breaking news
Demolition of houses for the poor
-
నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం.. కన్నీరు మిగిల్చిన హైడ్రా కూల్చివేతలు
-
పేదల ఇళ్లు కూల్చివేత
రేణిగుంట (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా రేణిగుంటలో దళిత వర్గానికి చెందిన సుమారు 65 రేకుల ఇళ్లను అక్రమ నిర్మాణాల సాకుతో గురువారం అధికారులు నేలమట్టం చేశారు. పేదలకు తీరని నష్టాన్ని కలిగించారు. దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్ట్ చేసి ఈ దౌర్జన్య కాండను నిర్దయగా కొనసాగించారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరింపజేసి, బాధితులెవరూ రాకుండా అడ్డుకున్నారు. తొలుత రేణిగుంట సీబీఐడీ కాలనీ సమీపంలో 25 రేకుల ఇళ్లను, ఆ తర్వాత వివేకానంద కాలనీ సమీపంలో 40 ఇళ్లను కూల్చి వేశారు. బాధితులు లబోదిబోమంటూ ఆర్తనాదాలు చేసినా అధికారులు పెడచెవిన పెట్టి ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఇళ్లు లేని నిరుపేదలు ఏడాది కిందట రేణిగుంటలో రెవెన్యూ అధికారుల అనుమతులతో రేకుల ఇళ్లను నిర్మించుకుని విద్యుత్ కనెక్షన్ తీసుకుని నివాసం ఉంటున్నారు. బుధవారం రేణిగుంట సీబీఐడీ కాలనీలోని కొన్ని ఇళ్లను ఎంపీడీవో విష్ణుచిరంజీవి వెళ్లి జేసీబీ సాయంతో తొలగించారు. స్థానికులు అడ్డు చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. అయితే గురువారం ఉదయం భారీగా పోలీసు బలగాలతో రేణిగుంట తహసీల్దార్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూల్చివేత సాగింది. కళ్లెదుటే ఇల్లు కూల్చి వేయడంతో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. దళితులంటే అంత చులకనా? అని బాధిత మహిళలు తహసీల్దార్ నాగేశ్వరరావును నిలదీశారు. ఈ ఇళ్లు అక్రమ నిర్మాణాలైతే అనుభవ ధ్రువీకరణ పత్రాలు, ఎన్వోసీ, ఇంటి పన్నులను రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షలు ఖర్చు చేశామని కన్నీటిపర్యంతమయ్యారు. ఇళ్లు నిర్మిస్తున్నప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడని అధికారులు.. ప్రభుత్వం మారగానే, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఆదేశాలతో దళితుల ఇళ్లను ఇలా కూల్చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. పేద దళితులపై ఎందుకింత పగ?ఇళ్లులేని పేద దళితులు కట్టుకున్న చిన్నపాటి రేకుల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చేయడం బాధాకరం. నేను అడ్డుకుంటానని భావించి మా ఇంటి వద్దకు పోలీసులను పంపి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. మీకిది తగునా? పెత్తందార్ల ఇళ్ల జోలికి వెళ్లగలరా? ఇలాంటి ఆకృత్యాలు చేసేందుకా ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది? దళితులపై మీకు ఎందుకింత పగ? – ఆనందరావు, ఎంపీటీసీ సభ్యుడు, తూకివాకం, రేణిగుంట మండలంఇళ్ల కూల్చివేత దుర్మార్గంరేణిగుంట వివేకానంద కాలనీలో పేదలు, దళితులు నిర్మించుకున్న ఇళ్లను టీడీపీ నాయకుల ఆదేశాలతో అధికారులు కూల్చి వేయడం దుర్మార్గం. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించి ఉంటే ఆ ఇళ్లకు అనుభవ ధ్రువీకరణ పత్రం, విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు? ఇంటి పన్నులు ఎలా వసూలు చేశారు? స్థలాలకు సంబంధించి సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపైనా విచారించి చర్యలు తీసుకోవాలి. కరకంబాడి ఎర్రగుట్ట వివాదాస్పద భూమిని సిద్ధల రవి అనే వ్యక్తి ఆక్రమించుకుని పెద్ద ఎత్తున గ్రావెల్ తోలుకుంటుండటం మీకు కనిపించలేదా?– హరినాథ్, సీపీఎం మండల కార్యదర్శి, రేణిగుంట -
ఆక్రమణల పేరుతో పేదల ఇళ్ల కూల్చివేత
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తికి సమీపంలోని రాజీవ్ నగర్లో 2 రోజులుగా విధ్వంసకాండ కొనసాగుతోంది. శనివారం ఇళ్ల నిర్మాణానికి పేదలు వేసిన 27 పునాదులను తవ్వేసిన అధికారులు..నిర్మించిన మరో 24 ఇళ్లను ఆదివారం కూల్చివేశారు. పేదలు అడ్డుకుంటున్నా..జేసీబీలు పెట్టి కూలదోశారు. పట్టణానికి సమీపంలోని రాజీవ్‌నగర్ కాలనీలో వైఎస్సార్ హయాంలో 3,000 మంది పేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలాలు సేకరించి ప్లాట్లను కేటాయించారు. అదే స్థలంలో టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ హయాంలో 6,000 ఇళ్లకు అపార్ట్మెంట్లు నిర్మాణం చేపట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరో 2,000 ఇళ్లు జగనన్న కాలనీ పేరుతో అభివృద్ధి చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డు పక్కన పేదలు నిర్మించుకున్న ఇళ్లను, పునాదులను ఆక్రమిత భూములుగా చూపుతూ వైఎస్సార్సీపీ వారు ఎక్కువగా ఉన్నారనే దురుద్దేశంతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు.ఏ ఈ విధమైన నోటీసులు లేకుండా తొట్టంబేడు తహశీల్దారు శివరాముడు ఆధ్వర్యంలో ధ్వంసం చేçÜ్తున్నారు. ఏడాది ముందు నుంచి నిర్మాణాలు జÆభుత్వం మారిందన్న సాకుతో కూల్చివేస్తున్నారు. దీనివెనుక శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి హస్తం ఉందని, ఆయన ప్రోద్భలంతోనే కూల్చివేస్తున్నారని పేదలు ఆరోపిస్తున్నారు. అక్రమ కట్టడాలు అయితే కరెంటు మీటర్లను ఎందుకు ఇచ్చారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. -
ఆ బుల్డోజర్లు నా శరీరం మీదుగానే వెళ్లాలి
ఢిల్లీలో పేదల ఇళ్ల కూల్చివేతపై రాహుల్ ధ్వజం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రంగ్‌పురి పహాడీ మురికివాడల్లోని పేదలకు చెందిన 900 ఇళ్లను ప్రభుత్వాధికారులు కూల్చివేసిన ఉదంతంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఇళ్ల కూల్చివేతల వల్ల నిరాశ్రయులుగా మారిన బస్తీల వాసులను గురువారం రాత్రి రాహుల్ పరామర్శించారు. ‘మరోసారి వారు బుల్డోజర్లను ఉపయోగించదలిస్తే, వాటిని నా శరీరం మీదుగానే ముందుకు పోనివ్వాల్సి ఉంటుంద’ని హెచ్చరించారు. పేదల ఇళ్ల కూల్చివేత తప్పు అని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించబోదన్నారు. ఓ పక్క చలికాలం కొనసాగుతోందని, మరోపక్క ఎలాంటి హెచ్చరికలు లే కుండానే పేదల ఇళ్లను కూల్చేసి వారిని బయటికి గెంటేశారన్నారు. అటవీ ప్రాంతాల పునరుద్ధరణ పేరుతో మంగళవారం స్థానిక జిల్లా రెవెన్యూ, అటవీ అధికారులు ఈ కూల్చివేతలను నిర్వహించారు.