breaking news
free visit
-
భారతీయులకు గుడ్‌న్యూస్.. ఆ దేశానికి వెళ్లాలంటే నో ‘వీసా’
కౌలాలంపూర్: విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్‌న్యూస్. తాజాగా మలేషియా ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశానికి వెళ్లొచ్చు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని, వీసా లేకుండా 30 రోజుల పాటు తమ దేశంలో ఉండొచ్చని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. అయితే, ఈ అవకాశాన్ని భారతీయులతో పాటు చైనా దేశస్తులకు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిచేందుకు మలేషియా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ఇందులో భాగంగానే పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మలేషియా ప్రభుత్వం భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశంలోకి అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. ఈ సందర్బంగా మలేషియా ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి ముఖ్యమని తెలిపారు. ఈ క్రమంలో చైనా, భారత పౌరులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి చైనా, భారతీయ పౌరులు వీసా లేకుండా మలేషియాలో పర్యటించే వీలుంటుందని స్పష్టంచేశారు. తమ దేశంలోకి ప్రవేశించాక 30 రోజుల పాటు ఉండొచ్చని వెల్లడించారు. ఇక, భారతీయులకు వీసా అవసరం లేకుండానే పర్యటించే సౌలభ్యాన్ని ఇటీవల థాయిలాండ్, శ్రీలంక ప్రభుత్వాలు కూడా కల్పించాయి. నవంబర్ 10 నుంచి థాయిలాండ్ దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇక, భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అక్టోబర్ నెలలోనే శ్రీలంక అనుమతినిచ్చింది. #Malaysia will grant 30-day visa-free travel for #Chinese citizens starting Dec. 1 this year, Prime Minister Anwar Ibrahim announced on Sunday. pic.twitter.com/YvmGPe1rY6 — iChongqing (@iChongqing_CIMC) November 27, 2023 -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.500ల గదులు ఖాళీ లేవు. రూ.50, రూ.100ల గదులు లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఉచిత గదులు - ఖాళీ లేవు, రూ.50 గదులు - 25, రూ.100 గదులు - 45 ఖాళీగా ఉన్నాయి, రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం: 88, సహస్రదీపాలంకరణ సేవ: 222 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం : 131 ఖాళీగా ఉన్నాయి మంగళవారం ప్రత్యేక సేవ : అష్టదళ పాదపద్మారాధన -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో శనివారం స్వామివారి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 4గంటలు సమయం పడుతోంది. కాగా, శుక్రవారం 66,887 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం 17 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. గదులు ఏవీ ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది. గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ: 60 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం : ఖాళీ లే వు