breaking news
dhanunjai
-
అప్పుడు నారాయణ అనేస్తా!
‘‘ప్రతి సినిమాను ఒకే రకమైన ష్యాషన్‌తో తీస్తాను. ఆడితే ఒళ్లు దగ్గరపెట్టుకుని తీశాడంటారు. ఆడకపోతే రివర్స్‌లో మాట్లాడతారు. ఫిల్మ్ మేకింగ్‌లో తెలిసి తప్పులు చేయను. ఏ దర్శకులూ కావాలని తప్పులు చేయరు’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ధనుంజయ్, ఐరా మోర్ జంటగా రూపొందిన చిత్రం ‘భైరవగీత’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో రామ్‌గోపాల్‌వర్మ సమర్పణలో అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజవుతోంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ చెప్పిన విశేషాలు... ► ‘భైరవగీత’ చిత్రాన్ని భుజాన వేసుకోలేదు. అ«ధఃపాతాళంలోకి కూరుకుపోయిన నన్ను ఓ చేయి ఇచ్చి పైకి లాగుతుందనుకుంటున్నాను. ఒక సినిమా కథ వల్ల ఆడొచ్చు లేదా స్టార్డమ్ వల్ల ఆడొచ్చు. కానీ ఒక డైరెక్టర్ సీన్‌ను చెప్పే విధానంలో ఉండే మార్పే నా దృష్టిలో సినిమాటిక్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ అరుదుగా మారుతుంటుంది. దీన్ని చాలా సంవత్సరాల తర్వాత నేను సిద్ధార్థ్ దర్శకత్వంలో చూశాను. ►నా దగ్గర నుంచి 30–40మంది డైరెక్టర్లు వచ్చి ఉంటారు. నా వర్కింగ్ స్టైల్ ఇన్ప్లూయెన్స్తో సిద్ధార్థ్ నా దగ్గరకు వచ్చాడు. అందుకే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్‌లో నా మార్క్ కనిపించి ఉండొచ్చు. సినిమాలో సిద్ధార్థ్ స్టైల్ తెలుస్తుంది. లోయర్ స్టేటస్ ఉన్న వ్యక్తి, హయ్యర్ స్టేటస్ ఉన్న అమ్మాయిని ప్రేమిస్తాడు. దానివల్ల ఎలాంటి రెబలిజమ్ మొదలైంది? అనేది ఈ చిత్రకథ. ►వంశీ అనే అతను ఈ సినిమా స్క్రిప్ట్ రాశాడు. ఆ తర్వాత మేం మార్పులు చేశాం. ఈ స్క్రిప్ట్‌ను íసిద్ధార్థ్ డైరెక్ట్ చేస్తే బాగుండు అనిపించింది. సిద్ధార్థ్‌ను శిష్యుడుగా అనుకోవడం లేదు. ఎప్పుడెప్పుడు నా నుంచి బయటపడాలా అని చూస్తున్నాడు. సినిమా ఆడితే.... రామ్‌గోపాల్ వర్మ ఎవరు? అని సిద్ధార్థ్ అడిగినా ఆశ్చర్యపోవడానికి లేదు. ‘2.ఓ’ సినిమాను పిల్లలు చూసే సినిమా అనడానికి కారణం ‘భైరవగీత’ పబ్లిసిటీ కోసమే. ►కావాలని తప్పులు చేయం. సినిమా బాగా ఆడకపోవడానికి ఒక్కరే కారణం అవ్వరు. నాలుగైదు కారణాలు ఉంటాయి. ‘ఆఫీసర్’ చిత్రం బ్యాడ్‌గా ఉందని తెలిస్తే రిలీజ్ కూడా చేయం కదా. నాగార్జున, నేను ఇద్దరూ నమ్మి ‘ఆఫీసర్’ సినిమా చేశాం. అందుకే రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించి హీట్ డిస్కషన్ లేదు. ►నేను దేవుణ్ణి నమ్మనని ఎప్పుడూ చెప్పలేదు. భక్తులను నమ్మననే చెప్పాను. నేను దేవుణ్ణి నమ్మితే చాలా పాపాలు చేయలేను. నాకు తోచినవన్నీ చేసేసి చనిపోయే 5 నిమిషాల ముందు నారాయణ అనేస్తా. నేను డైరెక్టర్‌నే కాదు యాక్టర్‌ని కూడా. ►ఎన్టీఆర్‌గారి జీవితంలో లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాతి సంఘటనలే కీలకంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీస్తున్నాను. ఇందులో కొత్తగా తెలియనిది చెప్పడం లేదు. బాలకృష్ణగారి ‘యన్.టీ.ఆర్’ బయోపిక్ సబ్జెక్ట్‌కు, నా సబ్జెక్ట్‌కు కనెక్షన్ లేదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో చంద్రబాబునాయుడుగారి పాత్ర ఎలా ఉంటుంది? అనేది సినిమాలో తెలుస్తుంది. ఈ సినిమా పరంగా నా ఇంట్రెస్ట్‌నే శాటిస్ఫై చేస్తాను. స్క్రిప్ట్ చూపించనని లక్ష్మీపార్వతిగారికి చెప్పాను. నమ్మకం ఉంటేనే అనుమతి ఇవ్వమని కోరాను. