breaking news
frouad
-
సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు మోసం.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారు. అధికారంలోకి వస్తే.. జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి, 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతిచిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణంకూడా, అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు, కొన్ని చోట్లకే అంటున్నారు.ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే, మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటే, అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా? దగా కాదా?చంద్రబాబు ఇంతమోసం చేసికూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా మీరు అంటున్న మాటలు విని మహిళలంతా నివ్వెరపోతున్నారు. 2014-19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయచేసి, చివరికి వడ్డీసైతం ఎగరగొట్టి, తర్వాత మీరు వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలంతా మరోసారి చర్చించుకుంటున్నారు. మా ఐదేళ్లకాలంలో మేం చేసిన మంచినీ గుర్తు చేసుకుంటున్నారు. మా ప్రభుత్వ హయాంలో దేశంలో తొలిసారిగా మేం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తొలిఏడాది ఎగ్గొట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో పిల్లాడికి రెండేళ్లకు గాను రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.13 వేలే ఇచ్చారు. చాలా మంది పిల్లలకు అది కూడా అందలేదు. మొత్తం 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే, 30 లక్షల మంది పిల్లలకు కోతపెట్టారు.మహిళల స్వయం సాధికారత కోసం, వారి కాళ్లమీద వారు నిలబడేలా మేం హామీ ఇచ్చిన విధంగా ఆసరా కింద రూ.25,571 కోట్లు వారి చేతికే అందించాం. సున్నావడ్డీ కింద మరో రూ.5వేల కోట్లు అదనంగా ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మహిళల స్వయం ఉపాధికోసం చేయూత కింద ప్రతిఏటా ఆ అక్కచెల్లెమ్మలకు రూ.18,750ల చొప్పున 33,14,901 మందికి రూ.19,189.59 కోట్లు నేరుగా వారి చేతికే ఇచ్చి, అమూల్, పీ అండ్ జీ, హిందుస్థాన్‌లీవర్, మహీంద్రా, ఐటీసీ లాంటి ప్రఖ్యాత సంస్థలను బ్యాంకులతో అనుసంధానం చేస్తూ, వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తూ, బ్రహ్మాండంగా అమలు చేశాం. ఎప్పుడూలేని విధంగా కాపు నేస్తం కింద 4,62,878 మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.2,029 కోట్లు, మేనిఫెస్టోలో మేం పెట్టకపోయినా, అగ్రకులాల్లోని పేదలైన అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఈబీసీ నేస్తం కింద మరో 4,95,269 మందికి రూ.1,876 కోట్లు ఇచ్చాం. 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి, డ్వాక్రా రుణాలపై వారు కట్టాల్సిన వడ్డీని మా ప్రభుత్వమే భరిస్తూ రూ.4,969 కోట్లు చెల్లించాం. 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మలకే ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశాం. ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహిళా సాధికారతలో మా పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం, మా చిత్త శుద్ధికి నిదర్శనం.చంద్రబాబు మీరు… కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి, లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారు. చేయకూడని ద్రోహం చేస్తూ, పైగా ఇచ్చిన అరకొర బస్సుల్లో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటూ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నది మోసం కాదా? దగా కాదా?అంతేకాదు మీరు ఏడాదికి ఇస్తానన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించింది. గత ఏడాది మూడు సిలిండర్లకుగాను మీరు ఇచ్చింది ఒక్కటే. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే, ఏడాదికి మూడు సిలిండర్లకుగాను రూ.4,100 కోట్లు అవసరం. మొదటి ఏడాది ఇచ్చింది ఒక్క సిలిండర్. అదికూడా అందరికీ ఇవ్వలేదు. ఖర్చు చేసింది కూడా కేవలం రూ.764 కోట్లు. మిగిలిన 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతే. మూడు సిలిండర్లకోసం రూ.4,100 కోట్లకుగాను ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.747 కోట్లే. ఇది మోసం కాదా? దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ!’ విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్. .@ncbn గారూ మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 28, 2025 -
పునరావాసం పక్కా మోసం
