fresher
-
'ఇన్ఫోసిస్‌లో 20వేల ఉద్యోగాలు'
గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న సమయంలో.. ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది.ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేతనాల పెంపుకు సంబంధించిన ఒక అప్డేట్ గురించి, విలేకర్ల సమావేశంలో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'జయేష్ సంఘ్రాజ్కా' మాట్లాడుతూ.. ఎక్కువ మందికి జనవరిలోనే జీతాల పెంపు జరిగింది. మిగిలినవారికి జీతాల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇన్ఫోసిస్‌లోని చాలా మంది ఉద్యోగుల జీతాల పెంపు సగటున 5-8 శాతం వరకు ఉంటుంది. ఇది గడచిన సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే కంపెనీలు అత్యుత్తమ పనితీరును కనపరచిన ఉద్యోగులకు జీతం 10-12 శాతం పెంచినట్లు సమాచారం.నియామకాల అంచనాజీతాల పెంపు గురించి మాత్రమే కాకుండా.. ఉద్యోగ నియామకాలను గురించి కూడా ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్కా వెల్లడించారు. భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని స్పష్టం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 6,388 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 323,578కి చేరుకుంది.ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలుగతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ పనితీరు నిరాశ పరచింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 7,033 కోట్లకు పరిమితమైంది. 2023–24 ఇదే కాలంలో రూ. 7,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్ సాధించింది.ఇదీ చదవండి: అల్లుడితో కలిసి ఏడెకరాలు కొన్న నటుడు.. భూమి విలువ ఎన్ని కోట్లంటే?అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం 3.3 శాతం పుంజుకోగా.. ఆదాయం 2 శాతం నీరసించింది. కాగా.. పూర్తి ఏడాదికి నికర లాభం 2 శాతం వృద్ధితో రూ. 26,713 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 1,62,990 కోట్లకు చేరింది. వెరసి గత ఆదాయ గైడెన్స్ 4.5–5 శాతాన్ని అధిగమించింది. అతిపెద్ద కాంట్రాక్ట్‌తో కలిపి గతేడాది 11.6 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు సాధించింది. వీటిలో 56 శాతం కొత్త ఆర్డర్లే! -
ఫ్రెషర్లకు పిడుగులాంటి వార్త!.. కొత్త ఉద్యోగాల్లో...?
-
డిగ్రీ ఉన్నా..లేకపోయినా భారీ ఉద్యోగాలు.. లింక్డ్ఇన్ నివేదిక
డిజైన్, అనలిటిక్స్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న ఫ్రెషర్లకు అధిక ఉద్యోగావకాశాలున్నట్లు లింక్డ్ఇన్ కెరీర్ స్టార్టర్ 2024 నివేదిక వెల్లడించింది.నివేదికలోని వివరాల ప్రకారం..2024లో కంపెనీలు పనిప్రదేశాల్లో సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగాలు 15% తగ్గాయి. ఎంట్రీలెవల్ ఉద్యోగాల కోసం కంపెనీలు హైబ్రిడ్ వర్క్‌కల్చర్‌ను 52% పెంచాయి. దాంతో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు పనిచేసేందుకు వీలుగా కంపెనీలు మార్పులు చేస్తున్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యుటిలిటీస్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చమురు, గ్యాస్, మైనింగ్, రియల్ ఎస్టేట్, కస్టమర్ సర్వీస్ రంగాల్లో ఫెషర్లను ఎక్కువగా నియమించుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ , సిస్టమ్ ఇంజినీర్, ప్రోగ్రామింగ్ అనలిస్ట్ వంటి ఉద్యోగాల్లో ఫ్రెషర్లను ఎంపికచేస్తున్నారు. కమ్యూనిటీ, సోషల్ సర్వీసెస్, లీగల్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. డిగ్రీ పూర్తిచేయని వారికి విద్య, సాంకేతికత, సమాచారం, మీడియా, మానవ వనరులు, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగంలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. డిగ్రీలేనివారు సైతం సాఫ్ట్వేర్ ఇంజినీర్, సెక్రటరీ, డిజైన్ ఇంజినీర్ వంటి ఉద్యోగాల్లో తమ కెరియర్ ప్రారంభించవచ్చు.ఇదీ చదవండి: సముద్రంలో పెళ్లివేడుకలకు బయలుదేరిన తారలులింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్ అండ్ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరజితా బెనర్జీ మాట్లాడుతూ..‘కంపనీల్లో ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. విభిన్న విద్యా నేపథ్యాలు కలిగిన నిపుణులను ఎంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఉద్యోగంకోసం చూస్తున్నవారు నిత్యం తమ నైపుణ్యాలను పెంచుకోవాలి’ అని చెప్పారు. -
వీడెవండి బాబు.. వారానికి 4 రోజుల పని.. రూ.50 వేల జీతం.. ఇవి సరిపోతాయా సార్!
ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కాలేజ్‌లో ఎంత బాగా చదివిన ఎన్ని మార్కులు వచ్చినా .. జాబ్‌కు దగ్గరకు వచ్చే సరికి అవన్నీ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లడం వరకు మాత్రమే పని చేస్తాయి. అక్కడి నుంచి ఉద్యోగం తెచ్చుకోవడం మన స్కిల్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక అంత కష్టపడి జాబ్ వచ్చాక మనకు నచ్చినట్లు ఉండాలంటే కదరదు. రోజూ 8 గంటల పని.. ఇక ఆఫీసులో క్షణం తీరిక లేకుండా సంస్థను మెప్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగి దినచర్య అంటే ఇలానే ఉంటుంది. అయితే ఇటీవల ఓ ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేయగా.. అతని డిమాండ్లు చూసి ఇంటర్వ్యూర్ షాక్ అయ్యాడు. ఈ విషయాన్నే సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. కోల్‌కతాలోని ఒక న్యాయవాది ఇటీవల లిటిగేషన్ అసోసియేట్ పోస్ట్ కోసం ఒక ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఇంటర్య్వూకి వచ్చిన ఆ అభ్యర్థి తనుకు ఉన్న డిమాండ్లతో పాటు రూ. 50,000 జీతం కావాలని చెప్పడట. దీంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. 'లిటిగేషన్ అసోసియేట్ పోస్ట్ కోసం ఓ ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేశాను. అతను పని చేయాలంటే.. తనకి వారంలో 4 రోజులు, రోజుకు 4 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పాడు. అలాగే కోర్టుకు వెళ్లడం కూడా తనకి ఇష్టం లేదని, అందుకే ఆఫీసులో ఉండి చేసే ఉద్యోగం కావాలని చెప్పాడు. కోల్‌కతలో ఉద్యోగం కాబట్టి జీతం రూ.50 వేలు ఇవ్వాలన్నాడు. ఈ తరానికి నా ఆశిస్సులు.' అని అన్నారు. కోల్‌కతాలో జీవన వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ కంపెనీ మెర్సెర్ ప్రపంచ వ్యాప్తంగా 227 నగరాలపై కాస్ట్ ఆఫ్ లివింగ్ 2023 సర్వే నిర్వహించగా అందులో కోల్‌కతా 211వ స్థానంలో నిలించింది. అంటే చాలా తక్కువ ఉంటుందని దాని అర్థం. ముంబై, ఢిల్లీ వంటి నగరాలు భారతీయ నగరాల్లో అగ్ర స్థానాల్లో ఉన్నాయి. కోల్‌కతా వంటి నగరాలలో ఉండి కూడా.. ఒక ఫ్రెషర్ అయ్యిండి అంత ఎక్కువ శాలరీతో పాటు ఇన్ని డిమాండ్ చేయడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలా అయితే ఎక్కడ ఉద్యోగం రాదని కామెంట్ చేయగా.. మరికొందరు ఈ డిమాండ్లు సరిపోతాయా అంటూ కామెంట్లు పెడుతున్నారు. Interviewed a fresher for a litigation associate post who wants 4 days work week, 4 hrs/day work (because he doesn't like going to court and will only be in chamber he said), and 50K salary in Kolkata. Bless this generation. ❤️ — Jhuma (@courtinglaw) July 23, 2023 చదవండి రోడ్డుకు అడ్డంగా పడుకుని పోలీసు వినూత్న నిరసన.. ఏం జరిగిందంటే? -
బెంగళూరులో బతకాలంటే ఎంత జీతం కావాలి? ట్విటర్లో ఆసక్తికర చర్చ
ప్రపంచవ్యాప్తంగా ఏ అంశంపైనైనా బహిరంగ చర్చలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (Twitter) వేదికగా నిలుస్తోంది. చిన్నపాటి సమస్యలను ఇంటర్నెట్లో చర్చకు పెట్టి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు నెటిజెన్లు. ట్విటర్లో బాగా చర్చ జరుగుతున్న ఓ పోస్ట్ గురించి మీకు తెలియజేస్తున్నాం. ఇషాన్ శర్మ అనే క్రియేటర్, కోడర్.. బెంగళూరులో జీవించడానికి అవసరమైన కనీస జీతం గురించి ట్విటర్లో యూజర్లను అడిగారు. ఈ పోస్ట్‌కి కొన్ని యూజర్ల నుంచి ఆసక్తికరమైన రిప్లయిలు వచ్చాయి. (బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం: మహిళలకు షాకింగ్ ప్రశ్నల దుమారం) ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. డబుల్ డిజిట్ బాటలో వేతన ఇంక్రిమెంట్లు 2023లో ప్రస్తుతం ఉన్న ఖర్చులకు అనుగుణంగా పీజీలో ఉండే ఫ్రెషర్‌కు రూ.30,000, ఫ్లాట్‌లో ఉండే ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాచిలర్లకు రూ. 