breaking news
Dhan dhana dhan offer
-
విద్యార్థులకు వొడాఫోన్ బంపర్ ఆఫర్
టెలికాం కంపెనీలను ముప్పుతిప్పలు పెడుతున్న రిలయన్స్ జియోకి కౌంటర్ ఇచ్చేందుకు వొడాఫోన్ సిద్ధమైంది. విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని ఒ కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద అపరిమిత కాల్స్, ప్రతి రోజూ 1జీబీ 4జీ లేదా 3జీ డేటాను 84 రోజుల పాటు వాడుకునే సదుపాయాన్ని అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ జియో కూడా ధన్ ధనా ధన్ ఆఫర్ కింద ఇలాంటి ప్రయోజనాలనే ఆఫర్ చేస్తోంది. రూ.399 రీఛార్జ్‌తో ఉచిత రోమింగ్, అపరిమిత ఎస్ఎంఎస్ను ఇది కల్పిస్తోంది. ప్రస్తుతం వొడాఫోన్ విద్యార్థులకు ప్రకటించిన 'వొడాఫోన్ క్యాంపస్ సర్వైవల్ కిట్' స్కీమ్ కింద రూ.445 రీఛార్జ్‌పై అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1జీబీ 3జీ లేదా 4జీ డేటాను 84 రోజుల పాటు అందించనుంది. అంతేకాక డిస్కౌంట్ కూపన్లను, మెసెంజర్ బ్యాగ్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. అయితే ఇది కేవలం కొత్త కనెక్షన్ తీసుకున్న ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంత విద్యార్థులకు మాత్రమే. రూ.445 అనంతరం రూ.352తో తదుపరి రీఛార్జ్‌లకు కూడా ఇదే రకమైన ప్రయోజనాలను అందించనున్నామని వొడాఫోన్ తెలిపింది. రూ.445 సర్వైవల్ కిట్లోనే ఓలా, జోమాటో నుంచి డిస్కౌంట్ బుక్లెట్లు ఉంటాయి. ఈ విషయాన్ని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని విద్యార్థులందరికీ వొడాఫోన్ ఇండియా ఢిల్లీ సర్కిల్ బిజినెస్ హెడ్ అలోక్ వెర్మ ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. ఈ స్కీమ్‌ను దేశమంతటా దశల వారీగా అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్పారు. అయితే సర్కిల్ సర్కిల్‌కు రీఛార్జ్ విలువ భిన్నంగా ఉంటుందని కన్స్జూమర్ మార్కెటింగ్ వొడాఫోన్ ఇండియా నేషనల్ హెడ్ అరవింద్ నివేటియా పేర్కొన్నారు. ప్రస్తుతం వొడాఫోన్ ఢిల్లీ-ఎన్సీఆర్లో రూ.349 రీఛార్జ్‌పై 84 రోజుల పాటు వారానికి 1200 నిమిషాలు, రోజుకు 300 నిమిషాలు చొప్పున కాలింగ్ సదుపాయాలను, రోజుకు 1జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. రూ.349 ఆఫర్ ముగుస్తుందని, కస్టమర్లు సర్వైవల్ కిట్ ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చని అరవింద్ తెలిపారు. ఇది కూడా 84 రోజుల పాటు అందుబాటులో ఉంటుందని చెప్పారు. -
జియో నుంచి ధన్ ధనాధన్ ఆఫర్ ఇదే!
ట్రాయ్ ఆదేశాల మేరకు సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను ఉపసంహరించుకోవడంతో రిలయన్స్ జియో ఇప్పుడు మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. రూ. 309తో రీచార్జి చేసుకుంటే రోజుకు 1 జీబీ డేటా లిమిట్‌తో 84 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. 84 రోజులు అంటే నెలకు 28 రోజుల చొప్పున 3 నెలలు అన్నమాట. ఇందులో దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది. అదే రోజుకు 2 జీబీ డేటా కావాలనుకుంటే అదే 84 రోజులకు రూ. 509తో రీచార్జి చేసుకోవాలి. ఈ రెండు ప్లాన్లు జియో ప్రైమ్ మెంబర్లకు మాత్రమే పరిమితం. నాన్ ప్రైమ్ యూజర్లయితే రోజుకు 1 జీబీ డేటా చొప్పున 84 రోజులకు రూ. 408 పడుతుంది. 2 జీబీ కావాలంటే వాళ్లు రూ. 608 చెల్లించాలి. ఇంతకుముందున్న సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ స్థానంలో ఈ ధన్ ధనాధన్ ఆఫర్ వచ్చినట్లు జియో ప్రకటించింది. సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ తమ రెగ్యులేటరీ పరిధిలోకి రాదని, అందువల్ల దాన్ని వెంటనే ఆపాలని ట్రాయ్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15వ తేదీలోగా రూ. 303తో రీచార్జి చేసుకుంటే మూడు నెలలకు పైగా ప్రయోజనాలు ఉండేలా సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్‌ను రూపొందించారు. జియో ప్రైమ్ మెంబర్షిప్ కావాలంటే ఒక్కసారి రూ. 99 ఫీజు కట్టాల్సి ఉంటుందని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేష్ అంబానీ ఫిబ్రవరిలో ప్రకటించారు. ఏడాది పాటు పలు రకాల డేటా ప్యాక్‌లను ఎంచుకునే అవకాశం ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న సభ్యులకు ఉంటుంది.