మంగంపేట(ఓబులవారిపల్లె): దశాబ్దం కిందట మంగంపేట గనుల పరిధిలో డేంజర్‌జోన్‌గా ప్రకటించిన కట్టడాలను 14 రీచ్‌లుగా విభజించి ఏపీఎండీసీవారు రెవెన్యూ ద్వారా పరిహారం అందజేశారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇందులో 1వ రీచ్‌లో 90 ఇళ్లలకు రూ.2,97,61,320, 2వ రీచ్‌లో 78 కట్టడాలకు రూ.31.45లక్షలు పరిహారం నిర్వాసితులకు అందజేశారు. 3వ రీచ్‌లో 52 కట్టడాలకు రూ.19.35లక్షలు, 4వ రీచ్‌లో 78 కట్టడాలకు రూ.32.69 లక్షలు, 5వ రీచ్‌లో 209 కట్టడాలకు రూ.50.19 లక్షలు, 8వ రీచ్‌లో 31 కట్టడాలకు రూ.89.65 లక్షలు, 9వ రీచ్‌లో 172 కట్టడాలకు రూ.2.08కోట్లు, 10వరీచ్లో 231 కట్టడాలకు రూ.3.76కోట్లు, 11వ రీచ్‌లో 119 కట్టడాలకు రూ.2.29 కోట్లు, 12వ రీచ్‌లో 12కట్టడాలకు రూ.10.05 లక్షలు, 14వరీచ్లో 26కట్టడాలకు రూ.43.83 లక్షలు పరిహారం చెల్లించి వాటిని తొలగించారు. 1457 ఇళ్లు కూల్చివేత యుద్ధ ప్రాతిపదికన కట్టడాలు తొలగించే సందర్భంలో కొందరు నిర్వాసితులు ఇళ్లను తొలగించేందుకు సమ్మతించకపోవడంతో అధికారులు డోలాయమానంలో పడ్డారు. దీంతో అధికారులు నిర్వాసిత కుటుంబాలకు ఆరునెలల్లోపు పునరావాసం కల్పించడంతోపాటు తక్షణం ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీతోపాటు ఆరునెలలపాటు ప్రతి కుటుంబానికి నెలనెలా ఏపీఎండీసీ అద్దె చెల్లిస్తుందని హామీఇచ్చారు. ఉద్యోగం రాని కుటుంబాలకు పరోక్ష ఉపాధి కల్పిస్తామని ఆశ కల్పించడంతో గ్రామంలోని తమ 1,457 ఇళ్లను దగ్గరవుండి నిర్వాసితులు కూల్చివేయించారు. ఏపీఎండీసీ అధికారులు ఇచ్చిన హామీప్రకారం పునరావాస కేంద్రాల్లో కోట్లాదిరూపాయల వ్యయంతో మౌలిక వసతులు కల్పించారు. చక్రం తిప్పిన ఖద్దర్బాబులు ముందుగా కట్టడాలను తొలగించిన నిర్వాసితులకు 1వ పునరావాసంలో 1,100 కుటుంబాలకు నివాస స్థలాలు కల్పించారు. 2వ పునరావాస కేంద్రంలో 358, 3వ పునరావాస కేంద్రంలో 325, 4వ పునరావాస కేంద్రంలో 310 కుటుంబాలకు స్థలాలు కేటాయించారు. ఇక్కడే తిరకాసు మొదలైంది. రాజకీయంగా చక్రంతిప్పే ఒక్కొక్క ఖద్దరుబాబులు అధికారులతో కుమ్మకై మూడుప్లాట్ల నుంచి పదిప్లాట్ల వరకు కబ్జాచేసి సువిశాలమైన గృహాలను నిర్మించుకున్నారు. అంతేకాకుండా అప్పట్లో ప్రభుత్వ గృహనిర్మాణశాఖ అధికారులకు పెద్దఎత్తున చేతులు తడిపి ఏకంగా పక్కా గృహాలను మంజూరు చేపించుకుని దర్జాగా భవంతులు నిర్మించుకున్నారన్నారు. అధికారులకూ స్థలాలు ఇదేఅదునుగా భావించి ఫ్లాట్లు కేటాయింపునకు సర్వే నిర్వహించడానికి వచ్చిన రెవెన్యూ అధికారులు సైతం బినామీపేర్లతో పునరావాస కేంద్రంలో ప్లాట్లు పొందారు. వీరి నిర్వాకంతో ప్రస్తుతం కేటాయించిన పునరావాసంలో నిర్వాసితులు అందరికీ సరిపోవాల్సిన ఇంటి స్థలాలు చాలక ఏపీఎండీసీ ఇంకా లక్షల వ్యయంతో నిర్వాసితులకోసం భూములుకొని స్థలాలు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే 1,457 కట్టడాల కూల్చివేతకు 2,120 కుటుంబాలకు ఏపీఎండీసీ నివాసస్థలాలు ఏర్పాటుచేసింది. అయితే బస్టాండ్ ప్రాంతంలోని ఇంకా వందపైబడి నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఏపీఎండీసీ యాజమాన్యం వాస్తవాలను వెలికితీసి కబ్జాకు గురైన ప్లాట్లను గుర్తించి స్వాధీనపరుచుకుంటే ఇంటిస్థలాలు లేని నిర్వాసితులకు సరిపోతుందని స్థానికంగా అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కబ్జాకు గురైన స్థలాలు స్వాధీనానికి ఏపీఎండీసీ చొరవ చూపిస్తుందా లేక రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తుందా అని బాధితులు ఎదురుచూస్తున్నారు. అధికారులకు బినామీ ప్లాట్లు కట్టబెట్టారు గనుల విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయిన అర్హులైన నిర్వాసితులకు నివేశస్థలాలు ఇవ్వకుండా ఏపీఎండీసీకి చెందిన కొందరు అధికారులు బినామీ పేర్లతో ప్లాట్లను అక్రమంగా పొందారు. ఇప్పటికైనా ఏపీఎండీసీపై అధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుని అర్హులైన నివేశçస్థలాలు ఇప్పించాలి. – తల్లెం భరత్కుమార్రెడిడ, కాపుపల్లె, మంగంపేట. ఏళ్లుగా నివేశస్థలాలు కేటాయించలేదు గనుల విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయాము. ఏపీఎండీసీ అధికారులు ఇప్పటివరకు మాకు నివేశస్థలాలు కేటాయించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంగంపేట ఆర్ఆర్సెంటర్ సమీపంలో నివేశస్థలాలు కేటాయిస్తే బాగుంటుంది. – షేక్ కరిముల్లా, మంగంపేట. ఇల్లు కోల్పోయిన వారికే నివాసస్థలం కల్పించాం గనుల విస్తరణలో ఇల్లుకోల్పోయిన నిర్వాసితులకే పునరావాసంలో నివాసస్థలం కేటాయించాం. ఎవ్వరికీ అదనంగా నివాసస్థలాలు ఇవ్వలేదు. అప్పట్లో ఉన్న ఏపీఎండీసీ అధికారులు, రెవిన్యూవారు ప్లాట్లువేసి ఇల్లు కోల్పోయిన వారిప్లాట్లు కేటాయింపు జరిగి ఉంటుంది. – రాచమల్లు కేథార్నాథ్రెడ్డి, సిపివో, మంగంపేట.