పెళ్లిపీటలెక్కనున్న హీరోయిన్ నిఖిత
వరుడు ముంబైకి చెందిన వ్యాపారవేత్త గగన్దీప్సింగ్
సాక్షి, బెంగళూరు: కన్నడ ప్రముఖ హీరోయిన్ నిఖితా తుక్రాల్ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. అక్టోబర్ 9న ముంబయికి చెందిన వ్యాపారవేత్త గగన్దీప్సింగ్, నిఖితల పెళ్లికి ఇరువురి కుటుంబాలు ముహూర్తాన్ని ఫిక్స్ చేసారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న తమకు వివాహం చేసేందుకు పెద్దలు అంగీకరించినట్లు హీరోయిన్ నిఖిత తెలిపారు.
ఈ నెల తొమ్మిదొవ తేదీన ముంబయిలోని ఓ స్టార్ హోటల్లో తమ వివాహం జరగనుందని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు నిఖిత తెలిపారు. వివాహం ఉత్తరాది సంప్రదాయం ప్రకారం జరుగనుందన్నారు. గురువారం మెహంది, సంగీత్ కార్యక్రమాలు జరుగనుండగా శని, ఆది వారాల్లో వివాహం జరుగనున్నట్లు ఆమె తెలిపారు. పెళ్లి అనంతరం సినిమాల్లో నటించడంపై భర్తతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని హీరోయిన్ నిఖిత తెలిపారు. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లోనూ నిఖిత నటించింది.