eastgodavari
-
సీఎం జగన్ అండగా నిలిచారు.. వారి ఆనందానికి అవధుల్లేవ్..
సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పోలవరం నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు. తమకు సీఎం అండగా నిలిచారన్నారు. వారికి నివాసం ఏర్పాటు చేయడంతో పాటు, ఆయనే స్వయంగా గృహ ప్రవేశం చేయించడంతో నిర్వాసితుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత ప్రభుత్వం పట్టించుకోకున్నా వైఎస్ జగన్ అండగా నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు. కాలనీలో మరికొన్ని సౌకర్యాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ స్వయంగా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని.. నమ్మలేకపోయామని నిర్వాసితులు అన్నారు. సీఎం జగన్ వస్తే నా పెద్దకొడుకే వచ్చినట్లు ఉందని వృద్ధురాలు అన్నారు. ఎన్నో కష్టాలు పడ్డామని.. సీఎం జగన్ అండగా నిలిచారన్నారు. చదవండి: మాట నిలబెట్టుకుంటాం: సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు పునరావాస కాలనీలను కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సందర్శించి, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. ఇందుకూరు-1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులను కలుసుకున్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. అనంతరం పోలవరం డ్యామ్ సైట్ చేరుకుని ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించి, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
ముళ్ల పొదల్లో.. కొన ఊపిరితో..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో అదృశ్యమైన విద్యార్థి ధనుష్ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక ప్రభుత్వ కళాశాల సమీపంలో ఉన్న పొదల్లో కొన ఊపిరితో ఉన్న ధనుష్‌ను పోలీసులు గుర్తించారు. తలకు బలమైన గాయం కావడంతో కాకినాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ధనుష్ చిన్నాన్నతో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గురువారం పాఠశాలకు వెళ్ళిన విద్యార్థి తిరిగి ఇంటికి రాలేదు. విద్యార్థిని అపహరించి హత్య చేసేందుకే తలపై కొట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి) : అందరూ నాలుగేళ్ల నుంచి పదేళ్ల లోపు చిన్నారులే.. అప్పటివరకు సరదాగా గడిపిన వారంతా... ఒక్కసారిగా హాహాకారాలతో భయభ్రాంతులకు గురయ్యారు.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు వారంతా షాక్‌లోకి వెళ్లిపోయారు.. తణుకు మండలం తేతలి గ్రామ పరి«ధిలోని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలు బస్సు ప్రమాదానికి గురైన సంఘటనలో 34 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం ఉదయం విద్యార్థులను తరలిస్తున్న ఏపీ 37 టీడీ 8878 నెంబరు కలిగిన బస్సు స్కూలు సమీపంలోని పంట కాల్వలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న చిన్నారులను స్థానికంగా పొలాల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులు హుటా హుటిన చేరుకుని వారందరినీ బయటకు తీశారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పుంత రోడ్డులోనే రాకపోకలు తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలుకు చెందిన బస్సు పెరవలి, కాపవరం, కొత్తపల్లి, తూర్పువిప్పర్రు గ్రా మాల నుంచి 34 మంది విద్యార్థులను ఎక్కించుకుని బయల్దేరింది. వీరంతా ఎల్కేజీ నుంచి ఆరో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులే కావడం గమనార్హం. ఏఎస్ఆర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజీ ఆనుకుని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలు నడుస్తోంది. అయితే స్కూలు బస్సులు రాకపోకలకు అత్తిలి కాల్వ ఆనుకుని పుంతరోడ్డునే యాజమాన్యం వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో అత్తిలి కాల్వకు రోడ్డుకు మధ్యలో పంట కాల్వ ప్రవహిస్తోంది. అయితే పుంత రోడ్డు ఇరుకుగా ఉండటంతోపాటు ఇటీవల కురుస్తున్న వర్షాలకు గట్టు తెగిపోయింది. దీనిని గమనించని బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బస్సు పంట కాల్వలోకి దూసుకెళ్లిపోయింది. ఈ సమయంలో విద్యార్థులు కేకలు వేయడంతో సమీపంలో రైతులు, కూలీలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే మధ్యలో పంట కాల్వ లేకపోతే నేరుగా పెద్ద కాల్వలోకే బస్సు వెళ్లిపోయేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే కారుమూరి ఆరా.. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సంఘటనపై ఆరా తీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా వెంకటేష్, సరెళ్ల వీరతాతయ్యను తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి స్కూలు యాజమాన్యంతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. నాయకులు వెంకటేష్, వీరతాతయ్యలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. సంఘటనా స్థలానికి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సంపత్‌కుమార్ చేసుకుని వివరాలు సేకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్, యాజమాన్యంపై రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భయం వేసింది స్కూలులో తొమ్మిదో తరగతి చదువుకుంటున్నాను. కాపవరంలో ఉదయం బస్సు ఎక్కాను. అయితే రోజు కంటే ఆలస్యంగా బస్సు వచ్చింది. స్కూలు టైం అయిపోతోందనే ఆందోళనలో ఉన్నాం. మరికొద్ది సేపట్లోనే స్కూలుకు చేరుకుంటున్నాం అనగా పంట కాల్వలోకి బస్సు దూసుకెళ్లింది. దీంతో అందరికీ భయం వేసింది. –కట్టికూటి సుబ్రహ్మణ్యం, విద్యార్థి, కాపవరం డ్రైవర్‌ను మార్చారు నా ఇద్దరు పిల్లలు స్టెప్పింగ్ స్టోన్స్ స్కూలులోనే చదువుకుంటున్నారు. పెరవలి మండలం కాపవరం నుంచి బస్సులో స్కూలుకు వస్తున్నారు. అయితే ఇటీవల స్కూలు బస్సు డ్రైవర్‌ను మార్చారు. దీంతోపాటు రెండేసి ట్రిప్పులు వేస్తుండటంతో వేగంగా విద్యార్థులను తరలిస్తున్నారు. –కాకరపర్తి శ్రీలక్ష్మి, విద్యార్థుల తల్లి, కాపవరం -
నకిలీమందుల తయారీ గుట్టు రట్టు
కాకినాడ లీగల్: పెద్దాపురంం మండలం జి.రాగంపేట గ్రామంలో లైసెన్స్ లేకుండా అక్రమంగా నకిలీ మందులు ’ఒమిట్‌మెంట్’ ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్న కేంద్రంపై ఔషధ తనిఖీ అధికారులు, కాకినాడరూరల్, రాజమహేంద్రవరంరూరల్ ఔషధ నియంత్రణ అధికారులు వీఎస్ జ్యోతి, వి.అభిప్రియ గురువారం దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో ఒక ఇంటిలో అక్రమ మందులు తయారుచేస్తున్నట్టు జిల్లా ఔషధ నియంత్రణశాఖ సహాయ సంచాలకులు టి.శ్రీరామమూర్తికి అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో ఒక ఇంటిని సోదా చేయగా సిరి క్రీమ్ 10జీఎం, 20జీఎం భారీగా ఉన్నట్టు గుర్తించారు. వాటి తయారీకి సంబంధించిన ఒమిట్‌మెంట్ ట్యాబ్‌లు, పాకింగ్ సామగ్రి తదితర వాటిని కూడా గుర్తించారు. ఒమిట్‌మెంట్ ట్యాబ్లెట్ల తయారీకి లైసెన్స్ లేకుండా చేయడం నేరమన్నారు. సుమారు రూ.ఐదు లక్షల విలువగల ఒమిట్మెంట్ల మొత్తాన్ని, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఒమిట్‌మెంట్ తయారీకి సంబంధించిన సామగ్రిని ఔషధనియంత్రణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులను కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. అల్లోపతి మందుల తయారీకి లైసెన్సు తప్పనిసరి అల్లోపతి మందుల తయారీకి, విక్రయాలకు ఔషధచట్టం నిర్దేశించిన లైసెన్సులు తీసుకోవాలని, అవి లేకుండా చట్టవిరుద్ధమైన తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా సహాయ సంచాలకులు టి.శ్రీరామమూర్తి తెలిపారు. -
ప్రభుత్వ వైద్యుల వీరంగం
