breaking news
Eyewitnesses
-
ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది
సాక్షి, హైదరాబాద్: ‘పెద్ద శబ్దం..ఒక్కసారిగా మంట లు వచ్చాయి. మొత్తం పొగ..దుమ్ము.. ఏం జరుగు తోందో తెలియలేదు. ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది. మా కళ్ల ముందే పేలుడు జరిగింది..మా ముందే చాలామంది చనిపోయారు. కొందరు మహిళ లు మంటలు అంటుకుని కాపాడాలంటూ వేడుకుంటు న్న అరుపులే ఇంకా గుర్తొస్తున్నాయి. మా చిన్నాన్నలు, అన్నలు, స్నేహితులు కనిపించకుండా పోయారు.వాళ్లు బతికి ఉన్నారో..? లేదో..? తెలియడం లేదు.. పొద్దుటి నుంచి వాళ్ల జాడ కోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నాం..ఎప్పు డు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది..’అని పాశమైలారం సిగాచి ఫ్యా క్టరీలో ప్రమాద ఘటన ప్రత్యక్ష సాక్షులు ‘సాక్షి’వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ‘మా వాళ్ల జాడ చెప్పండి సారూ’అంటూ బాధితుల బంధువులు అక్కడికి వచి్చ న అధికారులను బతిమాలుకుంటున్న తీరు కంట తడిపెట్టించింది. తమ వాళ్ల గురించి ఎందుకు చెప్ప డం లేదంటూ కొందరు మహిళలు ఏకంగా రాళ్ల ను తీసుకుని అధికారులపై దాడి చేసినంత పని చేశా రు. వారి కుటుంబీకుల కోసం వారు చేస్తున్న ఆర్తనాదాలు..ఆగ్రహావేశాలు సైతం అందరినీ కలిచి వేశాయి. వాష్‌రూంలో ఉండగా పెద్ద శబ్దం నేను ఉదయం షిప్ట్‌లో ఉన్నా. పేలుడు జరగడానికి ఐదు నిమిషాల ముందు వరకు కూడా డ్రయింగ్ యూనిట్ దగ్గరే పనిచేస్తున్నా. మూత్ర విసర్జన కోసం బయటికి వెళ్లి పక్కన వాష్‌రూంలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచి్చంది. బయటికి వచ్చి చూసే సరికి పెద్దగా మంటలు..పొగ..దుమ్ము ఏమీ కనపడ లేదు. వాష్‌రూంకు వెళ్లకపోతే చనిపోయేవాడిని. – చందన్ గౌర్, కార్మికుడు, ఉత్తరప్రదేశ్ నేను రియాక్టర్ దగ్గరే పని చేస్తున్నా నేను రెండేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నా. ఉదయం పేలుడు జరిగినప్పుడు రియాక్టర్ దగ్గర పనిచేస్తున్న. మొదట ఎయిర్ బ్లోయర్ పేలింది. దానివల్ల నేను పనిచేస్తున్న రియాక్టర్ కూడా పెద్ద శబ్దంతో పేలింది. అయితే పక్కనే గది నుంచి మెట్లు ఉన్న విషయం నాకు ముందు నుంచి తెలుసుకాబట్టి ఆ దారి వెతుక్కుంటూ బిల్డింగ్ పైకి వెళ్లిన. అక్కడ కూడా ఏమీ అర్థం కాలేదు. వెంటనే కూలిన ఒక గోడ పట్టుకుని పాకుతూ మొదటి అంతస్తులోకి కిందికి వచి్చన. అక్కడ కిటికిలోంచి కిందికి దూకిన. నా పక్కనే రెండు శవాలు పడి ఉన్నాయి. వెంటనే అక్కడ నుంచి బయటికి వచ్చేశా. పేలుడు జరిగినప్పుడు కనీసం 30 నుంచి 45 మంది అక్కడ ఉన్నారు. వాళ్లంతా చనిపోయే ఉంటారు. – పవన్ ఇసాద్, కార్మికుడు, ఉత్తరప్రదేశ్ మా ఇద్దరు చిన్నాన్నలు చిక్కుకున్నారు ఏడేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. ఇప్పటివరకు ఏ చిన్న ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగినప్పుడు నేను రియాక్టర్ రూం దగ్గరే పనిచేస్తున్న. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. వెంటనే మంటలు అంటుకున్నాయి. దీంతో కిందికి పారిపోయిన. కానీ మా చిన్నాన్నలు శశికుమార్, లఖ్నజీత్ ఇద్దరు లోపలే చిక్కుకున్నారు. ఒకరి శవం దొరికింది. ఇంకొకరు ఏమయ్యారోఏమో.. – విజయ్, బక్సర్ జిల్లా బిహార్ ముగ్గురిని కాపాడినం.. నేను ప్రమాదం జరిగినప్పుడు పక్కన బిల్డింగ్‌లో టిఫిన్ చేస్తున్న. బయటికి వచ్చేసరికి మొత్తం పొగ ఉంది. ఏం కనిపించలేదు. కాసేపటికి అంతా అటు ఇటు ఉరుకుతున్నరు. పక్కన అడ్మిని్రస్టేషన్ బిల్డింగ్ దగ్గర కొంతమంది కాపాడాలని అరుస్తున్నారు. నేను, ఇంకో ఇద్దరం కలిసి వాళ్ల దగ్గరికి వెళ్లినం. పైన ఫ్లోర్ నుంచి మెల్లగా కిందికి దింపి ముగ్గురిని కాపాడినం. – శివ, కార్మికుడు, ఒడిశా డ్యూటీలోనే దూరంగా ఉన్నా.. నేను ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న. పేలుడు జరిగినప్పుడు డ్యూటీలోనే ఉన్న. కానీ స్పాట్‌కు దూరంగా ఉన్న. పె ద్ద శబ్దం వచి్చంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే అటువైపు పరుగెత్తుకుంటూ వెళ్లిన. ఎవరెరు చనిపోయారో అర్థం కాలేదు. అనేకమంది గాయపడ్డారు. – సంతోష్ కుమార్, ఉద్యోగి, ఏపీ ఆచూకీ లేనివారు ఎంతమంది?సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన తర్వాత ఆచూకీ లేకుండా పోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం పరిశ్రమలో విధులకు వెళ్లినవారు ఇంటికి తిరిగి రాక.. ఆసుపత్రుల్లోనూ కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో అసలెంత మంది ఉన్నారు.. ప్రమాదం నుంచి బయటపడిన వారు ఎంతమంది.. అనేదానిపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత లేకుండా పోయింది.ఒకవైపు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా, శిథిలాల కింద ఎంతమంది ఉండి ఉంటారనే దానిపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించినట్లు తెలిసింది. రెండు మృతదేహాలు శిథిలాల కింద లభ్యమైనట్లు చెబుతున్నారు. మృతదేహాలను పోలీసులు ఆసుపత్రులకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. డీఎన్ఏ పరీక్షలు చేపడుతున్నట్లు తెలిసింది. కుటుంబసభ్యుల డీఎన్ఏలతో పోల్చాకే మృతదేహాలను అప్పగించనున్నట్లు సమాచారం. సోమవారం రాత్రి వరకు ముగ్గురిని గుర్తించినట్లు తెలుస్తుండగా.. దీన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. కాగా ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల తరలింపునకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా 10 అంబులెన్సులను ఏర్పాటు చేశారు. కంపెనీ డ్రైవర్ సమయస్ఫూర్తి8 మంది క్షతగాత్రులను బస్సులో ఆస్పత్రికి తరలింపుసాక్షి, హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగిన వెంటనే అక్కడ భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అయితే జరిగిన ఘటన నుంచి క్షణాల్లో తేరుకున్న కంపెనీ బస్సు డ్రైవర్ లాల్‌రెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరించారు. పేలుడు కారణంగా బస్సు ధ్వంసమైనా వెనుకడుగు వేయకుండా బాధితులను ముత్తంగిలోని ఆసుపత్రికి తరలించారు.