breaking news
cuts off
-
వివాహేతరం సంబంధం.. చేతులు నరికేసిన భర్త
విజయనగరం జిల్లా: గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడలో దారుణం చోటుచేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కోపంలో ఓ వ్యక్తి, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి చేతులు నరికేశాడు. కొత్తగూడ గ్రామానికి చెందిన నరేష్, సుహాసిని(పేరు మార్చాం) భార్యభర్తలు. సుహాసినితో అదే గ్రామానికి చెందిన బిడ్డిక ధనుంజయ్ అనే వ్యక్తి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి మహిళ భర్త పథకం ప్రకారం మరో ముగ్గురు వ్యక్తుల సహాయంతో ధనుంజయ్‌ను గ్రామం బయటికి తీసుకువెళ్లారు. ఉన్నట్టుండి కత్తితో ధనుంజయ్ రెండు చేతులూ నరికేశారు. ఈ విషయం గమనించిన గ్రామస్తులు ధనుంజయ్‌ను దగ్గరిలోని భద్రగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడికి తరలించారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య చేతులు నరికిన భర్త
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబకలహాలతో భర్త... భార్య చేతులు నరికేశాడు. అనంతరం భర్త అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.