రాజమండ్రి: తూర్పాగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని రేకపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వీరంగం సృష్టించారు. ఇద్దరు వైద్యులు మద్యం తాగి వచ్చి మత్తులో మరో వైద్యుడిపై దాడి చేశారు. ఆ వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు, ఆసుపత్రిలోని రోగులు ఆందోళన చేస్తున్నారు. -
బడుగులపై ఆశీలు పిడుగు
మార్కెట్లు, పరిసరాల్లో చిన్న వ్యాపారుల వద్ద వసూళ్లు 400 రెట్లు పెంచిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వ్యాపారం ఉన్నా లేకపోయినా కట్టాలి్సందే సైకిల్, బుట్ట, తోపుడు బండ్ల వ్యాపారులు బేంబేలు రోజు గడవడమే కష్టం... ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలని ఆవేదన సాక్షి, రాజమహేంద్రవరం : దుకాణాలు అద్దెకు తీసుకొని వ్యాపారాలు చేసుకునే వారు, ఆయా పరిసర ప్రాంతాల్లో బుట్టలు, సైకిళ్లు, మోటారు సైకిళ్లు, ఆటోలు, టిఫి¯ŒS సెంటర్లు పెట్టుకుని జీవనం గడిపే వారిపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆశీల (పన్ను) భారం మోపింది. ఒక్కసారిగా దాదాపు 400 శాతం పెంచడంతో బడుగు జీవులు లబోదిబోమంటున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను ఆశీలు వసూలు చేసుకునేందుకు గత నెల 21న టెండర్, వేలం ప్రకటన జారీ చేసింది. నగరంలో ఏడు మార్కెట్లు, రెండు చేపల బజార్లు, ఒక కబేళా ఉన్నాయి. జాంపేట మార్కెట్లో 88 దుకాణాలు, నాగుల చెరువు మార్కెట్లో 106 మంది వ్యాపారులు, సెంట్రల్ కూరగాయల మార్కెట్లో 68 దుకాణాలు, ఆల్కట్తోట మార్కెట్లో ఏసీ షీట్ షెడ్డు, మునికుట్ల అచ్యుతరామయ్య మునిసిపల్ మార్కెట్, గౌతమీ ఘాట్ నుంచి సరస్వతీ ఘాట్ వరకు ఉన్న అరటి పండ్ల మార్కెట్, లింగంపేట మార్కెట్లు, జాంపేట, స్టేడియం వద్ద ఉన్న చేపల మార్కెట్లు, వీరభద్రపురంలోని కబేళా వద్ద ఆశీలు వసూలు చేసుకుంనేందుకు నోటిఫికేష¯ŒS జారీ చేశారు. టెండర్, వేలం ద్వారా పాటదారులు చిరు వ్యాపారుల నుంచి ఆశీలు వసూలు చేసుకునే హక్కు ఉంటుంది. మార్కెట్ల వద్ద స్వీపర్ల జీతాలు, మొత్తం జీతాల విలువలో 10 శాతం నిర్వహణ ఖర్చులు కలిపి సంబంధిత పాటదారుడు నగరపాలక సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఐదు రెట్లు పెరిగిన ఆశీలు... ఆయా మర్కెట్లలో ఉన్న దుకాణాలతోపాటు పరిసర ప్రాంతాల్లో వందలాది మంది బడుగు జీవులు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరి నుంచి వసూలు చేసే ఆశీలు గతంలో కన్నా 400 శాతం పెరిగాయి. సాధారణంగా ప్రతి మూడేళ్లకు మూడోవంతు మేర పెంచాలి. కానీ 2006 నుంచి ఆశీలును పెంచలేదని మున్సిపల్ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. బుట్టలు, కావిడిలతో పండ్లు, ఇతరత్రావి తెచ్చి విక్రయించే వ్యాపారులకు గతేడాది రూ.5 ఉన్న ఆశీలు ప్రస్తుతం రూ. 20కు పెంచారు. మార్కెట్ల వద్ద బండి నిలిపితే దాని బరువుకు గతంలో రూ.12 ఉంటే ఇప్పడు రూ.60 అయింది. సైకిల్ బరువుకు గతంలో రూ.2లుండగా ప్రస్తుతం పెంచిన రేటు రూ.8లుగా ఉంది. మార్కెట్ ఏరియాలో తోపుడు బండికి రూ.5 ఉన్న ఆశీలు ప్రస్తుతం రూ.20 అయింది. మామిడి పండ్లు మినహా ఇతర పండ్లు బండిపై అమ్మేవారి నుంచి రోజుకు గతంలో రూ.12 వసూలు చేస్తుండగా ఇప్పుడు రూ.60లకు పెంచారు. రోజులో పనసకాయలు ఎన్ని అమ్మితే ఒక్కొక్కదానిపై రూ.8 వసూలు చేసుకునే విధంగా రేట్లు పెంచారు. మార్కెట్లలో దుకాణాలు, కానాల ఆశీలు పెరుగుదల... మార్కెట్లలో ఉన్న దుకాణాలు, కానాలకు కూడా ఆశీలు 400 శాతం పెంచింది. జాంపేట మార్కెట్లోని ఏ బ్లాక్‌లో దుకాణానికి గతంలో రూ.17.50 ఆశీలు వసూలు చేస్తుండగా ఇప్పు డు రూ.70లకు పెంచారు. నాగుల చెరువు మార్కెట్లో రూ.25 నుంచి రూ.100 పెంచారు. మునికుట్ల అచ్యుతరామయ్య మార్కెట్లో రూ.6 ఉన్నది రూ. 24 అయింది. గౌతమ ఘాట్ వద్ద అరటి పండ్ల మార్కెట్లో గతంలో రోజుకు సైకిల్‌కు రూ.5 ఉండగా ఇప్పుడు రూ.20కి పెంచారు. వచ్చే ఆదాయం ఆశీలకే పాయే... వ్యాపారం ఉన్నా లేకున్నా ఆ రోజు ఆశీలు కట్టాలి్సందే. ఏ రోజుకారోజు బతికే మాపై ఈ స్థాయిలో పన్నులు పెంచడం సరికాదని చిరు వ్యాపారులు వాపోతున్నారు. బుట్టలు, కావిడులతో వ్యాపారం చేసేవారు రోజుకు రూ.20 లెక్కన నెలకు రూ.600 ఆశీలు చెల్లించాల్సి ఉంటుంది. తోపుడు బండ్లు, పండ్ల దుకాణం వారు నెలకు రూ.1800, సైకిల్‌పై వ్యాపారం చేసేవారు రోజుకు రూ.8 లెక్కన నెలకు రూ. 320 చెల్లించాల్సి ఉంటుంది. ఇది తమకు భారంగా మారుతోందని ఆశీలు పెంపును పునఃపరిశీ లించాలని బడుగుజీవులు కోరుతున్నారు. 2006 నుంచి పెంచలేదు.. ప్రతి మూడేళ్లకు మూడోవంతు ఆశీలు పెంచాలి. కానీ 2006 నుంచి ఇప్పటి వరకు పెంచలేదు. జాంపేట మార్కెట్ 2002లో ఏర్పాటైంది. అక్కడ 2007లోఆశీలు పెంచాం. ఆశీలు ఎంత వసూలు చేయాలన్నదానిపై సమీపంలో ఉన్న నగరపాలక సంస్థల విధానాలను పరిశీలించాం. కమిషనర్, మేయర్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి ఎంత పెంచాలన్నదానిపై ఒక నిర్ణయానికి వచ్చారు. దీనివల్ల నగరపాలక సంస్థకే ఆదాయం వస్తుంది. – ఫణికుమార్, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ విభాగం) పదేళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నాను మాది సీతానగరం మండలం శింగవరం. పదేళ్ల నుంచి మోటారు సైకిల్‌పై రాజమహేంద్రవరంలో మొక్కజొన్న కండెల వ్యాపారం చేసుకుంటున్నాను. యూనియ¯ŒS కార్డు ఉన్నా కూడా ఈసారి ఆశీలు కట్టాలని చెబుతున్నారు. రోజుకు వచ్చే ఆదాయంలో 20 శాతం ఆశీలుకేపోతే మేము ఎలా బతికేది. – మద్దిపోటి విష్ణుమూర్తి, శింగవరం, సీతానగరం మండలం తగ్గిస్తే మేము బతుకుతాం సారూ... మాది రాజానగరం మండలం వెలుగుబంద. సీజ¯ŒSలో లభించే పండ్లను సైకిల్‌పై అమ్ముకుంటూ జీవిస్తున్నాను. వేకువ జామున నాలుగు గంటలకు హోల్‌సేల్ మార్కెట్‌కు వెళ్లి సరుకుతో ఉదయం 8 గంటలకు రాజమహేంద్రవరం వస్తాను. జాంపేట లేదంటే మరోచోట వ్యాపారం చేసుకుని ఇంటికి వెళ్లేసరికి రాత్రి 10 గంటలవుతుంది. రోజుకు రెండు నుంచి మూడువందల ఆదాయం వస్తుంది. వ్యాపారం ఉన్నా లేకపోయినా ఉదయం 9 గంటలకే రోజుకు రూ. 30లు ఆశీలు తీసుకుంటున్నారు. తగ్గిస్తే మేము బతుకుతాం సారూ... – శ్రీను, వెలుగుబంద, రాజానగరం మండలం -
నరసన్న రథోత్సవం
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో బుధవారం కన్నులపండువలా జరిగింది. కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని స్వామి వారిని పెండ్లికుమారుడిగా, అమ్మవారిని పెండ్లికుమార్తెగా అలంకరించి రథంపై ఆసీనులను చేశారు.ఆలయ ఆనువంశిక ధర్మకర్త ఎస్పీ రంగరాజభట్టర్, అన్నవరం దేవస్థానం అధికారులు జగన్నాథం, టి.తులారామ్, ఎంకేటీఎ¯ŒSవీ ప్రసాద్, పీవీ రమణ, టీఎ¯ŒS రాంజీ, శ్రీ నృసింహభట్టర్ స్వామి, ఆలయ వంశపారంపర్య అర్చకులు, డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ ముందు రథానికి ప్రత్యేక పూజలు చేశారు. రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. సుందరంగా తీర్చిదిది్దన రథంపై వేంచేసిన స్వామి వారిపై అరటిపండ్లు విసిరి భక్తిని చాటుకున్నారు. రథం ముందు వివిధ దేవతావేషధారణలు, కోలాటాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. జై లక్ష్మీనరసింహ స్వామి, జై గోవిందా గోవిందా అన్న భక్తుల నినాదాలతో కోరుకొండ వీధులు మార్మోగాయి. – కోరుకొండ (రాజానగరం) -
ఖజానా ఖాళీ
