breaking news
filing FIR
-
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: 2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి కార్పొరేట్లకు ఐటీఆర్ ఫైలింగ్ గడువును నవంబర్ 15 వరకు పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అక్టోబర్ 31 గడువు తేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ 15 రోజులు పొడిగిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.సీబీడీటీ ఇప్పటికే ఆడిట్ నివేదికల దాఖలు తేదీని సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 7 వరకు పొడిగించింది. అవసరమైన నివేదికలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించడంలో పన్ను చెల్లింపుదారులు, ఇతర వాటాదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న సీబీడీటీ ఈ తాజా నిర్ణయం తీసుకుంది.గడువు తేదీ లోపు ఆడిట్ నివేదికలను దాఖలు చేయడానికి చాలా మంది ట్యాక్స్‌పేయర్స్, సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గడవు పొడిగింపు వారికి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇప్పుడు అదనపు సమయం లభించడంతో ఎలాంటి ఒత్తిడి, జరిమానాలు లేకుండా ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లను పూర్తి చేయవచ్చు. -
హైకోర్టుకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పోలీసులను నిర్బంధించి ఇబ్బందులకు గురి చేశారంటూ నమోదైన కేసులో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులే తనపట్ల దురుసుగా వ్యవహరించారని, దీనిపై తానే మొదట పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిటిషన్లో ఆరోపించారు. తాను ఫిర్యాదు చేసిన తరువాత అందుకు ప్రతీకారంగా గచ్చిబౌలి సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని, ఈ ఫిర్యాదు ఆధారంగా తనపై కేసు నమోదు చేశారన్నారు. తన కాలర్ పట్టుకొని దుర్భాషలాడిన పోలీసుపై మాత్రం కేసు నమోదు చేయని పోలీసులు... అతనిపై ఫిర్యాదు చేసినందుకు తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కేసు వెనుక రాజకీయ కారణాలు... కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నందునే పోలీసులు కావాలనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసు వెనుక రాజకీయ కారణాలున్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీ నుంచి బయటకు వచ్చానన్న కారణంతో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తనను ఇలా తప్పుడు కేసులో ఇరికించారని, సమాజంలో గౌరవప్రదంగా బతుకుతున్న తనకు చట్ట విరుద్ధమైన పనులు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎన్నికల సమయంలో సందీప్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద దొరికిన రూ. 10 లక్షలతో తనకు ఎటువంటి సంబంధం లేదని విశ్వేశ్వర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఫిర్యాదుదారైన పోలీసును తాను కొట్టలేదని/నిర్బంధించలేదని, ఎంపీగా ఉన్న తాను ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదన్నారు. అందువల్ల తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, ఏ షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఒకవేళ అరెస్ట్ చేసినా వెంటనే బెయిల్ మంజూరు చేసేలా ఆదేశా లివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్ ముందు శుక్రవారం విచారణకు రాగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనకు బంధువని, అందువల్ల ఈ వ్యాజ్యంపై తాను విచారణ జరపడం భావ్యం కాదంటూ జస్టిస్ సంజయ్ తప్పుకున్నారు. ఈ కేసును మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
‘కేసు పెడుతున్నా.. ఆశీర్వదించండి’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడిని ఆప్ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ మిశ్రా ఉధృతం చేశారు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై కేసు పెడుతున్నట్టు ప్రకటించారు. తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు మంగళవారం ఉదయం మిశ్రాతో మాట్లాడుతూ.. ‘నన్ను ఆశ్వీరదించండి.. మీపై కేసు పెడుతున్నాను’ అని కేజ్రీవాల్‌ను ఉద్దేశించి అన్నారు. కేజ్రీవాల్‌కు సత్యేంద్రజైన్ ఇచ్చిన రూ. 2 కోట్ల లంచంపై సీబీఐకు ఆయనే ఫిర్యాదు చేయనున్నారు. రూ.400 కోట్ల మంచినీళ్ల ట్యాంకర్ల కుంభకోణంలో దర్యాప్తు నివేదికను కేజ్రీవాల్ తొక్కిపెట్టారంటూ కపిల్ మిశ్రా నిన్న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాల్ని ఏసీబీకి ఆయన అందచేశారు. తనపై ఆరోపణలకు కేజ్రీవాల్ స్పందిస్తూ.. సత్యానిదే తుది విజయమని పేర్కొన్నారు.