breaking news
Guest Of Honour
-
మారిషస్ స్వాతంత్య్ర వేడుకలకు ప్రధాని మోదీ
పోర్ట్ లూయిస్/న్యూఢిల్లీ: మార్చి 12వ తేదీన జరిగే మారిషస్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. మారిషస్ ప్రధానమంత్రి రాం గులామ్ శుక్రవారం జాతీయ అసెంబ్లీలో ఈ విషయం ప్రకటించారు. ద్వైపాక్షిక సన్నిహిత సంబంధాలకిది నిదర్శనమన్నారు. ‘నా ఆహ్వానం మేరకు మన దేశ 57వ స్వాతంత్య్ర దినం సందర్భంగా జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సహృదయంతో అంగీకరించారని తెలిపేందుకు ఎంతో సంతోషిస్తున్నాను’అని ఆయన తెలిపారు. ఇటీవలే ఫ్రాన్స్, అమెరికాల్లో పర్యటనలు ముగించుకుని వచ్చిన మోదీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తన ఆహా్వనాన్ని మన్నించారన్నారు. -
మీ దేశం నేతలే రావట్లేదు.. నేనెందుకొస్తా?!
న్యూఢిల్లీ: వివాదాల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనా'నికి హాజరుకాకూడదని జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే నిర్ణయించుకున్నారు. శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో మూడురోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముగాబే ఇప్పటికే దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. అయినా.. ఈ కార్యక్రమం చుట్టూ వివాదాలు ముసురుకోవడం, ప్రోటోకాల్ నిర్వహణ, భద్రత విషయంలో తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆయన తిరిగి స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా ముగాబే పాల్గొనాల్సి ఉంది. అయితే ఆతిథ్యమిస్తున్న దేశంతోపాటు వివిధ దేశాల నేతలు ఇప్పటికే ఈ కార్యక్రమం నుంచి వైదొలిగారని, ఈ నేపథ్యంలో ముగాబే కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించారని ఆయన అధికారిక వెబ్సైట్ ఓ ప్రతికా ప్రకటనలో వెల్లడించింది. 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం'లో పాల్గొనరాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. యమునా నది తీరంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళనలతో ప్రణబ్ తప్పుకొన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఈ కార్యక్రమ ప్రారంభ సదస్సుకు హాజరుకానున్నారు.