breaking news
hairstyles
-
‘అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): ‘అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’ అంటూ అమ్మాయిలు పాడటం ఇప్పుడు కొత్త కాదు. అందం, ఆకట్టుకునే లుక్కు, డ్రెస్సింగ్ వంటి విషయాల్లో మగువలతో మగమహారాజులూ పోటీ పడుతున్నారు. ఒకప్పుడు దసరా బుల్లోడు డ్రెస్సు వేస్తే గొప్ప. తరువాత ఎన్టీ రామారావు బెల్‌బాటమ్ ఫ్యాంట్.. దానికి అడుగున జిప్పులో ఒక భాగం కుట్టడం ప్యాషన్. కొంతమంది శోభన్‌బాబు స్టైల్లో తలలో ఓ పాయ తీసి నుదుటి మీదకు రింగులా పెట్టుకొని మురిసిపోయేవారు. ఆ తరువాత చిరంజీవి స్టెప్పు కటింగ్, బ్యాగీ ఫ్యాంట్లు, జర్కిన్లు.. పంక్ హెయిర్ స్టైల్.. ఇలా ఎన్నో.. 1996లో వచ్చిన ప్రేమదేశం సినిమా యువతను ఉర్రూతలూగించింది. చదవండి: సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి కొత్త ఫ్యాషన్ వైపు పరుగు తీయించింది. ఆ సినిమాలో హీరో అబ్బాస్ తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్‌తో యువతను మెప్పించాడు. యువకుల దృష్టిని సౌందర్యం వైపు మళ్లించాడు. యువత ఆహార్యంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఐదేళ్లుగా వస్తున్న మార్పులు అన్నీ ఇన్నీ కావు. రకరకాల హెయిర్ స్టైల్స్.. జుట్టుకు రంగులు.. ఫేస్ ప్యాక్‌లు అన్నీ ఇన్నీ కావు. పనిలో పనిగా నాజూకైన శరీరాకృతి కోసం కొందరు.. సల్మాన్‌ఖాన్‌లా కండలు పెంచేందుకు మరికొందరు.. ఇలా యువత మంచి లుక్కు కోసం సమయం, ధనం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లంటే కేవలం మహిళల కోసమే. కానీ ఇప్పుడు పురుషుల బ్యూటీ పార్లర్లకు సైతం ఆదరణ పెరిగింది. నగరాలు, పట్టణాలే కాదు.. చివరకు ఒక మోస్తరు పల్లెల్లో సైతం మెన్స్ బ్యూటీ పార్లర్లు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి పట్టణాలతో పాటు రావులపాలెం, కొత్తపేట, మలికిపురం, రాజోలు, తాటిపాక, అంబాజీపేట, పి.గన్నవరం వంటి గ్రామాల్లో కూడా ఇటువంటి బ్యూటీ పార్లర్లకు డిమాండ్ ఏర్పడింది. హెయిర్ స్టైల్‌కే తొలి ప్రాధాన్యం యువకులు హెయిర్ స్టైల్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు సెలూన్‌కు వెళ్తే రెండు రకాల స్టైల్స్‌లో హెయిర్ కటింగ్ చేయించుకోవడం, గెడ్డం గీయించుకోవడం లేదా ట్రిమ్మింగ్‌తో సరి. ఇప్పుడలా కాదు. పార్లర్లలో మూడు నాలుగు గంటలు పైగా గడుపుతున్నారు. రకరకాల హెయిర్ స్టైల్స్.. అందుకు తగినట్టుగా రంగులు వేయిస్తున్నారు. వారం వారం ఫ్యాషన్ మారిపోతోంది. పాశ్చాత్య దేశాలను అనుకరిస్తున్నారు. చేతిలో సెల్‌ఫోన్.. గూగుల్‌లో వెతికితే ఎన్నో ఫొటోలు, ఇంకెన్నో వీడియోలు. ఇంకేముంది! పుర్రెకో బుద్ధి అన్నట్టు యువత చెలరేగిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా 210 పాపులర్ హెయిర్ స్టైల్స్ ఉండగా, వీటిలో సుమారు 35కు పైగా మన వద్ద ఆదరణ ఉందని బ్యూటీ పార్లర్ల యజమానులు చెబుతున్నారు. రంగుల విషయానికి వస్తే పల్పీ, ఫ్రంక్ కలర్స్‌కు ఆదరణ ఎక్కువగా ఉంది. పనిలో పనిగా ఫేస్‌ప్యాక్, ఫేషియల్‌ను కూడా వదలడం లేదు. ఒక్కో ఫేషియల్కు రకాన్ని బట్టి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక మొత్తం బాడీ న్యూలుక్ కోసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ ఖర్చవుతోందంటే వీటికి ఉన్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిమ్‌లకు