breaking news
Disabled corporations
-
‘టీఆర్ఎస్కు ఓటేయకుంటే పింఛన్లు కట్ చేస్తామంటున్నారు’
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు ఓట్లేయకపోతే వికలాంగుల పింఛన్లు తొలగిస్తామని ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్యవర్మ తెలిపారు. ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో జరిగిన వికలాంగుల సమావేశంలో టీఆర్ఎస్కు ఓట్లేయకుంటే పింఛన్లు కట్ చేస్తామని వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి చెప్పారన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు వికలాంగులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ), డీజీపీలకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు సోమవారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. వెంటనే ఆయనపై తగిన చర్యలు తీసుకుని వికలాంగ ఓటర్లకు మనోధైర్యం కల్పించాలని ముత్తినేని కోరారు. చదవండి: హుజురాబాద్ ఉప పోరు: పెరిగిన పోలింగ్ సమయం.. ఎప్పటివరకంటే! ‘వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌ను వెంటనే తొలగించాలి’ సాక్షి, హైదరాబాద్: ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే పింఛన్లు కట్ చేస్తామన్న వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లందకుంట మండలం వంతడుపుల గ్రామంలో వికలాంగులతో సమావేశమై టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని హెచ్చరిస్తూ.. ఓటు వేయని వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని బెదిరించడం గర్హనీయమన్నారు. వాసుదేవరెడ్డి తక్షణమే వికలాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వికలాంగులపై బెదిరింపులకు పాల్పడిన వాసుదేవరెడ్డిపై వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. చదవండి: Huzurabad Bypoll: 100 కోట్లు దాటిన బెట్టింగ్..? -
రుణ వేదన!
గ్రేటర్లో 6,357 ఉపాధి యూనిట్లు... 16 వేల మంది దరఖాస్తులు మంజూరైన నిధులు రూ.45 కోట్లు ఎంపికలో అధికారులపై ఒత్తిడి సిటీబ్యూరో: జిల్లాలో ఎస్సీ, బీసీ, గిరిజన, మైనారిటీ, వికలాంగుల కార్పొరేషన్ల ద్వారా అర్హులైన పేదలకు వివిధ ఉఫాధి పథకాల కింద సబ్సిడీ రుణాల పంపిణీపై యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తుల పరిశీలన జనవరిలోనే పూర్తి చేసిన ఆయా కార్పొరేషన్లు సబ్సిడీ మొత్తాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు విడుదల చేయటానికి చర్యలు చేపడుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగియటంతో సబ్సిడీ రుణం పంపిణీ యూనిట్లపై అధికారులు దృష్టి పెట్టారు. బ్యాంకు కాన్సెంట్ అందజేసిన లబ్ధిదారులకు మార్చి నెలాఖరు నాటికి సబ్సిడీ రుణానికి సంబంధించిన ఉఫాది యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. పెరిగిన ఒత్తిడి... గ్రేటర్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా 6,357 యూనిట్లకు ప్రభుత్వం రూ.45 కోట్లు మంజూరు చేసింది. సబ్సిడీ శాతాన్ని భారీగా పెంచటంతో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 16 వేలు దాటింది. దీంతో అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈమేరకు అధికారులు కూడా యూనిట్ల సంఖ్యను పెంచి, అదనపు నిధులు విడుదల చేయాలని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. వివిధ కార్పొరేషన్ల అధికారులు, దీనికి సంబధించిన ప్రతిపాదనలు చేశారు. అయినా ..ఇప్పటి వరకు సర్కారు నుంచి స్పందన రాకపోగా, ఇచ్చిన నిధులనే సర్దుబాటు చేయాలని పేర్కొంది. కార్పొరేషన్లకు అందిన దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా యూనిట్ల సంఖ్యను పెంచి ...సరిపడు నిధులను ప్రభుత్వం ఇవ్వని పక్షంలో లబ్ధిదారులను సంతృప్తి పరచటం కష్టమేనని అధికారులు అంటున్నారు. బీసీ కార్పొరేషన్లకు మాత్రం తగినంత బడ్జెట్ విడుదల కాకపోవటంతో ఆ శాఖ అధికారులు దరఖాస్తుదారుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మంజూరైన యూనిట్ల సంఖ్యకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికపై హైదరాబాద్ జిల్లా అధికారయంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌కు 2015-16 సంవత్సరానికిగానూ 1581 యూనిట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా, 788 దరఖాస్తులకు బ్యాంకులు కాన్సెంట్ ఇవ్వగా, 510 యూనిట్లకు మంజూరీ ఇచ్చారు. 500 వృత్తి నైపుణ్యం కలిగిన లబ్ధిదారుల ఎంపిక లక్ష్యం కాగా, 370 యూనిట్లు మంజూరీ చేశారు. గిరిజన సంక్షేమ కార్పొరేషన్‌కు 73 యూనిట్లు లక్ష్యంగా నిర్దేశించగా, 84 దరఖాస్తు రాగా ఎంపికపై దృష్టి పెట్టారు. బీసీ సంక్షేమ కార్పొరేషన్‌కు 740 యూనిట్లు లక్ష్యం కాగా, 400 యూనిట్లు మంజూరు చేశారు. వికలాంగుల శాఖకు 24 యూనిట్లు లక్ష్యం కాగా, 35 మందిని అర్హులుగా గుర్తించి, 10 యూనిట్లు మంజూరీ ఇచ్చిన అధికారయంత్రాంగం సబ్సిడీ రుణానికి సంబంధించిన ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్‌పై చర్యలు తీసుకుంటున్నది.