breaking news
French Open 2017
-
శ్రమించిన ముర్రే
పారిస్: బ్రిటన్ స్టార్, వరల్డ్ నంబర్‌వన్ ఆండీ ముర్రే ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్ దాటేందుకు చెమటోడ్చాడు. ఈ టాప్ సీడ్ ఆటగాడికి స్లోవేకియా ప్లేయర్ మార్టిన్ క్లిజాన్ గట్టిపోటీనిచ్చాడు. గురువారం జరిగిన రెండో రౌండ్లో చివరకు 6–7 (3/7), 6–2, 6–2, 7–6 (7/3)తో నెగ్గిన ముర్రే ఊపిరి పీల్చుకున్నాడు. టాప్ సీడ్ ముర్రేతో జరిగిన పోరులో స్లోవేకియా ఆటగాడు క్లిజాన్ స్ఫూర్తిదాయక పోరాటం చేశాడు. దీంతో రెండు సెట్లు టైబ్రేక్‌కు దారితీశాయి. చివరకు అనుభవజ్ఞుడైన బ్రిటన్ స్టార్‌దే పైచేయి అయింది. అతనితో పాటు వావ్రింకా, సిలిచ్, నిషికొరి ఫ్రెంచ్ ఓపెన్గ్రాండ్ స్లామ్ ఈవెంట్లో మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల విభాగంలో ఐదో సీడ్ స్వితోలినా, రద్వాన్‌స్కా, వెస్నినా మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. వావ్రింకా కూడా... ఇతర మ్యాచ్‌లలో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–4, 7–6 (7/5), 7–5తో డొల్గొపొలొవ్ (ఉక్రెయిన్)పై, ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 6–2, 6–2తో క్రావ్చుక్ (రష్యా)పై, 8వ సీడ్ నిషికొరి (జపాన్) 6–3, 6–0, 7–6 (7/5) జెరిమి చార్డి (ఫ్రాన్స్)పై, 21వ సీడ్ ఇస్నర్ (అమెరికా) 6–3, 7–6 (7/3), 7–6 (7/2)తో లోరెంజి (ఇటలీ)పై, 28వ సీడ్ ఫాంగ్నిని (ఇటలీ) 6–4, 7–5, 6–3తో అండ్రిస్ సెప్పి (ఇటలీ)పై గెలుపొం దారు. రష్యా ఆటగాడు కచనోవ్ 7–5, 6–4, 6–4తో 13వ సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)కు షాకిచ్చాడు. 29వ సీడ్ డెల్ పొట్రో (అర్జెంటీనా)తో జరిగిన పోరులో 3–6, 6–3, 1–1 స్కోరు వద్ద అల్మాగ్రో (స్పెయిన్) రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరగడంతో డెల్ పొట్రో ముందంజ వేశాడు. 18వ సీడ్ కిర్గియోస్ (ఆస్ట్రేలియా) 7–5, 4–6, 1–6, 2–6తో అండర్సన్ (దక్షిణాఫ్రికా) చేతిలో కంగుతిన్నాడు. రద్వాన్‌స్కా ముందంజ మహిళల సింగిల్స్‌లో పోలండ్ క్రీడాకారిణి, తొమ్మిదో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. రెండో రౌండ్లో ఆమె 6–7 (3/7), 6–2, 6–3తో వాన్ విత్వాన్చ్ (బెల్జియం)పై గెలుపొందింది. మిగతా మ్యాచ్‌ల్లో 20వ సీడ్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)కు 4–6, 1–6తో కార్నెట్ (ఫ్రాన్స్) చేతిలో చుక్కెదురైంది. ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 3–6, 6–3, 6–2తో పిరొంకొవా (బల్గేరియా)పై, 14వ సీడ్ ఎలీనా వెస్నినా (రష్యా) 4–6, 6–3, 6–0తో లెప్చెంకో (అమెరికా)పై గెలుపొందారు. 17వ సీడ్ అనస్తాసిజా సెవస్తొవా (లాత్వియా) 6–3, 6–0తో బౌచర్డ్ (కెనడా)పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ తొలిరౌండ్లో రోహన్ బోపన్న జోడి శుభారంభం చేసింది. ఏడో సీడ్ బోపన్న–దబ్రోస్కీ (కెనడా) జోడి 6–0, 6–1తో జెస్సికా మూర్–మ్యాట్ రీడ్ (ఆస్ట్రేలియా) జంటపై అలవోక విజయం సాధించింది. -
ఫ్రెంచ్ ఓపెన్: తొలి రోజే సంచలనం!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ లో తొలిరోజే సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, జర్మనీ భామ ఏంజెలికా కెర్బర్ కు ఊహించని షాక్ తగిలింది. వరుసగా రెండో ఏడాది తొలి రౌండ్లోనే కెర్బర్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంది. ఆదివారం సాయంత్రం ఇక్కడి రోలాండ్ గారోస్ లో జరిగిన మ్యాచ్ లో రష్యా క్రీడాకారిణి మకరోవా చేతిలో 6-2, 6-2 తేడాతో కెర్బర్(జర్మనీ) ఓటమి పాలైంది. రెండు వరుస సెట్లలో రష్యా భామ తన ప్రతాపం చూపించి, నంబర్ వన్ ర్యాంకర్ ను ముప్పుతిప్పలు పెట్టింది. ఇప్పటికే ఈ గ్రాండ్ స్లామ్ లో మహిళల సింగిల్స్ విభాగంలో సెరెనా విలియమ్స్, షరపోవా గైర్హాజరీతో కచ్చితమైన ఫేవరెట్ కనిపించడంలేదు. నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ), డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్)లతో పాటు మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), 13వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) టైటిల్ రేసులో ఉన్నారని అందరూ ఊహించారు. కానీ కెర్బర్ సాధారణ ప్రదర్శనతో రోలాండ్ గారోస్ నుంచి తొలి రౌండ్లోనే ఓడిపోయి ఇంటి దారి పట్టింది.