breaking news
former Congress MLA
-
మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు.. వీడియో వైరల్
బిలాస్పూర్లో కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై గుర్తు తెలియని దుండగులు 12 రౌండ్లు కాల్పులు జరిపారు. శుక్రవారం.. బిలాస్‌పూర్‌లోని తన నివాసంలో జరిగిన ఈ కాల్పుల్లో ఠాకూర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు సెక్యురిటీ అధికారి కూడా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలుకు బుల్లెట్ దిగినట్లు సమాచారం. ఈ దాడి ఎవరు చేశారనేదానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.ఠాకూర్‌ను మొదట సురక్షిత ప్రదేశానికి తరలించగా, ఆయన పీఎస్ఓను నేరుగా ఆసుపత్రికి తరలించారు. తరువాత, ఠాకూర్‌ను కూడా ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం బిలాస్పూర్ ప్రాంతీయ ఆసుపత్రి నుండి ఎయిమ్స్ బిలాస్‌పూర్‌కు తరలించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. बंबर ठाकुर पर गोली लगने का CCTV आया सामने#Bilaspur #BumberThakur #CCTVVideo #HimachalPradesh pic.twitter.com/PEdY1VMye9— Punjab Kesari-Himachal (@himachalkesari) March 14, 2025 -
మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి
టీనగర్: మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నమ్మాళ్ మృతిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, పీఎంకే నేత రాందాస్, వీసీకే నేత తిరుమావళవన్, టీఎంసీ నేత వాసన్ తదితరులు సంతాపాలు ప్రకటించారు. రాహుల్ గాంధీ తన ప్రకటనలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఝాన్సీరాణి అవ్వ, సీనియర్ మహిళా నేత పొన్నమ్మాళ్ మృతి వార్త విని ఆవేదన చెందానని, ఆమె ఎడబాటుతో బాధపడుతున్న ఝాన్సీరాణి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుకుంటున్నానన్నారు. ఆమె మృతి రాష్ట్ర కాంగ్రెస్‌కు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె తన జీవితాంతం పార్టీ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల పురోగతికి కృషి చేశారని తెలిపారు. వీసీకే నేత తిరుమావళవన్ తన ప్రకటనలో నిలకోట్టై, చోళవందాన్ నియోజకవర్గాలలో రాష్ట్ర అసెంబ్లీకి ఏడు సార్లు ఎన్నికయ్యారన్నారు. తాత్కాలిక స్పీకర్‌గాను సేవలందించారన్నారు. ఇదేవిధంగా పలువురు నేతలు తమ సంతాపాలు ప్రకటించారు.