breaking news
director venkateswarlu
-
నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు..
పీజీఆర్ఆర్సీడీఈ డెరైక్టర్ ప్రొ.వెంకటేశ్వర్లు తాండూరు (రంగారెడ్డి జిల్లా): దేశంలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల కన్నా సేవారంగం ఒక్కటే దూసుకుపోతున్నదని ఉస్మానియా యూనివర్సిటీ పీజీఆర్సీ దూరవిద్య డెరైక్టర్ ప్రొ.హెచ్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోనీ పీపుల్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన దూరవిద్యపై అవగాహనకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వృద్ధి రేటు పెరుగుదల 30శాతం ఉంటే.. సేవా రంగం పెరుగుల రేటు 60శాతం ఉందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేవారంగంలోనే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఇన్సూరెన్స్, అకౌటింగ్, టెలీకమ్యూనికేషన్స్, టూరిజం తదితర రంగాల్లో అవకాశాలు బోలెడు ఉన్నాయని చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కామర్స్ విద్యార్థులే ఉద్యోగాలు పొందటంతో ఎక్కువగా రాణిస్తున్నట్టు చెప్పారు. విద్యార్హత ఒక్కటే సరిపోదని, నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు దక్కతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్ధేశించుకొని అర్హతలతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కామర్స్, కంప్యూటర్స్, కమ్యూనికేషన్స్(త్రీసీ)పై పట్టు సాధిస్తే ఉన్నత ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చన్నారు. పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులతోపాటు వృత్తి విద్యా కోర్సులను చదవాలని సూచించారు. ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న కోర్సులు, బోధన అవకాశాలు, శిక్షణ కేంద్రాలు, పుస్తకాలు తదితర అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకుంటూ ముందుకుసాగితే ఉన్నతస్థాయికి వెళతారన్నారు. -
ఓయూలో 6న దూరవిద్య ఎంబీఏ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఓయూ దూరవిద్యలో 2015-16 విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు సెప్టెంబర్ 6న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు డెరైక్టర్ ప్రొ.హెచ్.వెంకటేశ్వర్లు తెలిపారు. అభ్యర్థులు వచ్చే నెల 4 నుంచి హాల్‌టికెట్లను ఓయూ వెబ్సైట్ లేదా దూరవిద్య వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ఉదయం 10 నుంచి 11.30 వరకు నిర్వహించనున్నారు. వాస్తవంగా ఈ నెల 30న జరగాల్సిన ఈ పరీక్షను అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వచ్చే నెల 6కు వాయిదా వేసినట్లు డెరైక్టర్ తెలిపారు. యూ పీజీ ఫలితాలు విడుదల సాక్షి, హైదరాబాద్: ఓయూ పరిధిలో జరిగిన పలు ఎంఏ రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలో మార్కుల జాబితాలను ఆయా కాలేజీలకు జారీ చేయనున్నట్లు చెప్పారు. నేడు (31న) ఎమ్మెస్సీ కోర్సుల ఫలితాలతో పాటు ఇది వరకు ప్రకటించని ఇతర పీజీ కోర్సుల ఫలితాలను వెల్లడించనున్నట్లు పీజీ కోర్సుల అడిషనల్ కంట్రోలర్ ప్రొ.సుధాకర్‌రెడ్డి తెలిపారు.