల్యా పంపింగ్ కేంద్రం మొత్తం సామర్ధ్యం 60 మెగావాట్లు. అంటే హంద్రీనీవా కంటే కాళేశ్వరం లక్ష్మీ పంపింగ్ కేంద్రం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఐతే కాళేశ్వరంలోనే ఈ లక్ష్మీ మేడిగడ్డ కేంద్రంతో పోల్చితే గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రం మరింత అత్యంత పెద్దది. ఇందులో ఒక్కొక్కటి 139 మెగావాట్ల చొప్పున 7మిషన్లు 973 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించింది. అందులోనూ భూగర్భంలో 470 అడుగుల దిగువన నిర్మించడం విశేషం. ఏపీ, తెలంగాణలో ఏ పంపింగ్ కేంద్రముతోనూ గాయత్రి పంపింగ్ కేంద్రానికి పోలిక లేనేలేదు. హంద్రీనీవా అతిపెద్ద పంపింగ్ పధకం ఐనప్పటికీ అందులో మరింత పెద్దదిగా పరిగణించేది మాల్యాలోని తొలి కేంద్రం. 2012 నుంచి అంటే 8 ఏళ్లు 1242 రోజుల పాటు పంపింగ్ జరుగుతున్నప్పటికి 163.4 టిఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోసారు. అలాగే పట్టిసీమ నుంచి ఐదేళ్లలో 289 టిఎంసీల నీటిని అందించగలిగారు. ఐతే కాళేశ్వరంలోని ’మేఘా ఇంజనీరింగ్’ నిర్మించిన లింక్1, లింక్2 లోని 4 మెగా పంపింగ్ కేంద్రాలు పనిచేస్తే ఏ స్థాయిలో తెలంగాణలో బీళ్లు బారిన లక్షల ఎకరాల భూములకు సాగునీరు చేరుతుందో నోటి మాటతో లెక్కకట్టి చెప్పడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడంతో పాటు ’మేఘా ఇంజనీరింగ్’ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా పంపింగ్ చేస్తుండటంతో విశ్వంలోనే ’మేఘా’ ప్రత్యేకతను చాటుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఫలాలు అందించేందుకు ఆరంభంలోనే ఈ పరిమాణంలో నీరు అందిస్తే భవిష్యత్తులో హంద్రీనీవా, పట్టిసీమ పథకాల్లాగే ఏళ్లపాటు వేల గంటలు పంపింగ్ జరిగితే ప్రపంచంలో నీటి కోసం యుద్ధాలు ఎక్కడైనా జరగొచ్చు కానీ తెలంగాణలో మాత్రం సాగు, తాగు నీరుకు చిరకాలం కరువే అనే మాట కనుచూపు మేరల్లో ఉండదు. తెలంగాణ మాగాణులు పచ్చదనంతో పరిడవిళ్లుతాయి. ఈ ఘన చరిత్రలో, తెలంగాణ భవిష్యత్తులో ’మేఘా ఇంజనీరింగ్’ నిర్మాణ భాగస్వామవడం ఓ మైలురాయి. -
అనంతకు జీవనాధారం హంద్రీ-నీవా
గుంతకల్లు రూరల్ : హంద్రీ-నీవా కాలువ జిల్లాకు ప్రధాన జీవాధారం అని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. హంద్రీ-నీవా కాలువ విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పనుల నిర్వహణలో సాధ్యాసాధ్యాలను పరిశీలించే క్రమంలో భాగంగా మంగళవారం ఆయన గుంతకల్లులో పర్యటించారు. నేరుగా బుగ్గ సంగాల సమీపంలోని హంద్రీ-నీవా కాలువ వద్దకు చేరుకున్న ఆయన 144 కిలోమీటర్ నుంచి జి.కొట్టాల వరకు కాలువపై పర్యటించి పరిశీలించారు. కసాపురం, జి.కొట్టాల వద్ద ఏర్పాటు చేసిన తూములు పరిశీలించి అక్కడి నుంచి నీటిని ఏఏ ప్రాంతాలకు మళ్లిస్తున్నారు అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక రైల్వే కోజీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో నీటి సమస్యను అధిగమించడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులపైనే ఆధార పడాల్సి ఉందన్నారు. హంద్రీ-నీవా విస్తరణ పనులు పూర్తయితే జిల్లాకు 26 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉన్నందున నీటి సమస్యను పూర్తిగా అధిగమించవచ్చన్నారు. 9.5 మీటర్ల మేర కాలవను విస్తరిస్తున్న నేపథ్యంలో పనుల నిర్వహణకు టెండర్లను కూడా ఆహ్వానించామని, ఈనెల 8 తరువాత వర్క్ఆర్డర్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేస్తామన్నారు. అనంతరం విలేకరులు కొన్ని సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. చెరువుల్లో పూడిక తీత పనులు చేపడతామని, ఇకపై ఉపాధి హామీలో అన్ని రకాల పనులు పెడతామన్నారు. జిల్లాలో రూ.67 కోట్ల వరకూ ఉపాధి కూలీల డబ్బు పెండింగ్‌లో ఉందని, త్వరలోనే వాటిని నేరుగా కూలీల ఖాతాలోకి జమ చేస్తామన్నారు. మండలాల్లో నీటి సమస్యలపై ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. బోర్లు, చేతి పంపుల మరమ్మత్తుల కోసం ప్రతి మండలానికి రూ.2 లక్షల చొప్పున ఎంపీడీఓ ఖాతాల్లో జమ చేశామని, వాటిని ఉపయోగించి నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. హంద్రీ-నీవా కాలువ చీఫ్ ఇంజనీర్ జలంధర్, ఈఈ రాజశేఖర్, డీఈ రామకృష్ణ యాదవ్, తహశీల్దార్ హరిప్రసాద్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
'చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అందుకే తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో ప్రాజెక్టులకు కేవలం రూ.24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టుల కోసం రూ. 4700 కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాయలసీమ మీద నిజంగా చంద్రబాబుకు ప్రేమ ఉంటే వెంటనే హంద్రీ నీవా పూర్తి చేయాలని కోరారు. హంద్రీనీవా పనులు తానే చేశానంటూ సీఎం, మంత్రులు ఫొటోలకు ఫోజులివ్వడం హాస్యాస్పదంగా ఉందని అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు.