breaking news
dirty canal
-
మురికికాల్వలో బాలుడి మృతదేహం
పందులు ఈడ్చుకెళ్తుండగా గమనించిన స్థానికులు సిరిసిల్ల క్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో గల మురికికాల్వలో గుర్తుతెలియని వ్యక్తులు బాలుడి మృత దేహాన్ని కవర్లో పెట్టి పారేశారు. సోమవారం బాలుడి మృత దేహాన్ని పందులు నోటకరచి ఈడ్చుకు వెళ్తుండటం గమనించిన స్థానికులు వార్డు కౌన్సిలర్ జి.పూర్ణచందర్‌కు ఫోన్లో తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సిరిసిల్ల టౌన్ సీఐ విజయ్‌కుమార్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మార్చురీలో ఉంచారు. బాలుడికి సుమారు ఏడాదిన్నర వయస్సు ఉంటుంది. ఒంటిపై బనియన్ ఉంది. బాలుడి శవాన్ని కాల్వలో పడేసిందెవరు? అనే విషయాలపై దర్యాప్తు జరుపుతున్నామని సీఐ తెలిపారు. -
మురికి కాల్వలో చిన్నారి మృతదేహం
కఠిన మనస్కులు ఏడాది వయసున్న ఓ పాప మృతదేహాన్ని మురికి కాల్వలో పడేసి వెళ్లిపోయారు. విశాఖ నగరంలోని కంచరపాలెం ప్రాంతంలో రోడ్డు పక్కనే ఉన్న మురికి కాల్వలో ఓ చిన్నారి మృతదేహం శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.