ధర్మ దేవతల ఆవాసం ‘ధర్మస్థల’ : ఒక్కసారైనా మంజునాథుని దర్శనం
ఏ శివాలయంలోనైనా వైష్ణవ పూజారులను చూడగలమా? ఏ విష్ణ్వాలయంలోనైనా జైన మతాధికారులు కనిపిస్తారా... అయితే కర్ణాటక రాష్ట్రంలోని ఓ పురాతన శైవక్షేత్రానికి మాత్రం ఈ ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రానికి ఆ ప్రత్యేకత ఎలా వచ్చిందో తెలుసుకుందాం.కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ధర్మస్థల ఒకటి. అందుకే భక్తులందరూ కర్ణాటకలోని ధర్మస్థలను ఒక్కసారైనా సందర్శించి, ధర్మదేవతలను దర్శించుకుని, మంజునాథుని మనసారా చూసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఏదైనా పనిమీద బెంగళూరు వచ్చిన వారు ధర్మస్థలను సందర్శించడాన్ని విధిగా పెట్టుకుంటారు. స్థలపురాణం... పూర్వం కుడుమ అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో జైన సైనికాధికారి బిర్మన్న, ఆయన భార్య అంబుబల్లాతి నివసించే వారు. నిరాడంబరులుగా, నిజాయితీపరులుగా, అతిథి సేవ, సాటివారికి సాయం చేసే ఆదర్శ్ర΄ాయులైన దంపతులుగా వారిని అందరూ గౌరవించేవారు. ధర్మపరాయణులుగా, ఆపదలలో ఉన్న వారిని ఆదుకునే వారిగా వారికి ఎంతో మంచి పేరుండేది. వారి కీర్తి దేవతల వరకు వెళ్లడంతో నిజంగా వారెంతటి ధర్మనిష్ఠాపరులో తెలుసుకుని, వారు గనక సరైన వారేనని తేలితే, వారి ద్వారా ధర్మపరిరక్షణ, ధర్మప్రచారం చేయిద్దామని ఇద్దరు ధర్మదేవతలు ఒక రాత్రిపూట వాళ్ల ఇంటికి నిరుపేద వృద్ధదంపతుల రపంలో వచ్చారు. హెగ్గడే దంపతులు వారిని సాదరంగా ఆహ్వానిం, అతిథి సత్కారాలు చేశారు. ధర్మదేవతలు వారితో తమకు ఆ ఇల్లు ఎంతో నచ్చిందని, ఇల్లు ఖాళీ చేసి తమకు ఇవ్వమని అడిగారు. వారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముక్కూముఖం తెలియని వారి కోసం ఆ ఇంటిని ఖాళీ చేసి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. వారి ఔదార్యానికి సంతోషింన ధర్మదేవతలు నిజ రూపంలో వారికి సాక్షాత్కరించారు.హెగ్గడే దంపతులు ఎంతో సంతోషంతో వారికి ఆ ఇంటిని అప్పగించి, వారికి పూజలు చేశారు. ఆ ఇంటిని అందర నెలియాడిబీడు అని పిలవసాగారు. కాలక్రమేణా ఆ ఇల్లు కాస్తా ఆలయంగా రపు దిద్దుకుంది. ఆ ధర్మదేవతలకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వారందర అక్కడే ఉండి, ధర్మపరిరక్షణ చేయసాగారు. కొంతకాలానికి వారందరూ విగ్రహాల రపంలో ఆ ఇంటిలోనే కొలువు తీరారు. అక్కడి ఆలయ పూజారికి ఒకరోజున పూనకం వచ్చి, ఆ దేవతల సన్నిధిలో శివలింగాన్ని ప్రతిష్టిం, పూజించవలసిందిగా గ్రామప్రజలను ఆదేశించాడు. దాంతో హెగ్గడే దంపతుల వంశీకుడైన అణ్ణప్ప హెగ్గడే అనే అతను మంగుళూరు పక్కనున్న కద్రి నుంచి శివలింగాన్ని తీసుకు వచ్చి ధర్మదేవతల సన్నిధి పక్కనే లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ లింగమే మంజునాథుడుగా పూజలందుకుంటున్నాడు. అనంతరం ఓ వైష్ణవుడు తన ఆస్తి΄ాస్తులన్నింటినీ అమ్ముకుని ఆలయానికి అంగరంగవైభవంగా కుంభాభిషేకం జరిపించాడు. అప్పటినుంచి ఈ పుణ్యస్థలాన్ని అందరూ ధర్మస్థల అని పిలవసాగారు.