పెరుగుతున్న ఆదరణ మరోవైపు జిమ్‌లకు సైతం యువకులు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు కేవలం బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనేవారు మాత్రమే ఎక్కువగా జిమ్‌లకు వచ్చేవారు. కరోనా తరువాత ఆరోగ్య స్పృహ పెరగడంతో పాటు అందమైన ఆకృతి కోసం జిమ్‌లకు వస్తున్నారు. పెద్దపెద్ద బరువులు ఎత్తి, సిక్స్‌ప్యాక్, ఎయిట్ ప్యాక్‌ల కోసం ప్రయాసపడే వారి కన్నా అందమైన బాడీ షేప్‌లకు వచ్చేవారే ఎక్కువగా ఉంటున్నారు. 60లో 20ల్లా ఉండాలని.. నడియవస్సు వారు సైతం యువకుల్లా కనిపించేందుకు తాపత్రయపడుతున్నారు. జట్టుకు, మీసాలకు రంగులు వేయించడం ఒక్కటే కాదు.. రకరకాల హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు. ఫేస్‌ప్యాక్‌ల విషయంలో కూడా రాజీ పడటం లేదు. శుభకార్యానికి వెళ్లాల్సి ఉంటే ముందుగా బ్యూటీ పార్లర్లు, సెలూన్ల వైపు పరుగు తీస్తున్నారు. నడివయస్సులో జిమ్‌లకు వెళ్లే వారు తక్కువే అయినా ఉదయం నడక, చిన్నచిన్న కసరత్తులతో నాజూకుగా మారిపోతున్నారు. విభిన్నంగా ఉంటేనే గుర్తింపు విభిన్నంగా ఉంటేనే మమ్మల్ని నలుగురూ గుర్తిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకే హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఐటీ సెక్టార్లో అవకాశాలు పెరిగాక, చాలామంది యువత అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ వల్ల కూడా మాకు ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి. – గాదిరాజు హరీష్‌వర్మ, అంబాజీపేట కొత్త ఫ్యాషన్ నేర్చుకుంటున్నాం మా పెద్దలు సెలూన్లు నిర్వహించేటప్పుడు కటింగ్, గెడ్డం గీయడంతో సరిపోయేది. మహా అయితే ట్రిమ్మింగ్ చేసి, రంగు వేసేవారు. ఇప్పుడు సెలూన్ల నిర్వహణ మొ త్తం మారిపోయింది. కొత్త ఫ్యాషన్లకు అనుగుణంగా హెయిర్ కటింగ్ స్టైల్స్ నేర్చుకుంటున్నాం. ఫేషియల్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. ఒక్కోసారి హైదరాబాద్ వెళ్లి శిక్షణ పొందుతున్నాం. షాపుల్లో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం. – అనిల్‌కుమార్, సెలూన్ యజమాని, అమలాపురం నాజూకుతనానికి.. ఒకప్పుడు జిమ్‌లకు ఎక్కువగా బాడీ బిల్డర్లు వచ్చేవారు. కానీ ఇప్పుడు నాజూకుతనం కోసం ఎక్కువ మంది వస్తున్నారు. మజిల్స్, బాడీ కటింగ్ కోసం చిన్నచిన్న కసరత్తులు ఎక్కువగా చేస్తున్నారు. కరోనా తరువాత, యువతలో వస్తున్న ఫ్యాషన్ మార్పుల కారణంగా జిమ్‌కు వచ్చేవారి సంఖ్య పెరిగింది. – కంకిపాటి వెంకటేశ్వరరావు, హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ కోచ్, అమలాపురం -
పోనీ టెయిల్‌కి సెకండ్ వెర్షన్
వేసవిలో జుట్టును లూజ్‌గా వదిలేయడం ఇబ్బందిగానే ఉంటుంది. వెంట్రుకలు మెడమీద పడకుండా, నీటుగా హెయిర్‌స్టైల్ ఉండాలనుకుంటే ఈ స్టైల్‌ను ఫాలో అవ్వచ్చు. ఇది పోనీటెయిల్‌కి సెకండ్ వెర్షన్‌గా చెప్పచ్చు. ► జుట్టును చిక్కుల్లేకుండా దువ్వాలి. తర్వాత అటూ ఇటూ రెండు పాయలు తీసి ఒక పాయగా కలిపేసి, మధ్యన రబ్బర్ బ్యాండ్ వేయాలి. ► రబ్బర్ బ్యాండ్ వేసిన పాయకు దిగువ భాగాన మరొక రబ్బర్ బ్యాండ్ వేయాలి. ► రెండు రబ్బర్ బ్యాండ్స్ మధ్యలో ఉన్న హెయిర్‌ను ఓవెల్ షేప్ ఖాళీ ఉంచి, ఆ మధ్యలో నుంచి మిగతా హెయిర్‌ను బయటకు తీసి, ఒకసారి దువ్వెనతో దువ్వి, వదిలేయాలి. ► జుట్టు మందంగా ఉన్నవారు మధ్య నుంచి ఒక పాయగా తీసి, మెడమీద మిగతా హెయిర్‌తో కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. దీనివల్ల మెడ మీద చెమట కు వెంట్రుకలు చికాకు పెట్టకుండా, హెయిర్‌స్టైల్ నీటుగా ఉంటుంది. – సత్యశ్రీ సుతారి హెయిర్ స్టైలిస్ట్, ఫస్ట్ ఫౌండేషన్, హైదరాబాద్ -