ఎక్కడిబిల్లులు అక్కడే కోట్ల లావాదేవీలకు బ్రేక్ విద్యార్థులకు ఉపకార వేతనాలు నిల్ మధ్యాహ్న భోజనానికి డబ్బుల్లేవు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కూ దిక్కులేదు జీతాల వరకు సర్ధుబాటు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎక్కడ బిల్లులు అక్కడే నిలిచిపోయాయి. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, పంచాయతీ రాజ్, ఆర్అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల పనులకు సంబంధించిన బిల్లులకు బ్రేక్ పడింది. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో కేవలం జీతాలు, పింఛన్లకు మాత్రమే సర్ధుబాటు చేస్తున్నారు. మిగిలిన అన్ని బిల్లులూ బ్యాంకుల నుంచి వెనక్కు తిరిగి వచ్చేస్తున్నాయి. జిల్లా కేంద్రం కాకినాడలోని జిల్లా ఖజానా అధికారి కార్యాలయం నుంచి ప్రతి నెలా సుమారు 200 విభాగాలకు వందల కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగుతాయి. కానీ గత నెలాఖరు నుంచి జిల్లాలో అన్ని రకాల బిల్లులు పాస్ కాక విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు, పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు వివాహ, కుటుంబ ఖర్చుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకున్న రుణాలు, మధ్యాహ్న భోజనం, మెడికల్ రీ ఇంబర్స్మెంట్...ఇలా దాదాపు అన్ని బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. జీతాల బిల్లులకు మాత్రమే గ్రీ¯ŒS సిగ్నల్... ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం జీతాల బిల్లులు మాత్రమే జిల్లాలో క్లియర్ చేస్తున్నారు. అది కూడా ఈ నెల (జనవరి) 21వ తేదీ నుంచి 30 తేదీ వరకు జీతాలతో సహా ఏ ఒక్క బిల్లు కూడా మంజూరు కాలేదు. పెద్ద నోట్లు రద్దు అనంతరం సాంకేతికంగా వచ్చిన మార్పుల నేపథ్యంలో ఖజానా శాఖలో ఎస్టీఓల పా¯ŒS నంబర్లు తప్పని సరిచేశారు. సొంత పా¯ŒS నంబర్లు ఇవ్వడం వల్ల తమకు ఐటి శాఖ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని గత వారం ఖజానా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి గతంలో మాదిరిగానే బిల్లులు మంజూరు చేయవచ్చునని, ఎస్టీఓల పా¯ŒS నంబర్లు అవసరం లేదని మంగళవారం రాత్రి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.అలాగే ఖజానా నుంచి జీతాలు బిల్లులు సర్థుబాటు చేయాలనే ఆదేశాలు కూడా రావడంతో బుధవారం ఒకటో తేదీకి జీతాలు, పింఛ¯ŒSదారులకు ఇబ్బందులు తొలగిపోయినట్టే. సుమారు 45 వేల మంది ఉద్యోగులకు జీతాలుగా రూ.191 కోట్లు, 40 వేల మంది పెన్షనర్లకు రూ.87 కోట్లు చెల్లింపులకు మార్గం సుగమమయింది. విద్యార్థుల ఉపకార వేతనాల మాటేమిటి...? మిగిలిన బిల్లులు ఎప్పటికి అనుమతిస్తారనే పరిస్థితి అర్థంకాక సంబంధిత వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సుమారు లక్షన్నర మంది (బీసీ 60వేలు, ఎస్సీ 35వేలు, ఈబీసీ 25వేలు, ఎస్టీ 15వేలు నుంచి 20వేలు, మైనార్టీలు ఏడెనిమిది వేలు, వికలాంగులు ఐదువేలు)విద్యార్థులు ఉపకార వేతనాలు అందక నానా పాట్లుపడుతున్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు నెలనెలా ఠంఛ¯ŒSగా ఉపకారవేతనాలు (ఎంటీఎఫ్) ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ రెండు నెలలైనా ఉపకారవేతనాలు ఇవ్వలేని పరిస్థితి. రీ ఇంబర్స్మెంట్ ఆఫ్ ట్యూష¯ŒS ఫీజు (ఆర్టీఎఫ్)కు సంబంధించిన బిల్లులు కూడా నిలిచిపోయాయి. ఉపకార వేతనాలు, ఫీజు రీ ఇంబర్స్మెంట్ అన్ని బిల్లులు కలిపి సుమారు రూ.35 కోట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. జిల్లాలో కేవలం ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌పై ఆధారపడి నడుస్తున్న ఇంజినీరింగ్ కాలేజీల పరిస్థితి అయోమయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 800 ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆర్టీఎఫ్ బిల్లులు మంజూరుకాక బ్యాంకుల నుంచి తిరిగి వచ్చేస్తుండటంతో నరకయాతన ఎదుర్కొంటున్నాయి. జీపీఎఫ్కూ ఇబ్బందులే... విద్యార్థుల ఫీజులతోపాటు జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) నుంచి కుటుంబ అవసరాల కోసం ఉద్యోగులు రుణాలకు దరఖాస్తు చేసుకుని రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. జీపీఎఫ్‌కు సంబంధించి రూ.5 కోట్లు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం బిల్లు రూ.3 కోట్లు, మున్సిపాలిటీలకు, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు తదితర శాఖలకు సం బంధించి రూ.380 కోట్లు (చెక్కుల రూపంలో) బిల్లులు ఖ జానా శాఖలో పేరుకుపోయాయి. మెడికల్ రీ యిం బర్స్మెంట్ రూ.50 లక్షలు, సరెండర్ లీవ్స్ రూ.8 కో ట్లు, రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ రూ.3 కోట్లు మేర బిల్లుల కోసం గత నెల నుంచి ఎదురుచూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా... బిల్లులు ఆపమని ప్రభు త్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులూ రాలేదు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పై నుంచి ఏ బిల్లులకు అనుమతి ఇవ్వమంటే వాటికే సర్థుబాటు చేస్తున్నాం. ఫ్రీజింగ్ అనే విషయం మా దృష్టికి రాలేదు.అనుమతి రాగానే మిగిలిన బిల్లులు కూడా క్లియర్ చేస్తాం. – పి.భోగారావు, జిల్లా ఖజానా అధికారి, కాకినాడ. -
పందేనిదే పైచేయి
అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో యథేచ్ఛగా కోడిపందేలు హోంమంత్రి నియోజకవర్గాల్లోనూ అదే తీరు మురమళ్లలో భారీ బరులు.. కోట్లలో పందేలు విచ్చలవిడిగా గుండాటలు, జూదాలు చేతులెత్తేసిన పోలీసులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : చిన్నచిన్న విషయాలకే సామాన్యులపై ప్రతాపం చూపించే పోలీసులు.. అధికార, ధనబలం ముందు తల వంచేశారు. పందెంకోళ్లకు, పందెగాళ్లకు పగ్గాలు వేయలేకపోయారు. కోడిపందేల నియంత్రణ కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు అడ్రస్ లేకుండా పోయాయి. ఫలితంగా సంక్రాంతి కోడిపందేలు జిల్లావ్యాప్తంగా యథేచ్ఛగా సాగాయి. అన్నిచోట్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలే దగ్గరుండి పందేలను ప్రారంభించడం.. ఆ పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లావ్యాప్తంగా శుక్రవారం భోగి పండగనాడే కోడిపందేలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. దీంతోపాటు గుండాట, పేకాటలు జోరుగా సాగాయి. తొలిరోజు పందెం కోడి ఆరేడు కోట్ల పైనే కొట్టింది. కోడిపందేల నిర్వాహకులు జిల్లా అంతటా సుమారు 40 బరులు ఏర్పాటు చేశారు. పెద్దనోట్ల రద్దు ప్రభావం పందేలపై కనిపించలేదు. అన్నిచోట్లా రూ.2 వేల నోట్లు రెపరెపలాడాయి. స్వైపింగ్ మెషీన్లు సిద్ధం చేసినా వినియోగించలేదు. ప్రధాన ఆకర్షణగా మురమళ్ల ∙ఐ.పోలవరం మండలం మురమళ్ల బరిలో టీడీపీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కత్తులు లేకుండా సంప్రదాయ పద్ధతిలో కోడిపందేలకు శ్రీకారం చుట్టారు. అనంతరం కత్తులు కట్టి యథేచ్ఛగా పందేలు నిర్వహించారు. ఇక్కడి ఏర్పాట్లు మినీ స్టేడియంను తలపించాయి. బరిలో ప్రతి పావుగంటకో పందెం జరిగింది. ఒక బరిలో ఒక్కో పందెం రూ.10 లక్షలకు తక్కువ కాకుండా జరిగింది. దీంతోపాటు పై పందేలు రూ.20 లక్షల పైనే జరిగాయి. అక్కడ మరో మూడు చిన్న బరులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ పందేలు జరిగాయి. ఇక్కడి పందేల్లో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర కనిపించారు. ∙రూ.38 లక్షలకు హక్కులు దక్కించుకున్న గుండాట నిర్వాహకులు గుండాట, సూట్ బాల్ ఆటల కోసం 15 బోర్డులు ఏర్పాటు చేసి అరకోటి లావాదేవీలు జరిపారు. ∙మురమళ్లలోనే సుమారు 10 వేల మంది పందేలను వీక్షించారు. రహదారుల మధ్య మొక్కలు, నేతల ఫ్లెక్సీలు, గ్యాలరీలు.. ఇలా సర్వహంగులతో నిర్వహించడంతో మురమళ్ల కోలాహలంగా మారింది. ∙ఒక్క మురమళ్లలోనే రూ.3 కోట్ల‡ పందేలు జరగగా, మిగిలినచోట్ల సుమారు రూ.4 కోట్లు.. కలిపితే మొత్తంగా రూ.7 కోట్ల మేర పందేలు జరిగాయని అంచనా. మరిన్నిచోట్ల : రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని చింతలపల్లి, మలికిపురం, లక్కవరం, గూడపల్లి, శంకరగుప్తం, సఖినేటిపల్లి లంక, రామేశ్వరం, లొల్ల, ర్యాలి, పొడగట్లపల్లి, దేవరపల్లి, నడిమిలంక, గెద్దనాపల్లి, చెయ్యేరు, పల్లంకుర్రు శివారు ఐ.