breaking news
Form -16
-
ఫారం 16లో జరిగిన మార్పులు ఇవే.. గమనించారా?
2024–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారంలో 16 మార్పులు వచ్చాయి. మీ యజమాని ఈ మార్పులు చేసిన తర్వాత మీకు ఫారం 16 జారీ చేస్తారు.ఫారం 16 అంటే ఏమిటి?యజమాని తన దగ్గర చేసే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం జారీ చేసేది ఫారం 16. ఇందులో మొదటి భాగంలో ఉద్యోగులు, యజమాని ప్రాథమిక వివరాలు ఉంటాయి. రెండో భాగంలో జీతభత్యాలకి సంబంధించిన పూర్తి వివరాలు .. అంటే జీతాలు, అలవెన్సులు, టాక్సబుల్ ఇన్‌కం వివరాలు, మినహాయింపులు, తగ్గింపులు, డిడక్షన్లు, నికరజీతం లేదా ఆదాయం, టీడీఎస్ వివరాలు ఉంటాయి. ‘సులభతరం, పారదర్శకత, స్పష్టత’ అనే లక్ష్యాలతో ఫారం 16 రాబోతోంది.ఫారం 16 చాలా ముఖ్యమైంది..రిటర్నులు వేయడానికి మొదటగా చూసే డాక్యుమెంటు ఇదే. లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు, రుణ సంస్థలు ఈ ఫారంనే ప్రాతిపదికగా తీసుకుంటాయి. ఈ ఫారంతో ఉద్యోగి ‘రుణ స్తోమత’ నిర్ధారిస్తారు. దీంతోనే పన్ను భారం, చెల్లింపులు నిర్ధారించవచ్చు. రీఫండు కోసం కూడా ఇదే ఫారంని ‘బేస్’గా తీసుకుంటారు. ఎందుకంటే, పన్ను వసూలు చేయడం, దాన్ని ప్రభుత్వానికి చెల్లించడాన్ని దీని ద్వారానే నిర్ధారించుకుంటారు. ఇవే అంశాలు 26ఏఎస్‌లో ఉంటాయి.ప్రతి మూడు నెలలకు సమ్మరీ, జీతం, టీడీఎస్ చెల్లించినది, గవర్నమెంటుకు ఎలా చెల్లించారు, ఏ బ్యాంకు ద్వారా చెల్లించారు, ఏ తేదీన కట్టారు, చలాన్ నంబరు ఎంత వగైరా వివరాలన్నీ ఉంటాయి. జీతం, అలవెన్సులు, బోనస్‌లు, ఏరియర్స్, సెక్షన్ 10 ప్రకారం మినహాయింపులు, ఇంటి అద్దె అలవెన్సు, గ్రాట్యుటీ మొదలైన అన్ని డిడక్షన్లు 80 C నుంచి 80 TTA వరకు ఉంటాయి. ఆ తరువాత పన్ను భారం లెక్కింపులు, స్టాండర్డ్ డిడక్షన్లు ఉంటాయి. 89(1) రిలీఫ్ కూడా ఉంటుంది. వచ్చిన మార్పులు ఏమిటంటే..80 ఇఇఏ ప్రకారం అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కి ఇచ్చిన విరాళాలకు సంబంధించిన మినహాయింపు ఉంటుంది. జీతాలకు సంబంధించిన అంశాలు వర్గీకరిస్తారు. హెచ్ఆర్ఏకి సంబంధిత వివరాలుంటాయి. అలాగే రెంట్‌ఫ్రీ వివరాలు, ఇతర ప్రిరిక్వజిట్లు, ప్రతి డిడక్షన్‌కి సంబంధించి మరిన్ని వివరాలు పొందుపరుస్తారు. కొత్త కాలమ్ ద్వారా టీడీఎస్, టీసీఎస్కి సంబంధించిన వివరాలు తెలిసేలా, సరి చేసుకునే వీలు కల్పించడానికి ఫారం 24 Q టీడీఎస్/టీసీఎస్ రిటర్నులు కనిపించేలా చేస్తారు. దీనివల్ల 26 Aను అప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్మీరు చేయాల్సిందేమింటంటే..