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తున్నారు. జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాం. ‘యన్.టీ.ఆర్’ బయోపిక్, వైఎస్సార్ ‘యాత్ర’ సినిమాల టైమ్‌లోనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజవుతుందంటే అది కాకతాళీయమే. ►రామ్ ఇలాంటోడు అలాంటోడు అన్నారు. నేను తప్ప అందరూ ‘మీటూ’లో ఉన్నారు బాలీవుడ్లో. వచ్చిన వార్ల పేర్లు విని షాక్ అయ్యాను. ►ఓటు ప్రాముఖ్యత గురించి నా చిన్నప్పుడు నేనూ విన్నాను. ఇప్పటివరకు నా లైఫ్‌లో ఓటు వేయలేదు. పాలిటిక్స్‌ను అర్థం చేసుకునే టైమ్ నాకు లేదు. నాకు ఎవ్వరు ఉన్నా ఓకే. చట్టానికి లోబడి ఉంటాను కాబట్టి ప్రభుత్వాలు చట్టాన్ని మార్చితే ఆ మార్పులను ఫాలో అవుతాను. నాకు ఆసక్తి ఉన్న పాలిటిక్స్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తాను. నాకు అమెరికన్ పాలిటిక్స్ అంటే ఇష్టం. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ గెలుస్తాడని ఇండియాలో ముందు చెప్పింది నేనే. -
ధనుంజాయ్ తో చిట్‌చాట్..
‘భాజే.. భాజే.. డోలు భాజే...’ ఇటీవలే వచ్చిన గోపాల గోపాల చిత్రంలోని పాపులర్ పాట. విన్న ప్రతి ఒక్కరికి చిత్రంలో పవన్‌కళ్యాణ్‌లా చిందేయాలనిపించేంత ఊపున్న పాట. ఇంత రిథమిక్ పాటను పాడింది ధనుంజయ్ సీపాన. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. సంగీతం మీద మక్కువతో ఎంతో కష్టపడి ప్లేబ్యాక్ సింగర్‌గా ఎదిగాడు. ఇప్పుడు స్టార్ హీరోల చిత్రాల పాటలు పాడుతూ అందరి మన్ననలు పొందుతున్న ధనుంజయ్ పరిచయం అతని మాటల్లోనే.. ..సత్య గడేకారి, శ్రీనగర్‌కాలనీ నేను పుట్టింది..పెరిగింది విజయనగరంలోనే. విద్యాభ్యాసం కూడా అక్కడే. వైజాగ్‌లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేశాను. చిన్నతనం నుండే సంగీతమన్నా... పాటలన్నా అమితమైన ఇష్టం. అందుకే లక్ష్మీరామ్దాస్గారి దగ్గర త్యాగరాజ సంగీతం నేర్చుకున్నాను. సంగీతంతో అనుబంధం ఆనాటిదే. మా నాన్న భాస్కర్‌రావు, అమ్మ చిన్నమ్మడు నాకు అన్నింట్లో సపోర్ట్‌గా నిలిచారు. లౌక్యంతో బ్రేక్ చదివింది ఎమ్మెస్సీ కెమిస్ట్రీ అయినా మనసంతా సంగీతం మీదనే ఉండేది. ఆ ఇష్టంతోనే 2010లో హైదరాబాద్‌కు వచ్చేశా. ఇక్కడే ఎంఏ మ్యూజిక్ ఇన్ కర్నాటిక్ ఓకల్ పూర్తి చేశాను. ఆధ్యాత్మిక ఆల్బమ్స్‌తోపాటు పలు సినిమా పాటలకు కోరస్ పాడాను. నెమ్మదిగా ప్లేబ్యాక్ సింగింగ్ అవకాశాలొచ్చాయి. అయితే నాకు బ్రేక్ వచ్చింది లౌక్యం చిత్రంలోని ‘సూడు.. సూడు’ పాటతోనే. ఆ తరువాత ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘చిన్నదాన నీకోసం’, ‘భీమవరం బుల్లోడు’, ‘అడా’్డ, ‘రఘువరన్ బి.టెక్’ సినిమాల్లో పాడాను. ఈ ప్రయాణంలో సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ నాకెంతో సహకారం అందించారు. గోపాల గోపాలలో అవకాశం నా మీద నమ్మకంతో అనూప్‌గారు నన్ను మెదట ‘భాజే.. భాజే’ ట్రాక్ పాడటానికి పిలిచారు. అనంతరం అదే పాటను పలు సింగర్స్‌తో పాడించినా సెట్ అవకపోవడంతో చివరకు నాతోనే పాడించారు. పాట విన్న చిత్ర యూనిట్ బాగా పాడావని అభినందించడం చాలా సంతోషాన్నిచ్చింది. చిత్రంలో ఈ పాటే హైలెట్ కావడంతో నా ఆనందానికి అవధులు లేవు. టెంపర్ సినిమాలోనూ పాడాను. తెలుగువాళ్లు గర్వపడేలా పాటలను పాడాలనేదే నా ఆకాంక్ష..