చెరువు, అన్నంపల్లి, పల్లిపాలెం, రాజుపాలెం, గున్నేపల్లి అగ్రహారం తదితర గ్రామాల్లో కోడిపందేలు నిర్వహించారు. ∙కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప, కాకినాడ రూరల్‌లోని 16 ప్రాంతాల్లో బరులు వేసి రూ.లక్షల్లో పందేలు నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కనుసన్నల్లోనే కోడిపందేలు నిర్వహించారు. ∙మండల కేంద్రమైన కాజులూరు, గొల్లపాలెం, పల్లిపాలెం, కుయ్యేరు, జగన్నాథగిరి, కె.గంగవరం మండలం పేకేరు, ఎండగండి, కూళ్ల, రామచంద్రపురం మండలం ద్రాక్షారామల్లో కూడా కోడిపందేలు యథేచ్ఛగా సాగాయి. పోలీసులతో ముందుగానే ఒప్పందాలు! పందేలు జరిగే ప్రతి ప్రాంతం నుంచి బరికి రోజుకు రూ.5 లక్షల చొప్పున పోలీసులకు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చాలాచోట్ల పోలీసుల మొబైల్ ఫో¯ŒSలు స్విచ్చాఫ్ అయిపోయాయి. కొందరు ఫో¯ŒS లిఫ్ట్ చేసినా పందేలు తమ దృష్టికి రాలేదని పైకి చెబుతూ.. పైనుంచి వస్తున్న ఒత్తిళ్ల ముందు తామెంత అని ప్రైవేటు సంభాషణల్లో అంటున్నారు. కాగా, దర్జాగా కోడిపందేలు ఆడుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులను, నేతలను ఏమీ చేయలేని పోలీసులు.. కొత్తపేట, కరప తదితర ప్రాంతాల్లో సరదాగా పందేలు ఆడుతున్న సామాన్యులపై మాత్రం ప్రతాపం చూపారు. 25 వరకూ 144 సెక్షన్ : జిల్లాలో ఈ నెల 25వ తేదీ వరకూ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ఐదుగురికి మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తప్పవన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కోడి పందేల అదుపునకు ఉమ్మడి ప్రణాళిక
సంయుక్త తనిఖీ బృందాలతో నిరంతర పర్యవేక్షణ మండల స్థాయి బృందాల్లో తహసీల్దార్, ఎస్సై, జంతు సంరక్షణ సభ్యులు కలెక్టర్ మార్గదర్శకాలతో అత్యవసర ఆదేశాలు అమలాపురం టౌన్ : సంక్రాంతి పండుగలకు కోడి పందేలు నిర్వహించవద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వటంతో పాటు కొన్ని మార్గదర్శకాలు కూడా సూచించింది. వాటి అమలుకు జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ రంగంలోకి దిగారు. హైకోర్టు మార్గదర్శకాలను అమలు చేసే దిశగా జిల్లాలోని అన్ని మండలాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉమ్మడి ప్రణాళిక అమలుకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. తక్షణమే మండల స్థాయిల్లో కోడి పందేలను పూర్తిగా నిరోధించేందుకు తçహసీల్దార్, పోలీసు ఎస్సై, జంతు సంరక్షణ కోసం పాటు పడే స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఓ ప్రతినిధితో కూడిన తనిఖీ బృందాన్ని ఏర్పాటుచేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. కలెక్టర్ అత్యవసర ఆదేశాలతో జిల్లాలోని అన్ని మండలాల్లో బృందాల ఏర్పాటుకు బుధవారం నుంచి మండల స్థాయి రెవెన్యూ, పోలీసు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ బృందాలు ఈనెల 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ మండలంలోని అన్ని గ్రామాల్లో నిరంతం పర్యటించి పందేల అదుపునకు చర్యలు చేపడుతూనే ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆర్డీవోలకు తద్వారా కలెక్టరేట్‌కు నివేదించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బృందాల విధులు ఇవీ.. l ఈ బృందాలు తొలుత ఆయా మండలాల్లో ఎక్కడెక్కడ కోడి పందేలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయో ఆ స్థలాలను గుర్తించాలి. l గుర్తించిన స్థలాల్లో ఆంక్షలు ఉన్నా పందేలు నిర్వహించేందుకు పందెగాళ్లు కాలు దువ్వుతుంటే అలాంటి స్థలాల్లో 144 సెక్ష¯ŒS అమలు చేయాలి. l మండలంలోని ప్రతి గ్రామంలో కోడి పందేల నిరోధంపై బృందం ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ జంతు సంరక్షణ చట్టాలపై అవగాహన, వాటిని ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి అనే అంశాలపై అవగాహన కల్పిస్తారు. l మండలంలో అనుమానిత కోడి పందేల స్థలాల వద్దకు బృందం వెళ్తున్నప్పుడు కొందరు కానిస్టేబుళ్లు, ఫొటో, వీడియో గ్రాఫర్లను విధిగా వెంట పెట్టుకుని వెళ్లాలి. l పండుగలకు ముందు నుంచి అంటే ఏడో తేదీ నుంచి పండుగల తర్వాత ఈనెల 24వ తేదీ వరకూ ఈ బృందాలు పందేలపై నిఘా కొనసాగించాలి. l పందేలకు సన్నాహాలు జరుగుతున్నా... పందేలు నిర్వహిస్తున్నా పోలీసు బందోబస్తుతో బృందం దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేయనున్నారు. -
సిరులు కురిసే వేళ కన్నీరు
అన్నదాతను కుదిపేస్తున్న కరెన్సీ కల్లోలం ఖరీఫ్ కరుణించిన వేళ.. దెబ్బ తీసిన పెద్ద నోట్ల రద్దు బ్యాంకు ఖాతాలకు జమవుతున్న ధాన్యం సొమ్ములు ఖాతాలో వేల రూపాయలున్నా చేతికి అందని వైనం తీరని పాత అప్పులు కొత్తగా పెట్టుబడి పెట్టలేని దుస్థితి రబీ సాగుపై పెను ప్రభావం నేలతల్లి పంటసిరులు కురిపిస్తున్న వేళ.. ఆ సిరులు చేతికి అందక అన్నదాత కంట కన్నీరు ఒలుకుతోంది. కోత కోసి, కుప్ప నూర్చిన కూలీలకు ఇవ్వాలన్నా.. రెండో పంట రబీకి పెట్టుబడి పెట్టాలన్నా.. అవసరాల మేరకు బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులు తీసుకోలేని దైన్యంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్ సాగుకోసం అప్పులు తెచ్చి, పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరిగిపోతున్నాయి. అటు దాళ్వాకు పెట్టుబడి పెట్టే దారి కానరావడంలేదు. రెండో పంట పనుల్లో ఈపాటికే బిజీగా ఉండాల్సిన వేళ.. బ్యాంకులవద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎదురైంది. పాత పెద్ద నోట్లను రద్దు చేయడం.. కొత్త పెద్ద నోటు రూ.2 వేలను చెలామణీలోకి తేవడం ద్వారా మోదీ ప్రభుత్వం సృష్టించిన కరెన్సీ కల్లోలం.. జిల్లా అన్నదాతలను కుదిపేస్తున్న వైనంపై ‘సాక్షి’ ఫోకస్.. మండపేట : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందిందన్న అన్నదాతల ఆనందాన్ని ప్రస్తుత కరెన్సీ సంక్షోభం ఆవిరి చేస్తోంది. పండిన పంటతో పెద్ద పండగకు సిద్ధమవ్వాల్సిన తరుణంలో పెద్ద నోట్ల రద్దు వారికి పెద్ద కష్టాలనే తెచ్చిపెట్టింది. మద్దతు ధరకు మించి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా చేతికి చిల్లిగవ్వ కూడా చిక్కడం లేదు. ప్రతి రోజూ ఇచ్చే రూ.2 వేల కోసం రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి. అటు తొలకరి అప్పులు తీర్చలేక.. దాళ్వాకు కొత్త అప్పులు పుట్టక.. సమయం మించిపోతున్నా ఏరువాక సాగలేక అన్నదాతలు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నెల 15వ తేదీ నాటికే నాట్లు పూర్తి కావాల్సి ఉండగా.. చేతిలో డబ్బులు లేకపోవడంతో దాళ్వా సాగులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెలాఖరు వరకూ నాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని దాదాపు 4.2 లక్షల ఎకరాలు, ఏలేరు పరిధిలో సుమారు 35 వేల ఎకరాల్లో రబీ సాగు జరుగుతుంది. తొలకరి కోతల అనంతరం నేల పదునుపై ఉండగానే రైతులు దాళ్వా పనులు చేపడుతుంటారు. మార్చి నెలాఖరు నాటికి గోదావరి నీటిలభ్యతను దృష్టిలో ఉంచుకొని, డిసెంబర్ 15వ తేదీ నాటికి నాట్లు పూర్తి చేసేవారు. కానీ, ఈసారి పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో పెట్టుబడులు పెట్టేందుకు రైతులవద్ద డబ్బుల్లేక దాళ్వా పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలోని మండపేట, అనపర్తి, ఆలమూరు, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో ఖరీఫ్ కోతలు పూర్తయి, దాదాపు 20 రోజులు కావస్తున్నా ఇంకా దాళ్వా పనులు జోరందుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవసరానికి అందని డబ్బులు జిల్లాలోని 2.19 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ వరి సాగు చేయగా, సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. జిల్లావ్యాప్తంగా 275 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. గత ఏడాది 2.63 లక్షల హెక్టార్లలో 16.11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా, 12.22 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుత సీజ¯ŒSలో ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 3.