breaking news
off day school
-
ఆ హైస్కూల్లో ఒంటిగంటకే ఫైనల్ బెల్
రాజంపేట: మధ్యాహ్నం ఒంటి గంట అయితే చాలు.. ఆ హైస్కూల్లో ఫైనల్ బెల్ కొట్టేస్తారు. వేసవి సహా కాలం ఏదైనా.. సోమ, మంగళ, బుధ ఏ రోజైనా ఆ స్కూల్‌కు రోజూ ఒంటిపూట బడే. అన్నమయ్య జిల్లా నందలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఒంటిపూటే నడిచే ఏకైక హైస్కూల్‌గా రికార్డులకెక్కింది. 1908లో నందలూరులో బోర్డు హైస్కూల్ ఏర్పాటైంది. 1954లో జిల్లా పరిషత్ హైస్కూల్.. ఆ తర్వాత 1962లో జిల్లా హయ్యర్ సెకండరీ హైస్కూల్‌గా ఆవిర్భవించింది.ఒకప్పుడు విశాలమైన గదులు, లైబ్రరీ, ల్యాబ్, క్రీడా పరికరాలతో పాటు నాణ్యమైన బోధన, ఉత్తమ ఉపాధ్యాయులతో క్రమశిక్షణకు మారుపేరుగా హైస్కూల్ ఖ్యాతిగాంచింది. ఎందరో ఐఏఎస్‌లను అందించి చరిత్రలో నిలిచింది. ఇక్కడి హైస్కూల్లో తరగతులు ఉదయం 7.45కు ప్రారంభిస్తారు. మధ్నాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. జూనియర్ కళాశాల రాకతో హైస్కూల్ విద్యకు గ్రహణంనందలూరు బస్టాండు నుంచి సౌమ్యనాథ ఆలయానికి వెళ్లే మార్గంలో విశాలమైన స్థలంలో ఈ హైస్కూల్ ఉంది. భవనాల కొరతతో 1982లో నందలూరులోని జూనియర్ కళాశాలను ఇక్కడికి మార్చారు. సొంతభవనాల నిర్మాణం వరకు అని చెప్పిన ఇంటర్ బోర్డు నేటి వరకు ఇక్కడే కళాశాలను కొనసాగిస్తోంది. ఇక్కడి నుంచి కళాశాలను తరలించాలని జెడ్పీ హైస్కూల్ యాజమాన్యం మొత్తుకున్నా.. కలెక్టర్లు జోక్యం చేసుకున్నా ఫలితం లేదు. 274 మంది విద్యార్థులున్న ఈ హైస్కూల్లో మధ్యాహ్నం వరకు తరగతులు సాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఇంటర్ విద్యను కొనసాగిస్తున్నారువ్యతిరేకిస్తున్న అధ్యాపకులుఏదో ఒక పూట వస్తున్నాం..పాఠాలు చెప్పిపోతున్నాం.. అక్కడికి తరలిస్తే రెండు పూటలా కాలేజీకి రావాల్సి వస్తుంది అనుకున్నారో ఏమో. ఇంటర్ కళాశాలను తరలింపును కొందరు అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. మండల కాంప్లెక్స్ సమీపంలోని ఎస్సీ హాస్టల్ భవనాలు దూరమని.. అక్కడికి వెళితే ఇంటర్ బాలికలకు రక్షణ ఉండదని ప్రచారం చేశారు. నిజానికి మండల కాంప్లెక్స్ ఆవరణ ప్రశాంతంగా ఉంటుంది. దశాబ్దాలుగా అక్కడే వందలాదిమంది బాలికలతో బీసీ గురుకుల పాఠశాల కూడా ఉంది.కేవలం తమ స్వార్థం కోసం అధ్యాపకులు చేసిన వ్యవహారం వల్ల తరలింపు ఆగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్, డీఈవో, ఇంటర్ ఆర్జెడీ ఒకతాటిపైకి వచ్చి హైస్కూల్‌కు ఒంటిపూట బడి నుంచి విముక్తి కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా...ఐఏఎస్‌లను.. గొప్ప రాజకీయ నాయకులను దేశానికి అందించిన స్కూల్‌గా ఈ ఇది ఖ్యాతి గడించింది. -
8 నుంచే ఒక్కపూట బడి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఈయేడాది ఎండల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఒంటిపూట బడులను ముందుగానే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. ఈ నెల 8వ తేదీ నుంచే ఒంటిపూట బడులు నిర్వహించాని విద్యాశాఖ కమిషనర్ ఆర్పీ సిసోడియా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మామూలుగా అయితే ప్రతి ఏడాది మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించేవారు. ప్రభుత్వం నిర్ణయంపై బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామశేషయ్య, సురేష్‌కుమార్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.