ఘటన జరిగిన తీరును ఆయన ‘సాక్షి’ కి వివరించారు. ‘నేను జనరల్ షిప్ట్ వాళ్లను కంపెనీకి తీసుకువచ్చి న తర్వాత బస్సును పార్క్ చేసి కూర్చుని ఉన్నా. కొద్ది నిమిషాల్లోనే పెద్ద శబ్దం విని్పంచింది. కాసేపటికి అంతా గాయాలతో బయటికి వస్తున్నారు. ఇంకా అంబులెన్స్‌లేవీ రాలేదు. నేను వెంటనే 8 మందిని బస్సులో ఎక్కించుకుని ముత్తంగి ఆసుపత్రికి తీసుకెళ్లిన. అక్కడి నుంచి మదీనగూడ ఆసుపత్రికి తీసుకొచి్చన. ఆషాక్ నుంచి బయటికి రాలేకపోతున్నా..’అని లాల్‌రెడ్డి వివరించారు. -
కళ్ల ముందే కడతేర్చారు
క్వెట్టా: తమ ప్రాంత స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా సాయుధబాటలో పయనిస్తున్న అతివాద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం పాకిస్తాన్లో ఏకంగా ఒక రైలునే తమ అ«దీనంలోకి తెచ్చుకుని ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. అయితే ఈ ఘటనలో ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు ఇంకా ఆ దారుణ ఘటన నుంచి తేరుకోలేదు. తమ కళ్ల ముందే పాకిస్తానీ సైనికులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చేసిన వైనాన్ని వారు గుర్తుచేసుకున్నారు. క్వెట్టా నుంచి పెషావర్‌కు 440 మంది ప్రయాణికులతో వెళ్తున్న జాఫర్ రైలుపై మెరుపుదాడి చేసి డజన్లకొద్దీ జనాలను, రైళ్లోని పాక్ సైనికులను బలూచిస్తాన్ వేర్పాటువాదులు చంపేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపడం తెల్సిందే. చిన్నారులు, మహిళలతోపాటు వృద్ధులను వేర్పాటువాదులు ఇప్పటికే మానవతా దృక్పథంలో వదిలేయడంతో ఘటనాస్థలిలో వివరాలను ఆ వృద్దులు మీడియాతో పంచుకున్నారు. బోగీలపైకి బుల్లెట్ల వర్షం ‘‘రైలు బోలన్ కనుమ సమీపానికి రాగానే పెద్ద పేలుడు జరిగింది. పట్టాలను వేర్పాటువాదులు పేల్చేశారు. దీంతో రైలు హఠాత్తుగా ఆగింది. రైలు ఆగీఆగడంతోనే బోగీలపైకి బుల్లెట్ల వర్షం కురిపించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సీట్ల కింద దాక్కున్నాం’’అని మహబూబ్ హుస్సేన్ అనే వృద్ధుడు చెప్పారు. తర్వాత విడుదలైన ఒక రైల్వే పోలీసు అధికారి ఈ ఘటనను వివరించారు. ‘‘ రైలు ఆగాక వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు కిందకు దిగొచ్చి రైలును చుట్టుముట్టి కాల్పులు మొదలెట్టారు. నేను, నలుగురు రైల్వే పోలీసులు, ఇద్దరు పాకిస్తానీ పారా మిలటరీ ఫ్రంటియర్ కోర్ సభ్యులందరం కలిసి వేర్పాటువాదులను ఎదుర్కొనేందుకు ప్రయతి్నంచాం. మా వద్ద మందుగుండు అయిపోయేదాకా ప్రతిఘటించాం. తర్వాత మా వద్ద బుల్లెట్లు అయిపోయాయి. చివరకు చేతులెత్తేయక తప్పలేదు ’’అని రైల్వే పోలీసు అధికారి చెప్పారు. గుంపులుగా వేరుచేసి.. ‘‘అందర్నీ కిందకు దించి ఐడీ కార్డులు అడిగారు. పోలీసులు, మహిళలు, వృద్దులు, చిన్నారులు ఇలా వేర్వేరు గుంపులుగా నిల్చోబెట్టారు. ‘ప్రభుత్వానికి డిమాండ్లు పంపించాం. అవి నెరవేరితే సరే. లేదంటే ఎవ్వరినీ వదిలిపెట్టం’’అని మాతో చెప్పారు. వాళ్లకు పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లు వాళ్లు కొందరు సాధారణ పౌరులను, సైనికులను చంపుకుంటూ వెళ్లారు. మా కళ్లముందే