breaking news
Disabled reservation
-
IAS స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్
-
AP: దివ్యాంగులకు రిజర్వేషన్ పెంపు
సాక్షి, అమరావతి: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మూడుశాతం ఉన్న రిజర్వేషన్‌ను నాలుగు శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నిర్ధారిత వైకల్యాలున్న వారికి నాలుగు శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఏశాఖలోనైనా రిజర్వేషన్ల నుంచి మినహాయింపు అవసరమైతే అందుకు తగిన కారణాల సమర్థనతోపాటు ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఈ రిజర్వేషన్ పెంపునకు అనుగుణంగా ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996లో సవరణలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వికలాంగుల హక్కుల చట్టం–2016లోని సెక్షన్–34 ప్రకారం ప్రభుత్వ నియామకాలు, పదోన్నతుల్లో నిర్ధారిత వైకల్యాల వ్యక్తులకు నాలుగుశాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2020 ఫిబ్రవరి 19వ తేదీన మహిళా శిశు సంక్షేమ, వికలాంగుల సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించింది. -
వికలాంగుల హక్కుల బిల్లు ప్రవేశపెట్టాలి
అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వికలాంగుల హక్కుల బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. వికలాంగుల రిజర్వేషన్లను 3 నుంచి 10 శాతానికి పెంచాలని, అర్హులైన వికలాంగులకు స్వయం ఉపాధి, 10% రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలని, ప్రతి వికలాంగుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు. బుధవారం వేదిక ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేదల్లో ఎక్కువ మంది వికలాంగులు ఉన్నందున వారికి 3 ఎకరాల భూమి, వారు ఉండేందుకు అనుకూలంగా ఇల్లును నిర్మించి ఇవ్వాలన్నారు.