breaking news
Constructed
-
టిడ్కో ఇళ్లల్లోనూ కీర్తి చోరుడు.. బాబు ‘హోం’కరింపులు
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా తన ఖాతాలో వేసుకోవడంలో సిద్ధహస్తుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పంపిణీ చేసిన టిడ్కో ఇళ్ల పట్టాలపై ‘2019–20 సంవత్సరంలో నిర్మించిన ఇళ్లు’ అని స్పష్టంగా కనిపించడం చూసి సభలోని వారే ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 21 నెలల్లో రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసిందని, గతేడాది నవంబర్‌లో 3 లక్షల ఇళ్లను పేదలకు అప్పగించిందని బాబు చెప్పడం విని విస్తుపోయారు.రెండో విడతలో భాగంగా నాయుడుపేట మండలం, పుదూరు నుంచి లక్ష టిడ్కో ఇళ్లతోపాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్టు గొప్పలుపోవడంపై నివ్వెరబోయారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లకు రంగులు వేసి తానే కట్టించినట్టు చెప్పుకోవడం చూస్తుంటే బాబు క్రెడిట్ చోరీలో తనకు తానే సాటి అనేలా ఉందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు ‘కట్టు’కథల కనికట్టు 2015–16 మధ్య చేపట్టిన టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులను నాటి టీడీపీ ప్రభుత్వం దోపిడీకి పరాకాష్టగా మార్చేసింది. ఆ సంవత్సరం కేంద్రం 1,37,533 ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 81 మాత్రమే పూర్తి చేశారు. 2017–18లో 2,39,062 ఇళ్లు మంజూరు చేస్తే 25,818 పూర్తిచేశారు. నాడు చంద్రబాబు రాష్ట్రంలో ఏ నగరంలో లేనంతగా నిర్మాణ ధరలు పెంచి అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు.అయినప్పటికీ మంజూరైన ఇళ్లల్లో ఐదు శాతం కూడా నిర్మాణం పూర్తిచేయనేలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అరకొరగా నిర్మించిన ఇళ్లను హడావుడిగా లబ్ధిదారులకు అప్పగించి ఏదో చేసేసినట్టు బిల్డప్ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2019 మే నాటికి కేంద్ర ప్రభుత్వం 4.91 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 77,350 ఇళ్ల నిర్మాణం కోసం పునాదులు వేసి వాటిలో 20 వేల ఇళ్లు మాత్రమే అందులోనూ 60 శాతం పనులే చేశారు. జగన్ ప్రభుత్వంలోనే 1,77,546 ఇళ్లు పూర్తి 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ హయాంలోనే టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం జరిగింది. ప్రతిచోటా ఇళ్ల నిర్మాణంతో పాటు నూరు శాతం మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించారు. మొత్తం 2,62,212 ఇళ్లు అవసరమని గుర్తించి వాటిలో 1,77,546 ఇళ్లు పూర్తి చేయడంతో పాటు దాదాపు లక్ష ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ విషయం మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు కూడా. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనుల్లో దాదాపు 80 శాతం పూర్తి చేశారు. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన 21 నెలల పాలనలో టిడ్కో ఇళ్లకు ఎక్కడా స్లాబులు వేసిన దాఖలా లేదు. కానీ క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.ఆ 1.5 లక్షల ఇళ్లు గత ప్రభుత్వంలో నిర్మించినవే రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది. ఈ పథకం ద్వారా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను మహిళల పేరిట ఉచితంగా పంచింది. ఆ ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ రూ.1.15 లక్షల కోట్ల పైమాటే. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా ఏకంగా 17 వేలకుపైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు.అంతేకాకుండా జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం. కాగా, ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. ఇక సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు స్లాబ్ పూర్తయిన, 99 వేల ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. ఇందులో చాలా వరకు తుది దశ నిర్మాణాలూ పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్డేట్ చేయని పరిస్థితి నెలకొంది. జగన్ హయాంలో పూర్తయితే బాబు షో వైఎస్ జగన్ హయాంలో పూర్తయిన ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. గతేడాది నవంబర్‌లో పేదలకు 3 లక్షల ఇళ్ల పంపిణీ పేరిట షో చేశారు. అప్పట్లో అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్లు జగన్ ప్రభుత్వం 2021–22లో కట్టినవే కావడంతో అప్పట్లో బాబు ప్రభుత్వం అభాసుపాలైంది.అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గని బాబు సర్కార్ సోమవారం మరో 2.5 లక్షల ఇళ్లను పేదలకు పంపిణీ పేరిట మరోమారు దు్రష్పచారానికి తెరలేపింది. ఈ 2.5 లక్షల ఇళ్లలో లక్ష గత ప్రభుత్వంలోనే పూర్తి చేసిన టిడ్కో ఇళ్లు కాగా, మిగిలిన 1.5 లక్షల ఇళ్లు కూడా గత ప్రభుత్వంలో నిర్మించిన సాధారణ ఇళ్లు కావడం గమనార్హం. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిన బాబు నేటికీ ఒక్క గజం స్థలం పేదలకు ఇవ్వలేదు. -