ఈ ఘోరం జరిగింది’’అని మరో ప్రత్యక్ష సాక్షి ఇషాక్ నూర్ చెప్పారు. ‘‘అందర్నీ కిందకు దింపి ముసలివాళ్లను వదిలేశారు. వెనక్కి తిరిగి చూడకుండా ఇలాగే పట్టాల వెంట వెళ్లిపోవాలని నన్ను, నా భార్యను హెచ్చరించారు. బతుకుజీవుడా అనుకుంటూ అలాగే నడిచి రాత్రి ఏడుగంటలకు పనీర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాం’’అని భర్త నూర్ మొహమ్మద్ చెప్పారు. ‘‘పిల్లలు, మహిళలు ఉన్నారు వదిలేయండని ఎంతో వేడుకుంటే మమ్మల్ని వదిలేశారు. మంగళవారం రాత్రి అక్కడి నుంచి బయటపడ్డాం. అందరం కలిసి ఏకధాటిగా నాలుగు గంటలపాటు నడిచి తర్వాతి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాం’’అని ముహమ్మద్ అష్రఫ్ అనే వ్యక్తి చెప్పారు. పారిపోబోయిన కొందర్ని చంపేశారని పోలీసు అధికారి చెప్పారు. ‘‘రాత్రి పొద్దుపోయాక వేర్పాటువాదుల్లో కొందరు అక్కడి నుంచి ని్రష్కమించారు. అదే సమయంలో కొందరు ప్రయాణికులు తప్పించుకునేందుకు విఫలయత్నంచేశారు. బందీలు తప్పించుని పరుగెత్తడం చూసిన సాయుధాలు వాళ్లపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో వాళ్లంతా పిట్టల్లా పడి బుల్లెట్లకు బలయ్యారు’’ అని చెప్పారు.కొందర్ని కిడ్నాప్ చేసి వెంట తీసుకెళ్లిన వేర్పాటువాదులు 440 మంది ప్రయాణికుల్లో 300 మందిని విజయవంతంగా విడిపించామని పాక్ సైన్యం చెబుతోంది. అయితే మిగతా 140 మంది పరిస్థితి ఏంటనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. డజన్ల మంది చనిపోయారని వార్తలొచ్చాయి. అయితే మిగతా వారిని వేర్పాటువాదులు బంధించి తమ వెంట తీసుకెళ్లారని రాయిటర్స్, ఏఎఫ్‌పీ వార్తాసంస్థలు కథనాలు వెలువర్చాయి. దీనిపై పాక్ సైన్యం స్పందించలేదు. మిగతా ప్రయాణికుల్లో కొందరు పారిపోయి కొండల్లో దాక్కున్నారని, ఘటనాస్థలి చుట్టుపక్కన విస్తృతస్థాయి గాలింపు తర్వాత మరణాలు, బందీలు, విడుదలైన వారి సంఖ్యలపై స్పష్టత వస్తుందని సైన్యం చెబుతోంది. క్వెట్టాలో ఖాళీ శవపేటికలు ఘటనలో చనిపోయి విగతజీవులుగా ఇంకా ఘటనాస్థలిలో అనాథలుగా పడిఉన్న వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు క్వెట్టా నుంచి రైలు బుధవారం బలూచిస్తాన్ వైపు బయల్దేరింది. డజన్ల కొద్దీ ఖాళీ శవపేటికలను రైలులోకి ఎక్కించారని అక్కడి వారు చెప్పారు. మరోవైపు ఉదయం ప్రార్థనల వేళ కొందరు ప్రయాణికులు చాకచక్యంగా తప్పించుకున్నారు. ‘‘రంజాన్ మాసం కావడంతో బుధవారం ఉదయం పూట వేర్పాటువాదులు ప్రార్థనలకు సిద్ధమయ్యారు. ఫజర్ కోసం వేర్పాటువాదులు బిజీగా ఉండటంతో ఇదే అదునుగా భావించి పాకిస్తాన్ రెస్క్యూ బృందాలు దాడి చేశాయి. దీంతో పోలీసులను ఎదుర్కోవడంపైనే వేర్పాటువాదులు దృష్టిసారించారు. అదే సమయంలో కొందరు పారిపోయారు. ‘‘తప్పించుకునే క్రమంలో మాలో కొందరికి బుల్లెట్ గాయాలయ్యాయి. అయినాసరే ఏమాత్రం భయపడక క్షతగాత్రులను భుజాలపై మోస్తూ పరుగెత్తాం. ఎట్టకేలకు కొండకు సుదూరంగా చేరుకోవడంతో వేర్పాటువాదుల తుపాకీ గురి నుంచి తప్పించుకోగలిగాం’’అని అల్లాహ్దితా చెప్పారు. -
సర్జికల్ స్ట్రైక్స్‌పై కశ్మీరీ ప్రజలు ఏమన్నారు...