Ponytail Hairstyles: పోనీటెయిల్.. ఈజీగా స్టైల్
చాలా వరకు రోజూ పోనీటెయిల్ వేసుకుంటుంటారు. వేసవిలో ఈ స్టైల్ సాధారణంగా చూస్తుంటాం. అయితే, ఎప్పుడూ ఒకే హెయిర్ స్టైల్ బోర్‌గా ఉంటుంది. భిన్నంగా ఏమీ అనిపించదు. కొత్తగా హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలంటే చాలా టైమ్ పడుతుంది అనుకుంటారు. కానీ, సింపుల్ హెయిర్ స్టైల్స్‌ను ట్రై చేయవచ్చు. తల ముందు భాగంలో చిన్న మార్పు చేసినా, ముఖానికి కొత్త అందం వస్తుంది. ఇది రెగ్యులర్‌గా వేసుకోవడానికి స్టైల్‌గానూ ఉంటుంది. ► జుట్టు అంతా చిక్కులు లేకుండా దువ్వాలి. ► ముందు భాగం నుంచి ఎడమవైపున ఒక పాయ తీయాలి. ► ఆ పాయను మూడు పాయలుగా విభజించి, జడలా చివరి వరకు అల్లాలి. ► సైడ్ జడ పాయను తల వెనుక భాగానికి తీసుకొని, పిన్నులు పెట్టాలి. ► మిగతా జుట్టును అంతా చేతిలోకి తీసుకొని, దువ్వి, గట్టిగా బ్యాండ్ పెట్టాలి. ఈ స్టైల్ సింపుల్‌గానూ, స్టైలిష్‌గానూ ఉంటుంది. రోజూ చేసే హెయిర్ స్టైల్‌నే చిన్న మార్పుతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. – సత్యశ్రీ, హెయిర్ అండ్ మేకప్ స్టైలిష్ట్, ఫస్ట్ ఫౌండేషన్, హైదరాబాద్ -
పుట్‌బాల్ స్టార్లలా హెయిల్ స్టైల్
-
గడ్డం అడ్డం కాదు...!
కొన్నాళ్ల కిందట... ఇంగ్లాండ్‌లోని బెర్క్‌షైర్‌లో నివసించే హర్నామ్కౌర్(23)కు పాలీలిస్టిక్ ఓవరీ సిండ్రో మ్ కారణంగా11 ఏళ్ల నుంచే శరీరమంతా వెం ట్రుకలు రావడం మొదలైంది... అప్పటి నుంచి ఆమెకు కష్టాలు కూడా మొదలయ్యాయి. ఆడపిల్ల అందునా అంత చిన్న వయసులో గడ్డం, మీసాలు రావడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక హర్నామ్ బాధ వర్ణనాతీతం. స్కూల్లో అందరూ ఆమెను ‘ఫీమెన్’ అంటూ సూటిపోటి మాటలతో వేధించేవారు. నెట్లో ఫొటోలు పెడితే కొందరు చంపేస్తామంటూ హెచ్చరించారు. ప్రతిరోజూ శరీరమంతా ట్రిమ్ చేసుకోవడం ఆమెకు కష్టంగా మారింది. ఇవన్నీ భరించలేక ఇంట్లోంచి బయటకు రావడమే మానేసింది. ఒక దశలో ఆత్మహత్యచేసుకోడానికి కూడా ప్రయత్నించింది. ఇప్పుడు.... ప్రతికూలతనే అనుకూలంగా మార్చుకుంది...తన జీవితానికి అడ్డంగా ఉన్న గడ్డాన్ని ఇక ఎంతమాత్రం తొలగించకూడదని నిర్ణయించుకుంది. ఇంట్లో వాళ్లు వారించినా సిక్కు మత సంప్రదాయం ప్రకారం ట్రిమ్ చేయడం మానేసింది. గడ్డం, మీసాలతోనే బయట ప్రపంచంలోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది. ఈ విషయంలో తన సోదరుడు గురుదీప్‌సింగ్ ఎంతో సహాయం చేశాడని, అడుగడుగునా ప్రోత్సహించాడని హర్నా మ్ తెలిపింది. ‘దేవుడే నన్ను ఇలా తయారు చేసినప్పుడు నేనెందుకు బాధపడాలి.. ఇలా ఉన్నందుకు సంతోషంగానే ఉన్నా.. నిజం చెప్పాలంటే ఇప్పుడే అమ్మాయిలా ఉన్నాననిపిస్తుంది.. అందరికీ నేను చెప్పేదొక్కటే.. మీ శక్తి ఏంటో మీరు గ్రహించండి.. మీకు ఇష్టమైనట్లే మీరు ఉండాలి.. మీ జీవితం మీదే..’ అంటున్న హర్నామ్ ప్రస్తుతం ఇంగ్లాడ్‌లోని ఒక సిక్కు ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంది. అంతేకాదు గడ్డంతో ఉన్న తన వీడియోలను యూట్యూబ్‌లో పెట్టి తనలా బాధపడే మహిళకు స్ఫూర్తినిచ్చేందుకు ప్రయత్నిస్తోంది.