ఆలయ వర్ణన...చెక్కస్తంభాలతో నిర్మితమైన ఈ ఆలయం అందమైన కళాకృతులతో శోభిల్లుతుంటుంది. ఆలయాన్ని చేరుకోగానే విశాలమైన ముఖద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంటుంది. ఆలయ ప్రాంగణంలో ఒక సన్నిధిలో మంజునాథుడు, మరో సన్నిధిలో నరసింహస్వామి దర్శనమిస్తారు. మరో సన్నిధిలో ΄ార్వతీ దేవి, ధర్మదేవతలు కొలువై ఉంటారు. ధర్మస్థల ప్రాంత్రానికి వెళ్లిన భక్తులు ముందుగా ఇక్కడకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని నేత్రావతి నదిలో స్నానమాచరించి, మంజునాథుని, అమ్మవారిని, నలుగురు ధర్మదేవతలను, గణపతిని, అణ్ణప్పదేవుని సందర్శించుకుని, ఆలయంలో ఇచ్చే తీర్థప్రసాదాలను స్వీకరించడం ఆనవాయితీ. అనంతరం ఆలయానికి బయట గల పురాతన రథాలను, వాహన ప్రదర్శనశాలను పుష్పవాటికను, వసంత మహల్‌ను సందర్శించుకుంటారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయంలో జరిగే నిత్యాన్నదానంలో అన్ని కులాలు, మతాలవారూ తృప్తిగా భోజనం చేయవచ్చు. అవసరం అయితే ఆశ్రయం ΄÷ందవచ్చు.గోమఠేశ్వరుడు కొలువుదీరిన శ్రావణ బెళగొళ ఇక్కడికి సమీపంలోనే ఉంటుంది. ఎలా చేరాలంటే..?బెంగళూరు నుంచి ధర్మస్థలకు చేరుకోవడం సులువు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి ధర్మస్థలకు నేరుగా బస్సులున్నాయి. మంగుళూరు వరకు రైలులో వెళితే అక్కడినుంచి బస్సులో లేదా ప్రైవేటు వాహనాలలో ధర్మస్థలకు వెళ్లవచ్చు. మంగుళూరు ఎయిర్‌పోర్ట్‌నుంచి కూడా నేరుగా ధర్మస్థలకు బస్సులున్నాయి. ఇదీ చదవండి: అపుడు కాలుష్య కాసారం : ఇపుడు ఏడాదికి 600 టన్నుల పళ్లుఅన్ని విశ్వాసాలకూ, మతాలకూ చెందిన భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడి దేవతలను దర్శించుకుంటారు. మొక్కులు తీర్చుకుంటారు.ఈ ఆలయంలో నిత్యం పదివేలమందికి అన్నదానం, ఆధునిక వైద్యవిజ్ఞాన శాస్త్రానికి సైతం అంతుపట్టని పలు వ్యాధులకు ఔషధ దానాలతోబాటు వేలూ, లక్షలూ వెచ్చించి చదువుకొనలేని పేద విద్యార్థులకు సలక్షణమైన, నాణ్యమైన విద్యాదానమూ జరుగుతుంది. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అభాగ్యులు తలదాచుకునేందుకు వీలుగా ఇక్కడ ఆశ్రయమూ లభిస్తుంది. అదే బెంగళూరు నుంచి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో గల ధర్మస్థల.– డి.వి.ఆర్.