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి మొత్తం రూ.498 కోట్లకుగానూ ఇప్పటివరకూ రూ.410 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేస్తున్నారు. కామ¯ŒS వెరైటీ 75 కేజీల బస్తా ధాన్యానికి రూ.1,102.50 మద్దతు ధర కాగా, జిల్లాలోని పలుచోట్ల మిల్లర్లు దీనికంటే రూ.60 నుంచి రూ.100 వరకూ అధికంగా చెల్లిస్తున్నారు. దీంతో రైతులు నేరుగా మిల్లులకే ధాన్యాన్ని తరలిస్తున్నారు. బ్యాంకుల ద్వారానే చెల్లింపులు జరగాల్సి ఉండటంతో రైతులు తీసుకువచ్చిన ధాన్యానికి మిల్లర్లు చెక్కులు అందిస్తున్నారు. రబీలో ఎకరాకు సాగు ఖర్చు వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం రబీ సాగు కోసం ఎకరాకు రూ.30 వేల వరకూ ఖర్చవుతుంది. సాగు ప్రారంభించిన మొదటి నెల రోజుల్లో ఆయా రూపాల్లో పెట్టుబడులకు రూ.12 వేల వరకూ అవసరమవుతాయని అంచనా. రబీ సాగు వ్యయం ఈ విధంగా ఉంటుంది. దమ్ము, పట్టి లాగడానికి, పారలంక వేయడానికి : రూ.3,000 పంట కోత, నూర్పిడి : రూ.6,000 – రూ.8,000 పురుగు మందులు : రూ.4,500 – రూ.6,000 ఎరువులు : రూ.3,500 – రూ.4,000 ఊడ్పు : రూ.3,500 – రూ.5,000 నారుమడి ఖర్చు : రూ.1,500 విత్తనం ఖరీదు : రూ.900 కలుపు ఖర్చు : రూ.2,000 పెట్టుబడులకు దారేదీ..! జిల్లావ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల మంది రైతులుండగా వీరిలో అధిక శాతం మంది కౌలురైతులే ఉన్నారు. అప్పులు చేసి సాగుకు పెట్టుబడులు పెట్టడం వీరికి పరిపాటి. ఎరువులు, పురుగు మందులను దుకాణాల నుంచి అరువుపై తీసుకుని, సాగు అనంతరం పంట అమ్మగా వచ్చిన సొమ్ములతో అప్పులు తీరుస్తూంటారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో, ఖరీఫ్ ధాన్యం అమ్మగా వచ్చిన సొమ్మంతా బ్యాంకు ఖాతాల్లోనే జమ కావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కోతలు కోసిన కూలీలకు డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో.. కొత్తగా నాట్లు వేసే కూలీలకు సొమ్ములెక్కడ నుంచి తేవాలని ఆవేదన చెందుతున్నారు. ఎరువుల దుకాణాల్లో పాత అప్పులు చెల్లించకపోవడంతో, దాళ్వా సాగుకు ఎరువులు తెచ్చేందుకు అవసరమైన డబ్బులు ఎలా తేవాలని అయోమయానికి గురవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులకు నోట్ల సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో వేలాది రూపాయలు ఖాతాల్లో ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నా రూ.2 వేల నుంచి రూ.4 వేలకు మించి ఇవ్వడం లేదు. ఓపక్క కుటుంబ పోషణ, మరోపక్క రబీ పెట్టుబడులకు ఈ సొమ్ములు చాలక ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పంట చేతికందిందన్న ఆనందాన్ని పెద్ద నోట్ల రద్దు ఆవిరి చేస్తోందని వాపోతున్నారు. పలుచోట్ల బ్యాంకుల్లో సొమ్ములు లేవని చెబుతుండటంతో ధర్నాలకు దిగుతున్నారు. బ్యాంకర్ల తీరును నిరసిస్తూ కపిలేశ్వరపురం మండలం అంగరలో రైతులు, స్థానికులు ఆందోళనకు దిగారు. చివరిలో ఇక్కట్లే.. కాలువల ఆధునికీకరణ పనులు, సాగునీటి లభ్యత దృష్ట్యా మార్చి నెలాఖరుకు రబీ సాగు పూర్తి చేయాలి. ఇందుకోసం ఈ నెల 20వ తేదీ నాటికే నాట్లు పూర్తి కావాల్సి ఉంది. దమ్ము, నారుమడులు, నాట్లు, ఎరువులు తదితర వాటి కోసం సాగు ప్రారంభంలో రూ.10 వేలు అవసరమవుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అంత సొమ్ము చేతిలో లేని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత రబీ సాగులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. సాధారణంగా తూర్పు డెల్టాలోని మండపేట, అనపర్తి నియోజకవర్గాల పరిధిలో డిసెంబర్ 15వ తేదీకే నాట్లు పూర్తి చేస్తూంటారు. ఈసారి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆయాచోట్ల ఈ నెలాఖరు వరకూ నాట్లు పడే పరిస్థితి ఉండగా, తూర్పు డెల్టాలోని మిగిలిన ప్రాంతాలు, మధ్య డెల్టా పరిధిలో జనవరి నెలాఖరు వరకూ నాట్లు పడతాయని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో సాగు చివరిలో నీటి ఎద్దడి తలెత్తి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్టుబడి పెట్టే దారి లేదు ఆరెకరాలు కౌలుకు చేస్తున్నాను. తొలకరి పంటలో ఎకరానికి 25 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. మొత్తం ధాన్యాన్ని మిల్లుకు తోలితే చెక్కు ఇచ్చారు. బ్యాంకులో వేసి అప్పుడే దాదాపు నెల రోజులవుతోంది. తొలకరి సాగు కోసం రూ.లక్ష వరకూ అప్పు చేశాను. బ్యాంకులోని డబ్బులు వస్తేనే కానీ అప్పు తీరే దారి లేదు. కొత్తగా రబీ సాగు చేయాలన్నా ఆ డబ్బులే దిక్కు. పాత అప్పు తీరిస్తేనే కానీ కొత్తగా అరువుపై ఎరువులు ఇవ్వరు. బ్యాంకుకు వెళ్తూంటే రోజుకు రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారు. రోజూ బ్యాంకుల వద్ద పడిగాపులు పడలేకపోతున్నాం. – గుబ్బల శ్రీనివాస్, కౌలు రైతు, మండపేట 15 రోజులుగా ఎదురు చూస్తున్నాను నాలుగు ఎకరాల్లో పండిన ధాన్యాన్ని కొంత కొనుగోలు కేంద్రాల్లో అమ్మాను. ఆ రెండుచోట్లా ధాన్యం డబ్బు బ్యాంక్ అకౌంట్లలోకి వేస్తామన్నారు. ధాన్యం అమ్మి 15 రోజులైంది. రబీ పనులు మొదలు పెడదామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. బ్యాంకుకు వెళితే రూ.4 వేలు వస్తుందంటున్నారు. – చిక్కం నాగ లక్ష్మణరావు, రైతు, సన్నవిల్లి, ఉప్పలగుప్తం మండలం కూలీలకు డబ్బులివ్వలేకపోతున్నాను నాలుగెకరాల్లో పండించిన ధాన్యాన్ని కమిష¯ŒS ఏజెంటు ద్వారా వారం రోజుల కిందట మిల్లరుకు అమ్మాను. డబ్బులు నా బ్యాంకు అకౌంట్లో వేశారు. ధాన్యం ఒబ్బిడి చేసిన కూలీలకు ఇంకా డబ్బులివ్వాలి. బ్యాంకులకు వెళ్లి డబ్బుల కోసం గంటల తరబడి నిలబడ్డాను. రబీ పనులు మొదలు పెట్టాను. ఆ పనులన్నీ పక్కన పెట్టి బ్యాంకుకు వెళ్లాలి. – కటికదల నాగేశ్వరరావు, రైతు, దేవగుప్తం, అల్లవరం మండలం ధాన్యం అమ్మినా ఆనందం లేదు పదెకరాలు కౌలుకు చేస్తున్నాను. పంట అమ్మగా వచ్చిన సొమ్ముకు చెక్కు ఇవ్వడంతో నగదంతా బ్యాంకు అకౌంట్లోనే జమైపోయింది. తొలకరి పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఇంకా తీర్చలేదు. దాళ్వాకు ఎక్కడి నుంచి అప్పులు తీసుకురావాలో తెలీడం లేదు. – బొంతు సత్యనారాయణ, కౌలు రైతు, చెల్లూరు రూ.5 వేలలోపే ఇస్తామంటున్నారు ధాన్యం అమ్మిన సొమ్ము రూ.90 వేలు ఆంధ్రాబ్యాంకులో వేశారు. ఆ నగదు తీసుకునే అవకాశం లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. అప్పులు, కుటుంబ అవసరాలు తీరని దుస్థితి. బ్యాంకుకు వెళ్తే రూ.5 వేల లోపే ఇస్తామంటున్నారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా పట్టుమని రూ.10 వేలు కూడా తీసుకోలేకపోయాను. – గుబ్బల అప్పారావు, రైతు, బాలవరం, రంగంపేట మండలం రూ.2 వేల కోసం నాలుగుసార్లు బ్యాంకుకు తిరిగా.. ధాన్యం అమ్మగా వచ్చిన రూ.10 వేల చెక్కు బ్యాంకులో వేశాను. ఇప్పటివరకూ రూ.2 వేలు తీసుకోవడానికి నాలుగుసార్లు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వచ్చింది. కూలి పనులు మానుకుని, బ్యాంకు వద్ద పడిగాపులు పడితేనే కానీ నగదు చేతికి అందడం లేదు. – వెంగళపతి రాజారావు, రైతు, దొడ్డిగుంట, రంగంపేట మండలం పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలి? సార్వాలో పండించిన పంట ఒబ్బిడి చేసి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాం. వాటికి సంబంధించిన డబ్బు బ్యాంకు ఖాతాలో వేస్తామంటున్నారు. బ్యాంకులకు వెళ్తే డబ్బు లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో దాళ్వా సాగు చేయడానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకు రావాలో అర్థం కావడం లేదు. – గంధం శ్రీనివాస్, గెద్దాడ, మామిడికుదురు మండలం లైనులో నిలబడాల్సి వస్తోంది ఎనిమిదెకరాల్లో పండించిన ధాన్యం అయినవిల్లి సొసైటీ ద్వారా అమ్మాను. దీనికి సంబంధించి రూ.2.64 లక్షలు నా బ్యాంకు ఖాతాలో వేశారు. బ్యాంకుకు వెళ్తే రోజుకు రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారు. ధాన్యం డబ్బు ఒకేసారి ఇప్పించే ఏర్పాట్లు చేయాలి. – పొత్తూరి సత్యనారాయణరాజు, కౌలు రైతు, అయినవిల్లి -