150 గంటల్లో ఫ్యాక్టరీ భవనం: ఈప్యాక్ ప్రిఫ్యాబ్ ఘనత
భారతదేశంలోని ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) తయారీదారులలో ఒకరైన ఈప్యాక్ ప్రిఫ్యాబ్, కేవలం 150 గంటల సమయంలో ఒక నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన నిర్మాణంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంబట్టులో పూర్తయిన ఈ ప్రాజెక్ట్.. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ నిబద్ధతకు నిదర్శనం.మొత్తం 1,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణం పూర్తిగా లేటెస్ట్ ప్రిఫ్యాబ్రికేషన్ అండ్ పీఈబీ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ వేగవంతమైన పురోగతిని సాధించడానికి ప్రతి దశ నిర్మాణాన్ని నిశితంగా ప్లాన్ చేసింది. ప్రాథమిక నిర్మాణం 48వ గంటకు పూర్తయింది, ఆ తర్వాత 90వ గంటకు రూఫింగ్.. 120వ గంటకు క్లాడింగ్ పూర్తయింది. మొత్తం మీద ఒక నిర్ణీత సమయంలో ఒక నిర్మాణం పూర్తయింది. ఈ విజయం గొప్ప ప్రపంచ రికార్డును నెలకొల్పింది, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది.150 గంటల సమయంలో ఒక నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఈప్యాక్ ప్రిఫ్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ సింఘానియా మాట్లాడుతూ.. పీఈబీ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశంలో అత్యంత వేగవంతమైన నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత మాకే దక్కుతుంది. పీఈబీ అనేది నిర్మాణం భవిష్యత్తు. పీఈబీ పరిష్కారాలు ఎక్కువ ఆమోదం పొందడంతో పరిశ్రమలో మరిన్ని బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.ఈప్యాక్ ప్రిఫ్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నిఖెల్ బోత్రా మాట్లాడుతూ.. భారతదేశంలో వేగవంతమైన నిర్మాణం పూర్తవడం సంతోషంగా ఉందన్నారు. గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆసియా హెడ్ మనీష్ విష్ణోయి.. ఈప్యాక్ ప్రిఫ్యాబ్ నిరంతర అన్వేషణను అభినందించారు. -
Krishna Floods: వరదల నుంచి కోట వంటి రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గతంలో చినుకు పడితే విజయవాడ కృష్ణలంక వాసులు వణికిపోయేవారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తితే బెంబేలెత్తిపోయేవారు. కరకట్ట వెంబడి ఇళ్లను నీళ్లు ముంచెత్తడంతో జనం కంటిమీద కునుకు లేకుండా అల్లాడిపోయేవారు. మోయగలిగినన్ని సామాన్లు సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లేవారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దశాబ్దాలుగా కృష్ణలంక ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న వరద ముంపు సమస్య శాశ్వతంగా తప్పింది.గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత వల్ల నేడు 8లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా.. ఆ విషయమే తెలియకుండా ప్రశాంతంగా తమ ఇళ్లలో ఉంటున్నారు. గతంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం మూడు లక్షల క్యూసెక్కుల వరదనీరు వదిలితే చాలు... కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్, కోటినగర్, పోలీస్‌కాలనీ, రణదివెనగర్, గౌతమినగర్, నెహ్రూనగర్, చలసానినగర్, గీతానగర్, బాలాజీనగర్, ద్వారకానగర్, భూపే‹Ùగుప్తానగర్, భ్రమరాంబపురం, తారకరామానగర్ ప్రాంతాలు నీటమునిగేవి.వరద మొదలవగానే ఈ ప్రాంతాల్లోని దాదాపు 80వేల మంది ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ పరిస్థితులను గమనించిన గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా చుక్కనీరు ఇళ్లలోకి రాకుండా రూ.474.51 కోట్లతో కృష్ణా నది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు మూడు దశల్లో 5.66 కిలో మీటర్లు పటిష్టంగా రక్షణ గోడ నిరి్మంచారు. ఈ ప్రాంత ప్రజలకు వరద ముంపు నుంచి రక్షణ కలి్పంచడమే కాకుండా రూ.12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. -
వయనాడ్ విలయం: మేజర్ సీతాషెల్కేకు హ్యాట్సాఫ్! (ఫొటోలు)