భారత సైన్యం అసలు సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని దుష్ప్రచారం చేస్తున్న పాక్ మీడియాతో పాటు.. స్వదేశంలోని కొందరు రాజకీయ నాయకులకు కశ్మీరీ ప్రజలు షాకింగ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి.. భారత ఆర్మీ బలగాలు చేసిన దాడిని ప్రత్యక్షంగా చూసిన కొంతమంది.. వాటికి సంబంధించిన గ్రాఫిక్స్‌ను విడుదల చేశారు. తాము కళ్లారా ఆ దాడులను చూశామని తెలిపారు. ఈ దాడులు చాలా కొద్దిసేపే జరిగినా.. అవి చాలా శక్తిమంతమైనవని తెలిపారు. ఈ ఆపరేషన్ ముగించుకునే వెళ్లేముందు జిహాదీల స్థావారాలన్నింటినీ భారత ఆర్మీ ధ్వంసం చేసిందని చెప్పారు. సర్జికల్ స్ట్రయిక్స్‌లో మరణించిన ఉగ్రవాదులను రహస్యంగా సమాధి చేసేందుకు సెప్టెంబర్ 29 తెల్లవారుజామున వాటిని పాక్ వర్గాలు ట్రక్కులలో తీసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భారత ఆర్మీ లక్ష్యంగా చేసుకుని జరిపిన కొన్ని ప్రాంతాల వివరాలను కూడా వారు తెలిపారు. అల్-హవీ వంతెన గుండా సెప్టెంబర్ 28న 84ఎంఎం కార్ల్ గుస్తావ్ రైఫిల్స్ శబ్దాలు భారీగా వినిపించాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. నియంత్రణ రేఖ వెంబడి నౌగమ్ సెక్టార్‌లోని ఉగ్రవాద స్థావారాలను టార్గెట్‌గా చేసుకుని 25 పల్లెటూర్లలో ఈ ఆపరేషన్‌ను ఆర్మీ కొనసాగించిందని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఖైరతి బాగ్ అనే గ్రామంలో లష్కరే తాయిబాకు చెందిన మూడు చెక్క భవనాలను కూడా భారత ఆర్మీ ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. ఆ ప్రాంతం లష్కర్ కంచుకోటగా ప్రాముఖ్యం పొందింది. కాల్పులు ప్రారంభమైన వెంటనే కొంతమంది లష్కర్ ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారని వివరించారు. ఈ దాడుల్లో సమారు 38-50 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని, జిహాదీల వాహనాలు, కొన్ని భవనాలు కూడా ఈ దాడుల్లో ధ్వంసం అయినట్టు పేర్కొన్నారు. తర్వాతి రోజు ఉదయం కూడా ఆరు మృతదేహాలను చల్హానా లష్కర్ క్యాంప్ వద్దకు తరలించినట్లు తెలుస్తోంది. దాడుల అనంతరం లష్కర్ ఉగ్రవాదులు ఓ చోట సమావేశమై, పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడులను తిప్పికొట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెప్పారు. భారత ఆర్మీకి ఈ దాడులపై త్వరలోనే సమాధానం ఇవ్వాలని వారు నిర్ణయించినట్టు మరో స్థానిక వ్యక్తి వివరించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావారాలపై భారత సైన్యం దాడులను పాక్ ఖండిస్తున్న నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులు ఈ వివరాలు వెల్లడించారు. ఇవి సర్జికల్ స్ట్రయిక్స్ కావని, సరిహద్దుల్లో తరచు జరిగే చిన్నపాటి ఎదురు కాల్పులేనని పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తోంది. దానిపై ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు నాయకులు కూడా సాక్ష్యాలను బయట పెట్టాలని కోరారు. మరోవైపు భారత ఆర్మీ సైతం ఆ దాడుల వీడియోలను బయటపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.