breaking news
Gajapathinagaram Assembly Constituency
-
బొబ్బిలి టీడీపీ సీటు బీసీలకు ఇచ్చే దమ్ముందా!
టీడీపీ అధినేత చంద్రబాబుకు బీసీలపై నిజమైన ప్రేమ ఉంటే బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే సీటు బీసీలకు ఇచ్చే దుమ్మందా అని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సవాల్ విసిరారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో బీసీలకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. వారి పాలనలో ప్రజల సొమ్మును తెలుగుదేశం నాయకులు దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు. అభివృద్ధి అంటే టీడీపీ నాయకులకు తెలియదని ఎద్దేవా చేసారు. భూకబ్జా చేసానని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు వాటిని నిరూపించే దమ్ముందా అని చాలెంజ్ విసిరారు. 2001లో రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి అవినీతి లేని పాలన అందిస్తున్నానని తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న దివంగత నేత వైఎస్సార్ చెప్పిన మాట ప్రకారం ఒదిగా ఉన్నానని తెలిపారు. – బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్యే ● -
YSRCP Bus Yatra: ఇది కదా మాట నిలబెట్టుకోవడం అంటే..
సాక్షి, గజపతినగరం(విజయనగరం జిల్లా): సామాజిక న్యాయం అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి వల్లే సాధ్యమైందని వైఎస్సార్సీపీ నేతలు మరోసారి స్పష్టం చేశారు. సామాజిక సాధికారిత రెండోరోజు బస్సుయాత్రలో భాగంగా గజపతినగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. ముందుగా గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ.. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించింది సీఎం జగనే. సామాజిక న్యాయం సీఎం జగన్ వల్లే సాధ్యం. విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఎన్నో రకాల చర్యలు చేపట్టారు సీఎం జగన్. వెనుకబడిన ఉత్తరాంధ్రలో ట్రైబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కానీ చంద్రబాబు, ఎల్లో మీడియా ఏదో రకంగా విష ప్రచారం చేయడం దారుణం’ అని తెలిపారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న నాయకుడు సీఎం జగన్. సీఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం జరుగుతోంది. అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. అర్హులందరీకి అభివృద్ది, సంక్షేమ పలాలు అందిస్తున్నాం. కులం మతం తో సంబంధం లేకుండా మంత్రి పదవులు ఇచ్చారు. ప్రతి గ్రామం లో సచివాలయం ఏర్పాటు చేసి, నిరుద్యోగులను వాలంటర్ లు గా నియమించి ప్రభుత్వ సేవలు ఇస్తున్నాం. ప్రతి పేదవాడి మొహం లో చిరునవ్వు చూడాలని సామజిక న్యాయం చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ.. ‘బీసీలకు, ఎస్సీలకు రాజ్యాధికారం ఇచ్చింది అంబేద్కర్, అంబేద్కర్ ఆశయాలను ఎవరూ అమలు చేయలేదు. జగన్ సీఎం అయ్యాక మనసు, మానవత్వంతో ఆలోచించి గిరిజనుడికి, దళితుడికి, బీసీలకు రాజ్యాధికారం అవకాశం ఇచ్చారు. కుల మతాలకు సంబంధం లేకుండా అవకాశాలు కల్పించింది వైఎస్సార్సీపీ. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం ఇచ్చింది సీఎం జగన్. బీసీలు తోక కత్తిరిస్తామని, మీ అంతుచూస్తామని చంద్రబాబు మాట్లాడారు. మరి బీసీలను అవహేళన చేసిన చంద్రబాబును నమ్ముతామా. ఎస్సీ కులం లో పుట్టాలని ఎవరు అనుకుంటారని చంద్రబాబు ఎస్సీ లను అవమానించారు. చంద్రబాబు మోసాలను జనం గమనించాలి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పోటీ చేసి 650 హామీలు ఇచ్చారు. ప్రమాణస్వీకారం రోజు 5 సంతకాలు చేసి రైతు రుణ మాఫీ చేయలేదు. చంద్రబాబు హామీలు నెరవేర్చకుండా చేతులెత్తేశాడు. అందుకే చిత్తుగా ఓడిపోయాడు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘ ప్రజలు బ్యాంకుల్లో అప్పులు అయిపోయారు. నాకు ఓటు వేయండి అప్పులు తీర్చుతామని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పాడు. అప్పులు తీర్చలేదు. మేం 5 ఏళ్ల క్రితం చంద్రబాబు మోసం చెప్పాం. అందుకే మీరు మాకు ఓటు వేశారు. మేం అధికారం లోకి వచ్చాక