breaking news
devarakadra market
-
తగ్గని ఉల్లి ధరలు
-
తగ్గని ఉల్లి ధరలు
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్ లో ఉల్లి ధరలు మరింత పుంజుకున్నా యి. వ్యాపారం కూడా జోరందుకుంది. బుధవారం జరిగిన ఉల్లిపాయల బ హిరంగ వేలంలో వచ్చిన ధరలు గత వా రం కన్నా మరింత పెరిగాయి. గరిష్టంగా రూ.3,400 పలుకగా కనిష్టంగా రూ. 3,100 వరకు ధరలు వచ్చాయి. రెండేళ్ల క్రితం ఉల్లి ధరలు ఏకంగా రూ.వందకు పడిపోగా.. గతేడాది రూ.1100 వరకు చే రుకుంది. ఈసారి సీజన్ ప్రారంభం నుం చి ఉల్లి ధరలు పెరగడం తప్ప తగ్గడం లే దు. కొత్త ఉల్లి వచ్చిన తర్వాత వారం వా రం ధరలలో పెరుగుదల కనిపిస్తుంది. గత నెలలో జరిగిన వేలంలో ఒక దశలో రూ.4,400 వరకు ఉల్లి ధరలు చేరుకున్నాయి. ఇటీవల కొత్త ఉల్లి దిగుమతులు రావడంతో కొంత వరకు తగ్గినా మంచి ధరలే వస్తున్నాయి. పెరిగిన కొనుగోళ్లు.. దేవరకద్ర మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు బాగా పెరిగాయి. ఒక వ్యాపారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తూ చిరు వ్యాపారులకు బస్తాల లెక్కన అమ్ముకుంటున్నా రు. మార్కెట్కు వచ్చిన ఉల్లి నాణ్యంగా ఉండడంతో చాలామంది ఎగబడి కొనుగోలు చేశారు. వివిధ గ్రామాల నుంచి వ చ్చిన ప్రజలు శుభకార్యాలకు, ఇంటి అవసరాలకు ఉల్లిపాయలను బస్తాల లెక్కన కొనుగోలు చేశారు. ఇక చిరు వ్యాపారులు కూడా బస్తాల లెక్కన కొనడంతో మార్కెట్ అంతా సందడిగా కనిపించింది. 45 కిలోల ఉల్లి బస్తా రూ. 1,800 నుంచి రూ.1,600 వరకు విక్రయాలు సాగాయి. చిల్లరగా కిలో రూ.35 నుంచి రూ.40 వరకు విక్రయించారు. కందుల కొనుగోలు మార్కెట్లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో గురువారం వరకు 19,500 క్వింటాళ్లు కందులను కొనుగోలు చేశారు. గత నెల 20వ తేదీ నుంచి ఇక్కడ కొనుగోలు కేంద్రం ప్రార ంభించారు. హాకా దేవరకద్ర ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నారు. రైతుల కు మద్దతు ధర రూ.5,450లకు క్వింటాల్గా కందులను కొనుగోలు చేయడం వ ల్ల రైతులు పెద్ద ఎత్తున అమ్మకానికి తెస్తున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన కందులకు దాదాపు రూ.10.62 కోట్లు రై తులకు చెల్లించాల్సి ఉంది. కొందరికి నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఉల్లి ధరకు రెక్కలు!
దేవరకద్ర(మహబూబ్నగర్) : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్లో ఉల్లిపాయల ధరలు మరింత పెరిగాయి. గత వారం వచ్చిన ధరలే రికార్డు స్థాయిలో ఉండగా ఈ వారం ధరలు మరో రికార్డుగా మారాయి. ప్రభుత్వం ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కిలో రూ.20 కే విక్రయిస్తామంటున్నా ఇక్కడ ఏమాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. అనూహ్యంగా డిమాండ్ పెరగటంతో బుధవారం మార్కెట్కు 300 బస్తాల వరకు ఉల్లి పాయలు అమ్మకానికి వచ్చాయి. జోరుగా సాగిన వేలంలో నాణ్యమైన ఉల్లి క్వింటాల్ ధర రూ. 3500 పలికింది. గత వారం కన్నా ఇది రూ. 300 అధికం. చిన్న సైజు ఉల్లిపాయలకు సైతం అధిక ధరలు నమోదయ్యాయి. మార్కెట్లో టోకుగా ఖరీదు చేసిన చిల్లర వ్యాపారులు బయట కిలో రూ.40 వరకు విక్రయించారు.