ఫారం 16 యజమాని ఇచ్చే సర్టిఫికేట్. ఇది విలువైంది. ఎందుకంటే ఇది మీ టీడీఎస్, టీసీఎస్ రికవరీ అయినట్లు... చెల్లించినట్లు. గవర్నమెంటు చేతికందినట్లూ. మీ ఖాతాలో జమ అయినట్లు ధృవీకరించే ఏకైక పత్రం. అయితే ఇందులో ప్రతి అంశాన్ని మీరే సరి చూసుకోవాలి. నెలసరి శాలరీ స్లిప్పులతో మినహాయింపు, తగ్గింపులు... మొదలైనవి చెక్ చేసుకోవాలి. మీరు ఇచ్చే ఆదాయపు వివరాలు ఉన్నాయా లేదా ఎక్కువ పడ్డాయా చెక్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన కాగితాలు భద్రపరుచుకోవాలి. మీరు కొత్త రెజీమ్‌లో ఉన్నారా లేక పాత పద్ధతిలో ఉన్నారో చెక్ చేసుకొండి. మీరు సంవత్సరంలో ఉద్యోగం మారితే రెండు ఫారం 16లు ఉంటాయి. అప్పుడు రిపోరి్టంగ్లో హెచ్చు తగ్గులు... డబుల్ క్లయిమ్/తప్పుడు క్లయిమ్ ఉండొచ్చు. చెక్ చేసుకోండి. యజమానికి అంటే ‘డిస్బర్సింగ్’ అధికారి ఇవన్నీ అదనపు భాద్యతలు... తగిన జాగత్ర వహించాలి. గతంలో ఏర్పడిన ఇబ్బందులు, సమస్యలు కొత్త ఫారమ్ 16 వల్ల రావని ఆశిద్దాం! ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
విదేశాల్లో ఉన్నారు.. ఇన్‌కంట్యాక్స్ ఫైల్ చేయడం ఎలా?
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా. రిటర్న్ వేయకుండా ఉంటే పెన్షన్ ఉండదంటున్నారు చాలా మంది. – కే.యస్. చైతన్య, హైదరాబాద్ రిటర్నులు వేయకపోతే ఎటువంటి నోటీసులు రావు అని, ఎవరికీ తెలియదు అని.. ఏమీ అడగరు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. అపోహ మాత్రమే. ఈ వాదనలో ఎటువంటి పసలేదు. చట్టరీత్యా మీకు ట్యాక్సబుల్ ఇన్‌కం దాటి ఆదాయం ఉంటే, మీరే స్వంతంగా రిటర్న్ దాఖలు చేయాలి. అది మీ విధి. కర్తవ్యం. పరోక్షంగా మీరు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నారన్న మాట. మనం కట్టే పన్నుల్లో నుంచే దేశాభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇక మరో విషయం ఏమిటంటే ఇది మీ స్టేటస్ సింబల్ .. గౌరవం కూడా. అటు పైన మీరు రుణం తీసుకోవాలన్నా బ్యాంకర్లు, ఇతరులు.. అందరూ అడిగే మొట్టమొదటి డాక్యుమెంట్ మీ ఇన్‌కం ట్యాక్స్ రిటర్నే. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవహారాలు చేయాలంటే పాన్ ఉండాల్సిందే. బ్యాంకు అకౌంట్ తెరవాలంటే పాన్ ఉండాలి. విదేశీయానానికి కావాల్సిన వీసా తీసుకోవడానికి వెళ్లాలన్నా ఈ డాక్యుమెంట్లు ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాపారం, వృత్తి చేయాలంటే, స్థిరాస్థుల క్రయవిక్రయాల్లో, ఇన్సూరెన్స్‌లో, ఇన్వెస్ట్మెంట్లలో .. ఇలా ఎన్నో రోజువారీ కార్యకలాపాలకు పాన్ తప్పనిసరి. కాబట్టి రిటర్ను వేయడం మానేయడం కన్నా వేస్తే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. మా అత్తగారు, మావగారు ప్రస్తుతం మాతో అమెరికాలో ఉన్నారు. వచ్చే జనవరి వరకు భారత్‌కి రారు. గడవు తేదిలోగా రిటర్ను వేయలేకపోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి – పాలగుమ్మి అరుణ, వర్జీనియా (ఈమెయిల్ ద్వారా) మీ అత్తగారు, మావగారి దగ్గర ఆదాయానికి సంబంధించి పూర్తి సమాచారం సిద్ధంగా ఉంటే మీరు అక్కడి నుంచే ఆన్లైన్లో రిటర్నులు దాఖలు చేయవచ్చు. దీనినే ఈ–ఫైలింగ్ అంటారు. ఇది సులువు. త్వరగా అవుతుంది. కష్టపడక్కర్లేదు. డిపార్ట్మెంట్ వీటిని త్వరితగతిన ప్రాసెసింగ్ చేస్తారు. సెప్టెంబర్ 2021లో వేసినవారికి అక్టోబర్‌లో రిఫండ్లు వచ్చాయి. ప్రస్తుతం గడువు తేది 31–12–2021. వారు భారత్ వచ్చే దాకా ఆగకండి. ఇక్కడికి వచ్చి, ఇక్కడే వేయనవసరం లేదు. వేచి ఉండక్కర్లేదు. ఈ లోగా సమగ్ర సమాచారం సేకరించలేకపోతే డిసెంబర్ తర్వాత వేయండి. వడ్డీ, పెనాల్టీలు పడతాయి. నేను ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాను. నా సేవింగ్స్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఫారం 16 జారీ చేశారు. అలాగే ఫారం 26 అ లో తప్పులున్నాయి. రివైజ్ చేయడానికి సంస్థ ముందుకు రావడం లేదు. – సామవేదం లావణ్య, సికింద్రాబాద్ ఈ విషయం గతంలో ఎన్నో సార్లు ప్రస్తావించాం. ఎన్నో సంస్థలు ఫారం 16, ఫారం 16 అల జారీలో తప్పులు చేస్తున్నాయి. ఫారం 26 అ లో కూడా తప్పులు దొర్లుతున్నాయి. మీ దగ్గరున్న సమాచారం సరైనది, సమగ్రమైనది అయితే, తగిన కాగితాలు ఉంటే, ఆ మేరకు రిటర్నులు వేసినప్పుడు సరిదిద్దండి. సరిగ్గా వేయండి. ఎటువంటి సమస్యా ఉండదు. అవసరం అయినప్పుడు సమీక్షించుకోవాలి - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య -
ఆన్లైన్లోనే ఆదాయ పన్ను ఫారం-16 సమర్పణ
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఆదాయ పన్ను ఫారం-16ను విధిగా ఆన్లైన్లోనే సమర్పించాలని ఆదాయ పన్ను శాఖ సహాయ కమిషనర్ యు.వి. కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదాయ పన్ను మదింపుపై మంగళవారం వరం రెసిడెన్సీలో వివిధ శాఖలు, బ్యాంకులు, బీమా కంపెనీల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఫారం 16 మాన్యువల్‌గా నింపి సమర్పించేవారని, ప్రస్తుతం ఆ విధంగా సమర్పించడానికి ఎటువంటి చట్టబద్ధత లేదన్నారు. హెచ్‌టీటీపీ://డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యుడాట్టీడీఎస్సీపీసీడాట్జీవోవీడాట్ఇన్ వెబ్సైట్లో ట్రెసెస్పోర్టల్లో ప్రవేశించి ఫారం 16ను నింపాలని సూచించారు. ఫారం 16బీను మాత్రం మాన్యువల్‌గా నింపాలన్నారు. ఫారాన్ని పూర్తి చేసినప్పుడు పాన్, టీఏఎన్ నంబరు, బ్యాంకులు అందించే సీఐఎన్ నంబరు, ఐటీఎన్సీ చలాన 281, 94 సీ, 94ఐ కోడ్, 200 కింద రెగ్యులర్ పేమెంట్ చేసే హెడ్ నంబరు విధిగా పేర్కొనాలని స్పష్టం చేశారు. ఉద్యోగులు అందించే వివరాల ఆధారంగా ఆన్లైన్లో పూర్తి చేసేటప్పుడు ప్రతి విషయాన్ని డీడీవోలు విపులంగా పరిశీలించాలన్నారు. అందించే సమాచారంలో తప్పులు దొర్లితే డీడీవోలు బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం డీడీవోలకు తప్పులకు పెనాల్టీ పడే చట్టాలు వచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో ఆదాయపు పన్ను అధికారులు ఏవీ చంద్రశేఖర్, ఎస్ఎస్ ఎడ్విన్, డి.సంధ్యారాణి, చార్టెడ్ అకౌంటెంట్ వి.చంద్రశేఖర్, సెట్‌శ్రీ సీఈవో వీవీఆర్‌ఎస్ మూర్తి, గృహ నిర్మాణ సంస్థ పీడీ బి.వి.నర్శింగరావు, ఏపీఎంఐపీ పీడీ పద్మజ, వివిధ శాఖల డీడీవోలు, ఉద్యోగులు పాల్గొన్నారు.