breaking news
Gokul Raj murder case
-
కోర్టుకు హాజరైన యువరాజ్
సేలం: ఇంజనీరింగ్ విద్యార్థి గోకుల్ రాజ్ హత్య కేసులో చార్జ్ షీట్ గురువారం కోర్టులో దాఖలైంది. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి గోకుల్ రాజ్ ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. పెను సంచలనం సృష్టించిన ఈ కేసులో ధీరన్ చిన్నమలై గౌండర్ పేరవై వ్యవస్థాపకుడు యువరాజ్‌తో పాటు 17 మంది అరెస్టు అయ్యారు. యువరాజ్, ఆయన తమ్ముడు తంగ దురై ల మీద గుండా చట్టం నమోదు అయింది. వేలూరు జైల్లో యువరాజ్, సేలం జైల్లో మరో ఆరుగురు విచారణ ఖైదీలుగా ఉన్నారు. పది మందిబెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ కేసులో విచారణను ముగించిన సీబీసీఐడీ గురువారం చార్జ్ షీట్‌ను దాఖలు చేసింది. 1 318 పేజీలతో ఈ చార్జీ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్టు చేయడంతో విచారణను జిల్లా మొదటి మేజిస్ట్రేట్ కోర్టుకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 17వ తేదీన నిందితులు విచారణ నిమిత్తం ఆ కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, విచారణ నిమిత్తం యువరాజ్‌తో పాటుగా మిగిలిన వారిని కోర్టుకు తీసుకురావడంతో గట్టి భద్రతా ఏర్పాట్లను ఆ పరిసరాల్లో పోలీసు యంత్రాంగం చేసింది. -
నేడు యువరాజ్ లొంగుబాటు
కనిపిస్తే కాల్పులు, పీటీ వారెంట్ ప్రభావం నామక్కల్ సీబీసీఐడీ కార్యాలయానికి యువరాజ్ ధ్రువీకరించిన న్యాయవాది చెన్నై, సాక్షి ప్రతినిధి: ఇంజనీర్ గోకుల్‌రాజ్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా అజ్ఞాతంలో ఉన్న యువరాజ్ ఆదివారం సీబీసీఐడీ పోలీసుల ముందు లొంగిపోనున్నారు. ఈ విషయాన్ని ఆయన న్యాయవాది శనివారం ప్రకటించారు. సేలం జిల్లా ఓమలూరుకు చెందిన ఇంజనీర్ గోకుల్‌రాజ్ జూన్ 23వ తేదీన హత్యకు గురికాగా, ఈ కేసులో ఇప్పటికి 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన ముద్దాయి యువరాజ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. యువరాజ్‌ను అరెస్ట్ చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గోకుల్‌రాజ్ హత్యకేసును విచారిస్తున్న నామక్కల్ జిల్లా తిరుచెంగోడు డీఎస్పీ విష్ణుప్రియ (27) గత నెల 18వ తేదీన ఆత్మహత్య చేసుకోవడం ఇంజనీర్ హత్య కేసును తీవ్రతరం చేసింది. డీఎస్పీ విష్ణుప్రియ హత్యకేసు విచారణలో ఉన్న పోలీసుల చర్యలను నిరసిస్తూ అజ్ఞాతం నుంచే యువరాజ్ వాట్సాప్ ద్వారా ఆడియో మెసేజ్‌లు పంపేవాడు. దీంతో ఒక హత్యకేసు, మరో ఆత్మహత్యకేసు వెనకాల యువరాజ్ పాత్రపై పోలీసులకున్న అనుమానాలు బలపడ్డాయి. దీంతో యువరాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసుశాఖ సీబీసీఐడీ అధికారులకు ఆదేశాలు జారీచేయగా, నామక్కల్ మొదటి మెజిస్ట్రేట్ నేరవిభాగ కోర్టు న్యాయమూర్తి మలర్మతి యువరాజ్ అరెస్ట్ కోసం 5వ తేదీన పీటీ వారంట్ జారీచేశారు. పీటీ వారెంట్ జారీ అయినందున యువరాజ్ తప్పనిసరిగా కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. లేకుంటే పరారీలో ఉన్న నిందితుడిగా అతనిపై అధికారిక ముద్రపడుతుంది. అంతేగాక అతని ఆస్తిపాస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్ చేసే అవకాశం ఉంది. యువరాజ్ తన రక్షణ కోసం మారణాయుధాలను ఉంచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అవసరమైతే యువరాజ్‌పై కాల్పులు జరిపైనా ప్రాణాలతో పట్టుకుని అరెస్ట్ చేయాలని 5వ తేదీన ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా యువరాజ్ న్యాయవాది అముదరసు శనివారం మీడియాతో మాట్లాడుతూ యువరాజ్ ఇంటి నుంచి సెల్‌ఫోన్, సీసీ టీవీ కెమెరా, హార్డ్‌డిస్క్, సిమ్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈనెల 11 వ తేదీ ఉదయం 10 గంటలకు నామక్కల్ సేలం రోడ్డులోని సీబీసీఐడీ కార్యాలయంలో విచారణ అధికారుల ముందు యువరాజ్ లొంగిపోతాడని చెప్పారు.