వారి బ్యాంకు ఖాతాల్లో మూడు విడుతలు డబ్బులు వేసి నాలుగో విడత వేయడానికి సిద్దం గా ఉన్నాం. ఇది కదా మాట నిలబెట్టుకోవడం. చంద్రబాబు పాలన లో రైతులు రుణాలు తీర్చలేకపోతే బ్యాంకులు అవమానించాయి. జగన్ పాలన లో సక్రమం గా రైతు బరోసా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఎన్నికల్లో మోసం చేసిన వాడికి ఓటు వేయవద్దు. రాజకీయాల్లో తప్పు చేసిన వాడికి ఓటు వేస్తే 5 సంవత్సరాలు నష్టపోతాం. ఒక్కసారి జగన్‌కి ఓటు వేస్తే 30లక్షల మందికి ఇళ్లు ఇచ్చారు. ఇలాంటి వారికి ఓటు వేయాలి కదా. మా ప్రభుత్వం ఏనాడు మా పార్టీకి ఓటు వేయలేదని అడగలేదు. కానీ మేం అందరికి పథకాలు ఇచ్చాం. కరెంట్ బిల్ ఈ ఒక్క రాష్ట్రం లోనే పెరిగిందా. దేశం లో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. ప్రభుత్వం మీద విమర్శించడానికి ఏమీ లేక ధరల విషయంతో తికమక పెడుతున్నారు. అలాంటి వాళ్లని ఎదురు ప్రశ్నించండి. స్కూల్స్‌లో కార్పొరేట్ సదుపాయాలు కల్పించాం. పిల్లలకు సాక్స్ నుండి పుస్తకాలు, పౌష్టిక ఆహారం వరకు నాణ్యమైనవి ఇచ్చాం. పిల్లలకు ఓటు లేదని వాళ్లని వదిలేయలేదు. మంచి విద్యా అందిస్తున్నాం. ఈ వేళ చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పుకి కారణం ఎవరు. 3లక్షల 30 వేల కోట్ల పేద వాళ్లకి జగన్ అందించారు. పేదలకి నేరుగా డబ్బులు ఇచ్చారు. మధ్య దళారీ లు లేరు. అవనీతి లేని పాలన జరుగుతుంది. గ్రామ సచివాలయాలు వచ్చాయి. మండల కేంద్రంకి వెళ్లాల్సిన పని లేకుండా అన్ని పనులు సచివాలయంలోనే జరుగుతున్నాయి. మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. స్కిల్ స్కాం కేసులో ప్రజల డబ్బు చంద్ర బాబు సొంతానికి వాడుకున్నాడని నిరూపణ అయింది. కేంద్ర సంస్థలు చెప్తే పోలీస్‌లు అరెస్ట్ చేశారు. దొంగతనం చేస్తే ప్రభుత్వం ఊరుకోదు. ప్రజా ధనం దోచుకుంటే శిక్ష తప్పదు’ అని అన్నారు. -
వెల్లివిరిసిన సామాజిక చైతన్యం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలు.. రాష్ట్రంలో నేడు ఏ రంగంలో చూసినా వీరిదే అగ్రస్థానం. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించిన సామాజిక న్యాయం. అదే ఇప్పుడు రాష్ట్రమంతటా చైతన్యాన్ని రగిలించింది. జగన్నినాదమై మార్మోగుతోంది. సామాజిక సాధికారతై వెలుగులీనుతోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన వైఎస్సార్సీపీ ‘సామాజిక సాధికార’ బస్సు యాత్ర ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఏకకాలంలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సామాజిక విప్లవాన్ని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్తోంది. పార్టీకి చెందిన కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతల ఆధ్వర్యంలో సాగుతున్న యాత్రకు ప్రజలు అడగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో తమకు పట్టం కట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఏకమై కదలివచ్చారు. తమకు జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించారు. రాష్ట్రంలో గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని.. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆ వర్గాలకు చేసిన ద్రోహాన్ని వివరించి.. ఆ వర్గాలను ఏకం చేయడం ద్వారా 2024 ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టింది. ఈ యాత్ర గురువారం ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కోస్తాలో గుంటూరు జిల్లా తెనాలి, రాయలసీమలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గాల నుంచి ప్రారంభమైంది. ఇచ్ఛాపురంలో ఆ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, శింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఈ యాత్రకు నేతృత్వం వహించారు. ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో బహిరంగ సభలు జరిగాయి. మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర, సభలకు ప్రజలు పోటెత్తారు. సీఎం వైఎస్ జగన్ చేసిన సామాజిక న్యాయానికి నీరాజనాలు పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును మంత్రులు, నేతలు వివరించారు. ఆ ప్రసంగాలను ప్రజలు ఆసక్తిగా విన్నారు. ప్రసంగాల్లో నేతలు సీఎం వైఎస్ జగన్ పేరు ఎత్తగానే.. ‘మా నమ్మకం నువ్వే జగన్’.. ‘జగనన్నే మా భవిష్యత్తు’.. ‘జగనే రావాలి – జగనే కావాలి’ అంటూ జనం ప్రతిస్పందించారు. సామాజిక సాధికార యాత్ర రెండో రోజు శుక్రవారం ఉత్తరాంధ్రలో గజపతినగరం, కోస్తాలో నరసాపురం, రాయలసీమలో తిరుపతిలో జరగనుంది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద సామాజిక సాధికార యాత్రకు స్వాగతం పలుకుతున్న జనసందోహానికి అభివాదం చేస్తున్న మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు వెల్లువలా అభిమానం శ్రీకాకుళంలో ప్రారంభమైన బస్సు యాత్రకు నరసన్నపేట నియోజకవర్గం మడపాం, కోట బొమ్మాళి వద్ద ఘన స్వాగతం లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు, మహళలు వెల్లువలా తరలివచ్చారు. మడపాం వద్ద బాణసంచాతో స్వాగతం పలికారు. యాత్రలో భాగంగా మంత్రుల బృందం కంచిలి మండలం బూరగాం సచివాలయాన్ని సందర్శించి, అక్కడి సిబ్బందితో మాట్లాడారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. మద్యపానం మానుకోవాలని హితవు పలికారు. పలాస టి.కె.ఆర్.కల్యాణ మండపంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో మేధావుల సదస్సు నిర్వహించారు. ఇచ్ఛాపురంలో జరిగిన సభలో ప్రసంగించిన నేతలు జగన్ పేరు చెప్పిన ప్రతిసారీ ప్రజలు జయజయధ్వానాలు చేశారు. బడుగు జన కెరటం.. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో రూరల్ మండలం కొలకలూరులో ప్రారంభమైన బస్సు యాత్రకు, తెనాలిలో జరిగిన సభకు బడుగు జనులు కెరటంలా తరలివచ్చారు. సాయంత్రం 6.32 గంటలకు సభా ప్రాంగణానికి యాత్ర చేరగానే జనం జయజయధ్వానాలు చేశారు. అందరికీ అభివాదం చేస్తూ దళిత, ముస్లిం, బడుగు బలహీనవర్గాల ప్రజాప్రతినిధులు వేదికపైకి చేరుకున్నారు. సభకు ఎమ్మెల్యే శివకుమార్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ‘జగనన్న రథచక్రాలు రాష్ట్రంలో దూసుకెళుతున్నాయి’ అనగానే జై జగన్.. జైజై జగన్ అంటూ జనం నినదించారు. ‘నిజం నిగ్గు తేలినందునే బాబు బొక్కలోకి వెళ్లాడు..’ అనగానే జనం ‘నిజం...నిజం’ అంటూ కేకలు పెట్టారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించినపుడు కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ట్రాక్టర్లు, బైక్ ర్యాలీతో సామాజిక సాధికార యాత్రకు స్వాగతం పలుకుతున్న ప్రజలు జన సంతసం.. జగన్నినాదం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికారత బస్సు యాత్ర, బుక్కరాయసముద్రంలో జరిగిన సభ జన సంద్రాన్ని తలపించాయి. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఈ కార్యక్రమాలకు భారీగా తరలివచ్చారు. నియోజకవర్గ కేంద్రమైన శింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు డా. బీఆర్ అంబేడ్కర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘నాడు–నేడు’ పనుల ఫొటోలను పరిశీలించారు. అక్కడి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభించారు. బస్సు ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ చేశాయి. రోటరీపురం గ్రామం వద్ద ప్రజలు పూల వర్షం కురిపించారు. బుక్కరాయసముద్రం వద్ద యాత్రకు ప్రజలు స్వాగతం పలికారు. ఇక్కడ జరిగిన సభలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. సీఎం జగన్ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించిన సందర్భంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జాతీయ నేతలకు నివాళులు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా జరుగుతున్న సభల్లో పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు ముందుగా జాతీయ నేతలకు నివాళులర్పించారు. ప్రతి సభలో వేదికపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగజ్జీవన్‌రామ్, అల్లూరి సీతారామరాజు, భారతరత్న అబ్దుల్ కలాం చిత్రపటాలను, మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు, ఇతర నేతలు ఈ చిత్రపటాల వద్ద పుష్పాలు ఉంచి, నేతలకు నివాళులర్పించారు. అనంతరం సభ ప్రారంభించారు.