‘లెక్కే’ లేదు
అన్ని బ్యాంకుల్లోనూ నగదు కొరతే పరిమితులు విధించి అందరికీ సర్దుతున్న బ్యాంకులు బ్యాంకుల్లో నిండుకున్న నిల్వలు ఖాతాదారుల ఆందోళనలు సాక్షి, రాజమహేంద్రవరం : ప్రజలు తమ కనీస అవసరాలను తీర్చుకోవడానికి బ్యాంకుల వద్ద బారులుతీరుతున్నా నగదు అందడం లేదు. రిజర్వ్‌బ్యాంక్ నుంచి నగదు రాకపోవడంతో బ్యాంకులు నో క్యాష్ బోర్టులు పెడుతున్నాయి. గత నాలుగు రోజులుగా తమ వద్ద ఉన్న నగదునే అందరికీ సర్దుతున్న రాజమహేంద్రవరం పేపర్‌మిల్లు సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ’నో క్యాష్’ బోర్డులు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా పలు బ్యాంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఖాతాదారులు తమను నిలదీస్తుండడంతో బ్యాంకు అధికారులు వారికి సర్దిచెప్పలేక సతమతమవుతున్నారు. ఏలేశ్వరంలోని ఆంధ్రా బ్యాంకులో నగదు ఇవ్వకపోవడంతోపాటు ఖాతాదారులకు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ సీపీఐ(ఎల్) నాయకులు బ్యాంకు రోడ్డుపై ధర్నా చేశారు. కొత్తపేట ఎస్బీఐ వద్ద ఖాతాదారులకు నగదు ఇవ్వకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే నగదు తెప్పించి ఇవ్వాలని కోరారు. ఏటీఎంల వద్ద అదే తీరు... బ్యాంకులకు నగదు రాకపోవడంతో ఏటీఎంలు కూడా ఖాళీగా దర్శనమిచ్చాయి. జిల్లాలో 931 ఏటీఎంలుండగా అందులో 10 శాతం ఏటీఎంలలో నగదు ఉండడంలేదు. ఉన్న చోట్ల భారీ క్యూలు. రెండు వేలు తీసుకోవడానికి నాలుగైదు గంటల సమయం పడుతోందని ప్రజలు వాపోతున్నారు. రాజమహేంద్రవరం నగరంలో కేవలం రెండు ఏటీఎంలలో మాత్రమే నగదు వస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. -
జగన్మాత నమోస్తుతే
-
దేవీ వైభవం
జిల్లా అంతటా శరన్నవరాత్రులు ప్రారంభం అన్నవరం: రత్నగిరిపై శరన్నవరాత్రి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు స్వామివారి ప్రధానాలయంలో రుత్విక్కుల మంత్రోచ్చారణల మధ్య పూజలకు అంకురార్పణ చేశారు. సంకల్పం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరుణ, దీక్షా వస్త్రధారణ, కలశస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావులతో పండితులు ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా నవరాత్రి వేడుకల్లో అమ్మవారికి పూజలు చేసే రుత్విక్కులకు దీక్షా వస్త్రాలను చైర్మన్, ఈఓ అందజేశారు. తొలిరోజు బాల అవతారంలో.. శరన్నవరాత్రుల్లో దుర్గామాతలను రోజుకో అవతారంలో అలంకరించి పూజలు చేస్తారు. కాగా తొలిరోజు శనివారం కనకదుర్గ, వనదుర్గ అమ్మవార్లను ‘బాల’ అవతారంలో అలంకరించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరుగంటల వరకూ అమ్మవార్లకు లక్షకుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి తీర ్థప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమాలను దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, వ్రతపురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, ఇతర రుత్విక్కులు పాల్గొన్నారు. రజిత కవచ అలంకారంలో వెదురుపాక విజయదుర్గా అమ్మవారు వెదురుపాక(రాయవరం) : మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శనివార ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) సమక్షంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పీఠాధిపతి సతీమణి సీతమ్మవారు కలశస్థాపన పూజలు చేశారు. తొలిరోజు 1,152 మంది భక్తులు కలశాలను ఏర్పాటు చేసుకున్నారు. విజయదుర్గా అమ్మవారిని రజిత కవచ అలంకారంలో పలు రకాల పూలు, సర్వాభరణాలతో నయనానందకరంగా అలంకరించారు. భక్తుల నుద్దేశించి పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. పారిశ్రామికవేత్తలు ద్రోణంరాజు లక్ష్మీనారాయణ, డి.రాజశేఖర్, కర్రి వెంకటకృష్ణారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్వో వి.వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. -
ఉత్సాహంగా జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
సామర్లకోట : స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో జిల్లా పురుషుల, స్త్రీల కబడ్డీ జట్ల ఎంపిక ఆదివారం జరి గింది. రాజమహేంద్రవరం, కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, కిర్లంపూడి మం డలాల నుంచి వచ్చిన క్రీడాకారులకు పో టీలు నిర్వహించి జట్లను ఎంపిక చేశా రు. ఈ జట్టు వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు సామర్లకోట పట్టణంలో నిర్వహిం చే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొం టాయి. ఎన్టీఆర్ మెమోరియల్ పేరుతో 64వ రాష్ట్రస్థాయి పురుషుల, స్త్రీల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల నిర్వాహక కమిటీ కార్యదర్శి బోగిళ్ల మురళీకుమార్ (జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు) మాట్లాడుతూ నిర్వాహక కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యవహరిస్తారన్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తాళ్లూరి వైకుంఠం ఆధ్వర్యంలో జట్లను ఎంపిక చేశామన్నారు. పురుషుల జట్టు ఎ. నవీన్‌రాజు, జి. ప్రసాద్, కె. శ్రీని వాసు, కె. ఆర్తివదన్, పి. అజయ్, ఈ నా గేంద్ర, బి. పవన్ వెంకటకుమార్, సీహెచ్ మణికంఠ, పీవీ దుర్గారావు, కె.వేణు, కేవీఎల్ నారాయణ, ఆర్.అశోక్ ప్రధాన జట్టుకు ఎంపికయ్యారు. అదనంగా జి.ర ఘు, జి. శ్రీను, కె.దుర్గాప్రసా ద్, బి.ఉమామహేశ్వరరావులను ఎంపిక చేశారు. మహిళల జట్టు డి.దైవకృప, వి.రోహిణిదేవి, కేవీఎం దు ర్గ, వై.గిరిజా అనంతలక్ష్మి, జీఎస్ఎల్ఎన్ శివజ్యోతి, పి.విజయదుర్గ, కె.సత్యవేణి, ఎం.హేమలత, డి.వేదమణి, యు.లక్ష్మి, ఎస్ఎస్ఎస్ఎల్ ప్రసన్న, ఐ.సూర్యభవా ని,ఎన్.కావ్య,కె.స్వాతి, ఎన్.శిరిషా, జె.సుబ్బలక్ష్మి, డి.కృపామణి, వి.విజయ ఎంపికయ్యారు. కార్యక్రమంలో వీఆర్ కెనడీ, కొండపల్లి శ్రీను, గంగిరెడ్డి బలరామ్, మ ట్టా సుబ్బారావు, వెంకటేశ్వరరావు,గోలి సత్తిరాజు, బి. మోహనరావు పాల్గొన్నారు. -
కుమార్తె తిట్టిందని తల్లిదండ్రులు ఆత్మహత్య?
విషయాన్ని కప్పిపుచ్చేందుకు తెలుగు మహిళ యత్నం కాకినాడ రూరల్ : కూతురు తమను చీటికీ మాటికీ తిడుతుండడం, ఒక్కోసారి చేయి చేసుకుంటుండడంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన తెలుగు మహిళ నాయకురాలు కావడంతో విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం.తూర్పు గోదావరి జిల్లా కాకినాడ– సామర్లకోట రోడ్డులోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు తన తల్లిదండ్రులను బుధవారం ఉదయం మందలించి, చేయి చేసుకోవడంతో వారు మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకొని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వెంటనే వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చి, ఆత్మహత్య కేసును కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై టూ టౌన్ పోలీసులను వివరాలు కోరగా తమకు ఆత్మహత్యపై ఎటువంటి సమాచారం లేదని, ఆసుపత్రి నుంచి ఎంఎల్సీ వస్తే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. -
డిపాజిట్లు గల్లంతైతే..
