breaking news
families left
-
ఐదు కుటుంబాలకు... గ్రామ బహిష్కరణ
సాక్షి, మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి బోడ్డగెట్ట పంచాయతీలోని కూర్చు గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలను మావోయిస్టులు గ్రామ బహిష్కరణ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆదివారం రాత్రి గ్రామంలోకి సుమారు 30మంది మావోయిస్టులు వచ్చి గ్రామస్తులను పిలిపించి మాట్లాడారు. ఈ గ్రామంలోని ఐదు కుటుంబాలు పోలీసులకు ఎక్కువగా సహకరిస్తున్నారని, అలాగే రోడ్డు పనులు, సెల్ టవర్స్ పనులకు హాజరవుతూ సహకారం అందిస్తున్నారని గద్దించారు. ఆ ఐదు కుటుంబాలవారూ గ్రామం వదిలి వెళ్లిపోవాలని తీర్మానించారు. లేని పక్షంలో మరణ దండన తప్పదని హెచ్చరించారు. దీంతో భయాందోళన చెందిన ఆ గ్రామానికి చెందిన ఐదు కుటుంబాల్లోని 20మంది సభ్యులు రాత్రికి రాత్రి సామాన్లు సర్దుకుని కొంతమంది బంధువుల ఇళ్లకు, మరికొంతమంది కలిమెల సమితి కేంద్రానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై మల్కన్‌గిరి ఎస్పీ జోగ్గామోహన్ మిశ్రాను సంప్రదించగా మావోయిస్టుల గ్రామ బహిష్కరణకు గురైన కుటుంబాలకు న్యాయం చేస్తామని, వారికి ఎక్కడైనా కొంత భూమిని చూపించి నివాసితులను చేస్తామని హామీ ఇచ్చారు. -
ఇదేమి లెక్కో..?
– జిల్లాలో 11.43 లక్షల కుటుంబాలు – తెల్లకార్డులు 11.92 లక్షలు, గులాబీకార్డులు 62 వేలు - కుటుంబాల కంటే 1.11 లక్ష కార్డులు ఎక్కవ అనంతపురం అర్బన్ : జిల్లాలో రేషన్‌కార్డుల లెక్క అందరినీ తికమకపెడుతోంది. జిల్లాలో నివాస కుటుంబాలకు మించి తెల్లకార్డులు ఉన్నాయి. ఇవి కాకుండా గులాబీ కార్డులు ఉన్నాయి. కార్డుల లెక్కకు కుటుంబాల లెక్కకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. అధికారిక లెక్క ప్రకారం జిల్లాలో 11.43 లక్షల కుటుంబాలు ఉంటే తెల్ల, గులాబీ కార్డులు 12.54 లక్షల ఉన్నాయి. మరో చిత్రం ఏమిటంటే జిల్లాలోని కుటుంబాల కంటే తెల్లకార్డులు ఎక్కువగా ఉన్నట్లు అధికారిక నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. లెక్క లేకుండా ఇచ్చేశారు... అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 11.92 లక్షల తెల్లకార్డులు ఉన్నాయి. అంటే జిల్లాలోని కుంబాలకంటే తెల్ల కార్డులు 43 వేల ఎకువగా ఉన్నాయనేది స్పష్టమవుతోంది. ఇక కాక 62 వేల గులాబీ కార్డుల ఉన్నాయి. అంటే జిల్లాలో తెల్ల, గులాబీ కార్డులు కలిగిన కుటుంబాలు 12.54 లక్షలు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే 1.11 లక్షలు కార్డులు జనాభా లెక్కల ప్రకారం ఉన్న కుటుంబాల కంటే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధికారుల జారీ చేసిన కార్డుల ప్రకారం చూస్తే జిల్లాలో ప్రతి కుటుంబానికి తెల్లకార్డు ఉండడమే కాదు... అంతకు మించి కూడా ఉన్నాయి. జిల్లాలో 11.43 లక్షల కుటుంబాలు జిల్లాలో 2011 జానాభాల లెక్కల ప్రకారం 40,81,148 జనాభా ఉండగా, 10.22 లక్షల కుటుంబాలు ఉన్నాయి. దీనికి 12.10 శాతం వృద్ధి రేటుగా తీసుకుని 2017 జనాభా, కుటుంబాల సంఖ్యని అంచనా వేశారు. ఆ ప్రకారం జిల్లాలో 45,74,967 మంది జనాభా ఉండగా, కుటుంబాల సంఖ్య 11,43,742 కుటుంబాలు ఉన్నట్లు అంచనా వేశారు. లక్ష కార్డులెవరివో..? కుటుంబాల కంటే ఎక్కువగా ఉన్న 1.11 లక్షల రేషన్‌కార్డులను అధికారులు ఎవరికి ఇచ్చారు? అనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. ఇదే విషయాన్ని అధికారులను ప్రశ్నిస్తే కొందరు కుటుంబాలను వేరుగా చూపి తెల్లకార్డులు తీసుకున్నారని చెబుతున్నారు.