breaking news
Gravity Survey
-
గ్రావిటీ’ సర్వే మరింత జాప్యం
► తమ్మిడిహెట్టి–సుందిళ్లపై ముందుకు కదలని వ్యాప్కోస్ సర్వే ► నీటి పారుదల శాఖ నిర్లక్ష్యంతో ఆలస్యం ► ప్రస్తుతం వర్షాలతో సర్వే కొనసాగించలేని పరిస్థితి సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులో భాగమైన తమ్మిడిహెట్టి నుంచి.. కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల బ్యారేజీకి గ్రావిటీ ద్వారా నీటిని తరలించడంపై చేపట్టిన సర్వే ముందుకు కదలడం లేదు. సర్వే బాధ్యత లను చూస్తున్న వ్యాప్కోస్ సంస్థ ఈ పనులపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఏడాదిగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నీటి పారుదల శాఖ కూడా పట్టనట్లు వ్యవహరించడంతో మరింత జాప్యం జరిగింది. తాజాగా ఈ సర్వేను తిరిగి మొదలు పెట్టాలని చూసినా.. వాతావరణం అనుకూ లంగా లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. భారీ విద్యుత్ అవసరంతో.. ప్రాణహిత తొలి డిజైన్ మేరకు తమ్మిడిహెట్టి నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి 72 కిలోమీటర్ల మేర గ్రావిటీ, తర్వాత చిన్న లిఫ్టు ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ప్రణాళిక వేశారు. కానీ తమ్మిడిహెట్టి వద్ద తగిన నీటి లభ్యత ఉండదన్న కేంద్ర జల సంఘం సూచనతో.. కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. అయితే దీనితో విద్యుత్ అవసరాలు భారీగా పెరగడంతో గ్రావిటీ ద్వారా తరలింపు అంశం తెరపైకి వచ్చింది. వీలైనంత ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా 72వ కిలోమీటర్ వరకు తెచ్చి.. అక్కడి నుంచి వేరే కాల్వ ద్వారా సుందిళ్ల బ్యారేజీలో కలపాలనే ప్రతిపాదన వచ్చింది. దీని సర్వే బాధ్యతలను ఏడాది కింద వ్యాప్కోస్‌కు కట్టబెట్టారు. 72వ కిలోమీటర్ పాయింట్ నుంచి సుందిళ్లకు నీటిని తరలించే వ్యవస్థపై ఈ సంస్థ లైడార్ సర్వే చేయాల్సి ఉంది. గతేడాది మేలో సర్వే మొదలుపెట్టిన వ్యాప్కోస్.. ఈ అలైన్మెంట్ అంత సులువు కాదని, దారిలో అనేక గనులున్నాయని స్పష్టం చేసింది. దీనిపై లోతైన సర్వే చేయాలని పేర్కొంది. కొద్దిరోజులకే సర్వే చేస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పనులు నిలిచిపోయాయి. తర్వాత హెలికాప్టర్ సిద్ధమైనా జూన్ నుంచి విస్తారంగా కురుస్తున్న వానలతో సర్వేకు బ్రేక్ పడింది. మరోవైపు కొద్దినెలలుగా రాష్ట్రంలోని పలు ఇతర ప్రాజెక్టుల సర్వే పనులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రాణహిత సర్వే మూలనపడింది. -
తమ్మిడిహెట్టి-సుందిళ్ల గ్రావిటీ సర్వేకు బ్రేక్
♦ హెలికాప్టర్లో సాంకేతిక లోపంతో ఆగిన పనులు ♦ పునరుద్ధరణకు మరో 3, 4 రోజులు పట్టే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి నుంచి నీటిని గ్రావిటీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్లకు తరలించేందుకు చేపట్టిన సర్వే పనులకు బ్రేక్ పడింది. సర్వే బాధ్యత తీసుకున్న వ్యాప్కోస్ సంస్థ వినియోగిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో 3 రోజులుగా సర్వే పనులు నిలిచిపోయాయి. సర్వే పనులు తిరిగి కొనసాగించేందుకు 3, 4 రోజులు పట్టే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ వర్గాలు తెలిపా యి. ప్రాణహిత మొదటి డిజైన్ ప్రకారం తమ్మిడిహెట్టి నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అక్కడ్నుంచి 72 కిలోమీటర్ల మేర గ్రావిటీ, తర్వాత చిన్న లిఫ్టు ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని అధికారులు ప్రణాళిక వేశారు. సుమారు 60 క్యూసెక్కుల నీటి తరలింపునకు వీలుగా 69 మీటర్ల వెడల్పుతో కాల్వల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో 44 టీఎంసీల నీటి లభ్యత ఉందని సర్వే సంస్థ అంచనా వేయడంతో తమ్మిడిహెట్టి నుంచి తీసుకునే నీటి పరిమాణాన్ని 50 క్యూసెక్కులకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం తెరపైకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రాణహితను కలుపుకుంటే 5,200 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉండటంతో గ్రావిటీ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. తమ్మిడిహెట్టి రెగ్యులేటర్ ఎత్తును 145 మీటర్ల నుంచి మరో మీటర్‌కు తగ్గిస్తే మరో 20 నుంచి 30 టీఎంసీల నీటిని తరలించవచ్చనే అంచనా నేపథ్యంలో వీలైనంత ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా 72వ కిలోమీటర్ వరకు తెచ్చి అక్కడ్నుంచి వేరే కాల్వ ద్వారా సుందిళ్ల బ్యారేజీలో కలపాలనే ప్రతిపాదన చేశారు. ఇందుకోసం సర్వే బాధ్యతను వ్యాప్కోస్‌కు అప్పగించారు. 72వ కిలోమీటర్ పాయింట్ నుంచి సుందిళ్లకు నీటిని కలిపే వ్యవస్థపై ఈ సంస్థ లైడార్ సర్వే మొదలుపెట్టింది. సర్వే మేరకు ఈ అలైన్మెంట్ దారిలో మైనింగ్ క్షేత్రాలు ఉన్నాయని, వాటిల్లో టన్నెల్ నిర్మాణాలను చేపట్టడం వీలుపడదని సంస్థ గుర్తించింది. దీనిపై లోతుగా పరిశీలించడంతోపాటు గ్రావిటీ ద్వారా వచ్చే నీటి అవకాశాలను మెరుగుపరిచేందుకు లైడార్ సర్వే చేస్తోంది. గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలున్న నేపథ్యంలో కాల్వల వెడల్పు తగ్గించడం సబబు కాదంటూ 60 క్యూసెక్కుల నీటి తరలింపు ప్రణాళికనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే పూర్తయితేనే తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత, అక్కడ్నుంచి సుందిళ్లకు నీటి తరలింపు అంశం కొలిక్కి వస్తుంది.