పాలక వర్గాల కనుసన్నల్లో కోఆపరేటివ్ బ్యాంకులు ఏపీఎంపీసీఎస్–1995 చట్టంలోకి మార్చేందుకు బోర్డుల యత్నాలు ఈ చట్టపరిధిలోకి వెళితే ప్రభుత్వ నియంత్రణ శూన్యం ఎజెండాలో చేర్చిన ది ఇన్నీసుపేట ఆర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అదే దారిలో ది ఆర్యాపురం, ది జాంపేట బ్యాంకులు సహకార బ్యాంకుల్లో డిపాజిట్లకు ఇక సర్కారీ రక్షణ కరువవనుంది. చాలా బ్యాంకుల పాలకవర్గాలు 1995లో చేసిన ఏపీఎంపీసీఎస్ చట్ట పరిధిలోకి మారాలనుకుంటుండడమే దీనికి కారణం. దీనివల్ల సహకరా బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ కరువై పాలకమండళ్ల ఇష్టారాజ్యం మెుదలవుతుంది. అప్పుడు బ్యాంకుల్లో yì పాజిట్లు గల్లంతైతే బాధ్యులెవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సాక్షి, రాజమహేంద్రవరం : పేద, మధ్య తరగతి వర్గాల అభ్యున్నతికి, చిన్న వర్తకుల అభివృద్ధికి పరస్పర సహకార స్ఫూర్తితో స్థాపించిన సహకార బ్యాంకులపై పెద్దల కన్ను పడింది. వందల కోట్ల లావాదేవీలు జరుగుతున్న బ్యాంకులను తమ కనుసన్నల్లో ఉంచుకునేందుకు పాలక మండళ్లు పావులు కదుపుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో చిన్న, మధ్యతరగతి వర్తకుల ఆర్థిక అవసరాలు తీర్చాలన్న మహోన్నత ఆశయంతో స్వాతంత్య్రానికి పూర్వమే సహకార బ్యాంకులు వెలిశాయి. ప్రారంభంలో తమంతట తామే నిధులు సమకూర్చుకున్న ఈ బ్యాంకులకు అనంతరం కాలంలో ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సహకార సంస్థల చట్టం (ఏపీసీఎస్–1964) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యాంకులపై నియంత్రణ కలిగిఉంది. ఈ చట్టంలో పొందుపరిచిన విధివిధానాల ఆధారంగా సహకార బ్యాంకులు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఈ చట్టం ఉండగానే ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం(ఏపీఎంపీసీఎస్–1995)ను ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం వల్ల పాలక మండళ్లకు బ్యాంకుల వ్యవహారాలపై పూర్తి అధికారం ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి 1964 చట్టంలో ఉన్న పలు బ్యాంకులను ఆయా పాలక వర్గాలు ఇప్పుడు 1995 చట్టం పరిధిలోకి మార్చాలని యత్నిస్తున్నాయి. ప్రభుత్వ అజమాయిషీ సున్నా... ఏపీఎంపీసీఎస్–1995 చట్ట పరిధిలోకి సహకార బ్యాంకులు వెళ్లడం వల్ల బ్యాంకు ఆర్థిక వ్యవహారాలు, ఇతర కార్యకలాపాలపై ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. పాలక మండళ్లే స్వేచ్ఛగా విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో డిపాజిటర్ల నగదుకు రక్షణ కరువవుతుంది. ప్రభుత్వం నుంచి నిధులు బ్యాంకులకు అందవు. పరిస్థితులకు అనుగుణంగా చట్టంలో అంశాలపై నిబంధనలు రూపొందించే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. 1964 చట్టం ప్రకారం ప్రతి ఆరునెలలకోసారి సహకార విభాగంలోని ఆడిట్‌శాఖ బ్యాంకు లావాదేవీలను తనిఖీ చేస్తుంది. అయితే 1995 చట్టం ప్రకారం ఆడిట్ వ్యవహారం పూర్తిగా పాలకమండళ్ల చేతిలో ఉంటుంది. పాలక మండలి నియమించిన ప్రైవేటు వ్యక్తి చేసే ఆడిట్లో మండలి కలుగజేసుకునే అవకాశం ఉంటుంది. 1964 చట్టం ప్రకారం బ్యాంకుల విస్తరణ, వ్యాపారాభివృద్ధికి నిధులు వినియోగించాలంటే సహకార సంస్థల రిజిస్ట్రార్ అనుమతి తప్పనిసరి. 1995 చట్టం పరిధిలోకి వస్తే ఎంతమొత్తంలోనైనా నిధులు వినియోగించవచ్చు. ఉద్యోగుల నియామకం.. పాలక మండలి ఎన్నికలు... 1964 చట్టం పాలక మండలి ఎన్నికలు ప్రభుత్వమే నిర్వహించాలని పేర్కొంటోంది. అయితే 1995 చట్టం ప్రకారం అధికారంలో ఉన్న బోర్డు ఎన్నికలు నిర్వహించాలని తెలుపుతోంది. సభ్యత్వం మంజూరులో కూడా పాలక మండలిదే నిర్ణయం. ఉద్యోగులను కూడా పాలక మండలి నియమించుకునే అధికారం ఉండడంతో నియామకాల్లో అక్రమాలు జరిVó అవకాశం ఉంటుంది. అర్హులైన, సమర్థత కలిగిన ఉద్యోగులు వచ్చే అవకాశం ఉండదు. రుణాల మంజూరులోనూ పాలక మండలికి పూర్తి స్వేచ్ఛ ఉండడంతో అనర్హులకు రుణాలు మంజూరయ్యే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల డిపాజిటర్ల నగదుకు రక్షణ ఉందదు. పాలక మండలి నిజాయితీగా లేకపోతే కృషి బ్యాంక్ తరహాలో ఈ బ్యాంకులు దివాళా తీసే అవకాశం ఉంటుంది. బ్యాంకుల్లో నగదు దాచుకున్న వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు రోడ్డునపడే ప్రమాదం ఉంది. ఉవ్విళ్లూరుతున్న పాలక మండళ్లు... జిల్లా వ్యాపారకేంద్రమైన రాజమహేంద్రవరంలో ది ఆర్యాపురం, ది జాంపేట, ది ఇన్నీసుపేట అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. ఏపీసీఎస్–1964 చట్టం ప్రకారం ఇవి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో పలు శాఖలు ఉన్న ఈ బ్యాంకులు వందల కోట్ల టర్నోవర్ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం పాలక మండళ్లు ఈ బ్యాంకులను నిర్వహిస్తున్నాయి. ఈ బ్యాంకులను ఏపీఎంపీసీఎస్–1995 చట్ట పరిధిలోకి మార్చాలని పాలక మండలి సభ్యులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈనెల 28న(ఆదివారం) ది ఇన్నీసుపేట అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ నిర్వహిస్తున్న సాధారణ మహాజనసభ సమావేశంలో బ్యాంకును 1995 చట్ట పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని అజెండాలో పొందుపరిచారు. త్వరలో జాంపేట, ది ఆర్యాపురం బ్యాంకులను కూడా ఆయా పాలకమండళ్లు ఈ చట్ట పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పాలక మండళ్లదే అధికారం బ్యాంకులు ఏపీఎంపీసీఎస్–1995 చట్ట పరిధిలోకి వెళితే ఆర్థిక, పాలన వ్యవహారాల్లో పాలక మండళ్లదే తుది నిర్ణయం. ఉద్యోగుల నియామకం కూడా మండలే చేపడుతుంది. ఒక ఏడాదిలో బ్యాంకుకు నష్టం వస్తే మరుసటి ఏడాదికి బదలాయించడానికి వీలుండదు. దాని కోసం ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రుణాలు ఇవ్వడంలో పాలక మండలిదే తుది నిర్ణయం. ప్రభుత్వ తనిఖీలు ఉండవు. పాలక మండలి నిజాయితీగా లేకపోతే బ్యాంకు కుప్పకూలుతుంది. – సింగరాజు రవిప్రసాద్, సెక్రటరీ, ది జాంపేట కోఆపరేటీవ్ అర్బన్ బ్యాంక్ -
అంత్యం ఆహ్లాదం
పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు ముగిసిన గోదావరి అంత్యపుష్కరాలు నిర్విఘ్నంగా ముగిసిన పర్వం వలంటీర్ల సేవలు భేష్ 12 రోజుల్లో 9.66 లక్షల మంది భక్తుల పుణ్యస్నానాలు సాక్షి, రాజమహేంద్రవరం : పుష్కర పర్వం ముగిసింది. అంత్య పుష్కరాల 12వ రోజు పుష్కరఘాట్‌లో వేద మంత్రాల నడుమ సీఎం చంద్రబాబు దంపతులు పుష్కరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం జరిగిన గోదావరి హారతిని వీక్షించి భక్త కోటి పరవశించింది. బాణాసంచా వెలుగులతో గోదావరి తీరం వీనుల విందుగా మారింది. గత పన్నెండు రోజులుగా భక్తజనం పుణ్య గోదావరిలో పుష్కర స్నానం ఆచరించి తరించింది. పసిపాప నుంచి వృద్ధుల వరకు గోదావరి మాత స్పర్శకు పులకించారు. గోదావరి తీరం వెంబడి గత పన్నెండు రోజులుగా సందడి నెలకొంది. తీరం వెంబడి ఉన్న దేవాలయాలు భక్తులతో కళకళలాడాయి. 12 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 9,66,892 మంది పుష్కర స్నానాలు చేశారు. పలువురు పితృదేవతలకు పిండప్రదానాలు పెట్టారు. మరో పదకొండేళ్లకు పుష్కరాలు రానుండడంతో చివరి రోజు జిల్లా వ్యాప్తంగా ఘాట్లకు భక్తులు పొటెత్తారు. రాజమహేంద్రవరంతోపాటు కోనసీమలోని అంతర్వేది, అయినవిల్లి తదితర ఘాట్లకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థల సేవలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు ప్రతి ఘాట్‌కు డిప్యూటీ కలెక్టర్‌ను ఇన్చార్జిగా నియమించి పుష్కరాలను ప్రశాంతంగా నిర్వహించారు. ఘాట్ల వద్ద పారిశుధ్య కార్మికు లు ఎప్పటికప్పుడు ఘాట్లను శుభ్రం చేశా రు. గోదావరికి వరద రావడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి భక్తుల స్నానాలకు ఎలాంటి ఇబ్బం దులు లేకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ బి.రాజమకుమారి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు సడలించారు. ఘాట్లను ప్రతి రోజు పరిశీలిస్తూ బందోబస్తును స్వయంగా పర్యవేక్షించారు. వైద్యఆరోగ్యశాఖ పుష్కర భక్తులకు వైద్య సేవలందించింది. రోడ్లు భవనాలశాఖ, అగ్నిమాకపశాఖ, మత్యశాఖ, దేవాదాయ, విద్యుత్ శాఖలు అంత్యపుష్కరాల నిర్వహణలో తమ వంతు ప్రాత పోషించాయి. వలంటీర్ల సేవలు భేష్... అంత్యపుష్కరాలకు వచ్చిన భక్తులు వివిధ స్వచ్ఛంద సంస్థలు, కాలేజీ విద్యార్థులు 12 రోజుల పాటు విశేష సేవలందించారు. శ్రీకల్కి మానవసేవా సంస్థ, శ్రీసత్యసాయి సేవా సంస్థ, ఆంధ్రకేసరి యువజన సంఘం, ఆంధ్రకేసరి డిగ్రీ, జూనియర్ కళాశాల, ఆర్ట్స్ కాలేజీ, ఆదిత్య డిగ్రీ కాలేజీ, కాకినాడ ఎంఆర్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు వేకువజాము నుంచే ఘాట్ల వద్దకు చేరుకుని భక్తులకు తాగునీరు ఇవ్వడం, వృద్ధులు, వికలాంగులను ఘాట్లలోకి తీసుకెళ్లడం, తీసుకురావడం, భక్తుల వస్తులు భద్రంగా చూసుకోవడం వంటి సేవలందించారు. సాంసృ్కతిక కార్యక్రమాలు ఫుల్.. ప్రేక్షకులు నిల్ అంత్యపుష్కరాల 12 రోజులు పుష్కరఘాట్, సరస్వతీఘాట్, ఆనం కళాకేంద్రం, కోటిలింగాల ఘాట్ వద్ద ఆధ్యాత్మిక, సాంసృ్కతిక కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఆయా కార్యక్రమాలకు తగిన ప్రచారం కల్పించకపోవడంతో ప్రేక్షకులు పలుచగా హాజరయ్యారు. పుష్కరఘాట్ ఎదురు మండపం వద్ద నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతిరోజు శ్రోతలే ప్రేక్షకులుగా నిలిచారు. -