50,000, పెళ్లయిన వారికి రూ. 75,000, టూబీహెచ్‌కే ఫ్లాట్‌లో పిల్లలతో ఉండేవారికి రూ. 1,00,000 ప్రతి నెలా చేతిలో ఉండాలని ఓ యూజర్ రాసుకొచ్చారు. అక్కడ ఎంత సంపాదించినా తక్కువే అని మరో యూజర్ రిప్లయి ఇచ్చారు. అలాగే మరికొందరు తమకు తోచిన విధంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొన్ని నెలల క్రితం జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఒక మహిళ చేసిన ట్వీట్ కూడా చర్చకు దారితీసింది. మెట్రో నగరంలో జీవించడానికి ఫ్రెషర్‌కు నెలకు రూ. 50,000 కూడా సరిపోదని ఆమె పేర్కొన్నారు. ఇదీ చదవండి: మాదేం లేదు! వర్క్ ఫ్రం ఆఫీస్‌పై ఇన్ఫోసిస్ సీఈవో కీలక వ్యాఖ్యలు What is the bare minimum salary a fresher needs to survive and work in Bengaluru?👀 — Ishan Sharma (@Ishansharma7390) June 29, 2023 Following should be the "ideal" cash in hand for 2023 cost of living (considering no liabilities) : fresher in a PG (22): 30,000 experienced bachelor in a flat (26): 50,000 married working couples (30): 75,000 married with a child in a 2BHK (34): 1,00,000 — Finance💰 Films 🎬 Tech 📱 (@souvikdas17) June 29, 2023 -
ఫ్రెషర్స్‌కే అధిక ఉద్యోగాలు
• ఏప్రిల్ నాటికి లక్షకు చేరనున్న క్యాప్‌జెమిని ఉద్యోగులు • కంపెనీ భారత్ సబ్సిడరీ చీఫ్ వెల్లడి ముంబై: ఐటీ కంపెనీ క్యాప్‌జెమిని భారత్‌లోని ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి లక్షను చేరనున్నది. రక్షణాత్మక విధానాలపై ఆందోళనలు ఉన్నప్పటికీ, కొత్త ఉద్యోగాలు అధికంగానే ఇస్తామని క్యాప్‌జెమిని తెలిపింది. ఫ్రెషర్స్‌కే అధిక ఉద్యోగాలు ఇస్తామని క్యాప్‌జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ కందుల చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్య 98,800గా ఉందని, ఈ ఏడాది ఏప్రిల్ చివరినాటికి ఈ సంఖ్య లక్షకు పెరుగుతుందని పేర్కొన్నారు. ముంబై ప్రధాన కేంద్రంగా తొమ్మిది నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో భారతీయులు ఉద్యోగులుగా ఉన్న విదేశీ ఐటీ కంపెనీల్లో ఇది మూడవది. యాక్సెంచర్, ఐబీఎమ్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ‘వీసా’ ఇబ్బందులు లేవు.. నియామకాల కోసం తాము సందర్శిస్తున్న క్యాంపస్‌ల సంఖ్య, ఇస్తున్న ఉద్యోగ ఆఫర్ల సంఖ్య పెరుగుతున్నాయని శ్రీనివాస్ చెప్పారు. రక్షణాత్మక విధానాలు తమపై ప్రభావం చూపబోవని, ఆటోమేషన్ జోరు పెరిగితేనే హైరింగ్ మందగిస్తుందని వివరించారు. తాము ఎక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తే అక్కడి వారికే ఉద్యోగాలిస్తామని, అందుకని హెచ్ 1–బి వీసా ఇబ్బందులు తమపై ఉండవని వివరించారు. వీసా ఆంక్షలు ఉన్నప్పటికీ, అత్యున్నత ప్రతిభ గల అభ్యర్థులకు ఆహ్వానం పలుకుతామని చెప్పారు. ప్రతిపాదిత వీసా నిబంధనలపై స్పం దన అతిగా ఉందని విమర్శించారు. డిజిటల్‌కు మారడం, ఆటోమేషన్, క్లౌడ్..ఐటీ రంగంలో ప్రస్తుతమున్న పెద్ద సమస్యలని పేర్కొన్నారు. 25 వేలమంది ఉద్యోగులతో కూడిన ఐ గేట్ విలీనం విజయవంతంగా పూర్తయిందన్నారు.