అంత్య పుష్కరోత్సాహం
-
1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ
ఆత్రేయపురం : జిల్లా వ్యాప్తంగా 1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.78 లక్షలు మంజూరు చేసిందని పశు సంవర్ధక శాఖ జేడీ వి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని పులిదిండి, కట్టుంగ గ్రామాల్లో పశు వైద్య కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 18 నుంచి 31 వరకు ఆయా గ్రామాల్లో 1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందులు పంపీణీ చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ మందు వల్ల పశువుల్లో పారుడు తగ్గి త్వరగా ఎదకు వచ్చి పాలదిగుబడి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 50 వేల పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశామన్నారు. అలాగే పశువులకు సంబంధించి జిల్లాలో 450 బోన్లు, గ్రామ స్థాయిలో పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొలంలో గడ్డి పెంచితే డెల్టా పరిధిలోని 18 వేలు, వెస్ట్రన్ డెల్టాలో రూ.20వేలు, మెట్టప్రాంతంలో రూ.16వేలు, ఏజెన్సీలో రూ.10 వేలు అందిస్తామన్నారు. పశుగ్రాసాన్ని కిలో రూపాయికి అందించాలని రైతులకు సూచించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా అజోల్లా నాచు పెంచుకునేందుకు కిట్లు పంపిణీ చేస్తామన్నారు. కిట్ ఒక్కంటికి రూ.3250 కాగా రూ.325కి అందజేస్తున్నామన్నారు. నాచు, తవుడు నీళ్లల్లో కలిపి పశువులకు పెట్టడం ద్వారా అవి ఆరోగ్యంగా ఉండి, పాల దిగుబడి పెరుగుతుందన్నారు. పశుమిత్రలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆత్రేయపురం, ర్యాలి పశువుల ఆస్పత్రి నిర్మాణాలకు ఒకొక్క భవనానికి రూ.16లక్షలు మంజూరయ్యాయన్నారు. గొర్రెలకు సంబంధించి వచ్చే నెల 5 నుంచి 15 వరుకు శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అనంతరం ఆయన ఆత్రేయపురం పశువైద్యశాలను పరిశీలించారు. డీసీసీబీ డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు, సర్పంచ్‌లు కనుమూరి ప్రసాదవర్మ, దొడ్డపనేని వెంకట్రావు, ఎంపీటీసీలు గొలుగులవాణి, దండు రాంబాబు, పశుసంవర్ధక శాఖ డీడీ గాబ్రియేల్, ఏడీ విశ్వేశ్వరరావు, వెలిచేరు, ర్యాలి పీహెచ్సీ వైద్యాధికారులు యు.ముఖేష్, రవి తేజ, వైద్య సిబ్బంది సూర్యనారాయణ, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. -
కుండపోత వర్షం
-
చినుకు చిందేసింది
జిల్లాలో పలుచోట్ల వర్షం సాయంత్రం వరకు చిరుజల్లులు ఇళ్లకు వెళ్లేందుకూ ఇబ్బందిపడ్డ విద్యార్థులు వేడివేడి తినుబండారాలకు పెరిగిన గిరాకీ సాక్షి, రాజమహేంద్రవరం : పక్షం రోజులుగా స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు మళ్లీ ప్రభావం చూపిస్తున్నాయి. సోమవారం రాత్రి జిల్లాలో పలుచోట్ల వర్షం పడగా మంగళవారం మధ్యాహ్నం చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చిరుజల్లులు పడ్డాయి. ఆకాశం మేఘావృతం కావడంతో వాతావరణం చల్లబడింది. రాజమహేంద్రవరం, కాకినాడ, రంగంపేటలలో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండపేట, రాజానగరం, పెదపూడి, రాజోలు, రామచంద్రాపురంలలో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. కొత్తపేట, పెద్దాపురం, పిఠాపురం, పి.గన్నవరంలలో చిరుజల్లులు పడ్డాయి. రాజమహేంద్రవరంలో మధ్యాహ్నం ఓ గంటపాటు భారీ వర్షం పడింది. సాయంత్రం ఐదు గంటల వరకు ఆగకుండా చిరు జల్లులు పడ్డాయి. దీంతో జనజీవనం స్తంభించింది. దుకాణాలు వ్యాపారాలు లేక వెలవెలబోయాయి. పాఠశాలలు, కళాశాలలు వదిలే సమయం కావడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. కొంతమంది వర్షంలో తడుస్తూనే తమ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. వాతావరణం చల్లబడడంతో మొక్కజొన్న పొత్తులు, వేడివేడి పకోడీలకు గిరాకీ పెరిగింది. రోడ్లవెంబడి ఉన్న పలహార బళ్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. చిరుజల్లులు పడతుండగానే రాజమహేంద్రవరం నగరంలో పారిశుధ్య కార్మికులు మురుగునీరు వెళ్లేందుకు కాలువల్లో చెత్తను తొలగించారు. వర్షానికి రోడ్లపైకి వచ్చిన చెత్తను తొలగించారు. రైల్వే స్టేషన్ ఎదురు రోడ్డులో వర్షం నీరు నిలబడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. -
అయ్యా.. రౌడీషీటర్ గారూ..
-
అయ్యా.. రౌడీషీటర్ గారూ..
- అమలాపురం పోలీసుల రివర్స్ ఎటాక్ అమలాపురం టౌన్: ఓ రౌడీషీటర్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఝలక్ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసులు. ఆ రౌడీషీటర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై ఆయనో రౌడీ అంటూ మరో ఫ్లెక్సీ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు. అమలాపురంలో ఆరు రౌడీ గ్యాంగ్‌లున్నాయి. దానిలో కొలగాని స్వామినాయుడు ఎలియూస్ నాయుడుపై కూడా రౌడీషీట్ ఉంది. శనివారం అతని పుట్టినరోజు కావడంతో అతని అనుచరులు పట్టణంలో 22 చోట్ల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అదే విధంగా గడియారంస్తంభం సెంటర్లో, అందునా మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న ట్రాఫిక్ ఐల్యాండ్పై భారీ సైజులో నాయుడు ఫ్లెక్సీ పెట్టటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అదే ఫ్లెక్సీపై ‘రౌడీషీటర్ గారు శ్రీ కొలగాని నాయుడు గారు... ఇట్లు అమలాపురం టౌన్ పోలీసు’ అని రాసి ఉన్న చిన్న ఫ్లెక్సీలను అతికించారు. ఒకపక్క క్రికెట్ బ్యాట్, మరోపక్క నెత్తురుతో ఉన్న కత్తి బొమ్మలను ఆ ఫ్లెక్సీపై ముద్రించారు. పోలీసుల చర్య పట్టణవాసుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఇటీవల రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, కేసులు నమోదు చేస్తున్నారు. ఆ చర్యల్లో భాగంగానే ఈ రివర్స్ ఫ్లెక్సీని పోలీసులు ఏర్పాటు చేశారు. -
నీతూప్రసాద్ రూటెటు?
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు ప్రధాని బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఇక్కడ కొనసాగుతారా లేదా అనే విషయమై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం నుంచి గురు, శుక్రవారాల్లో వచ్చే సీల్డ్కవర్పైనే దీనిపై స్పష్టత వస్తుందని కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం సీల్డ్‌కవర్ వచ్చినా క్రిస్మస్ సెలవు కావడంతో శుక్రవారమే విషయం వెల్లడి కానుంది. విభజన అనంతర పరిణామాల్లో కలెక్టర్ నీతూప్రసాద్ తెలంగాణ ప్రాంతానికి ఆప్షన్ ఇచ్చారు. ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఏపీఎస్పీ కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న ఆమె భర్త రాజేష్‌కుమార్ గుంటూరు అర్బన్ ఎస్పీగా బదిలీ అయ్యారు. అఖిలభారత సర్వీసు అధికారుల విషయం కేంద్రప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో ఆరు నెలలుగా కలెక్టర్ బదిలీ విషయం తేలలేదు. ఇపుడు అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో నీతూప్రసాద్ జిల్లాలో కొనసాగేది లేనిదీ మరో 24 గంటల్లోపు తేలిపోనుంది. తెలంగాణాకు మొదట్లో ఆప్షన్ ఇచ్చినప్పటికీ, భర్త గుంటూరులో పనిచేస్తుండటం, ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు దగ్గరపడడం వంటి పరిణామాల నేపథ్యంలో నీతూప్రసాద్ తెలంగాణకు వెళ్లే విషయమై పునరాలోచనలో పడ్డారని చెప్పుకుంటున్నారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి యనమల ఆమెను ఇక్కడే కొనసాగాలని ఇప్పటికే కోరారు. అయితే ఇప్పుడు కేంద్రం విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆమె అటా, ఇటా అనే దానిపై ఒక నిర్ణయం వెలువడే సమయం ఆసన్నమైంది. 2012 ఫిబ్రవరి 25న జిల్లా కలెక్టర్‌గా నీతూప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత కొద్దిరోజులకే ఆమె భర్త రాజేష్‌కుమార్ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా వచ్చారు. విజయవాడ- గుంటూరు మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేయనున్న తరుణంలో కీలకమైన గుంటూరు అర్బన్ ఎస్పీ పోస్టుకి ఆయన బదిలీ అయ్యారు. దీంతో ఆయన ఆంధ్రాలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలియవచ్చింది. మరోవైపు పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో కొత్త అధికారులను తీసుకువస్తే వారు అలవాటు పడేందుకు చాలా సమయం పడుతుందని..ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుందని ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు ఉన్నారంటున్నారు. అందుకే నీతూప్రసాద్నే పుష్కరాల వరకూ కలెక్టర్‌గా కొనసాగిస్తారని ప్రచారం జరిగింది. కానీ తెలంగాణకు వెళ్లేందుకు ఎంచుకున్న ఆప్షన్‌ను కేంద్రం యథాతథంగా ఆమోదిస్తే పరిస్థితి ఏమిటనే విషయమై ఆసక్తి నెలకొంది. ఆమెకు వెంటనే కలెక్టర్‌గా అక్కడ అవకాశం దక్కుతుందా లేదా? అక్కడకు వెళితే పదోన్నతులు త్వరగా వస్తాయా...ఇత్యాది విషయాలపై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. కనీసం పుష్కరాల వరకు ఆమె కొనసాగుతారా? ఈలోపే జిల్లా నుంచి బదిలీ అవుతారా అనే ఆసక్తి నేపథ్యంలో అసలు సీల్డ్కవర్లో ఏముందనే అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.