breaking news
Commander in Chief
-
డబ్ల్యూఏసీ చీఫ్‌గా వివేక్ రామ్ చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: సున్నితమైన లద్దాఖ్ సెక్టార్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాల వైమానిక రక్షణను చూసుకునే భారత వైమానిక దళం వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ (డబ్ల్యూఏసీ) కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌గా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరిని నియమించినట్లు అధికారులు ప్రకటించారు. చౌదరి ప్రస్తుతం ఈస్టర్న్ ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు . ఎయిర్ మార్షల్ బి సురేష్ అనంతరం ఆగస్టు 1 నుంచి ఈ బాధ్యతలు తీసుకోనున్నారు. చదవండి: 40 వేల మంది చైనా సైనికుల తిష్ట! చైనాతో సరిహద్దు వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంలో భాగంగా డబ్ల్యూఏసీ చీఫ్‌గా చౌదరిని నియమించినట్లుగా తెలుస్తోంది. భారత వైమానిక దళం గత కొన్ని వారాలుగా తూర్పు లడఖ్ ప్రాంతంలో రాత్రి సయంలో వాయు గస్తీని నిర్వహిస్తోంది. ఇప్పటికే సుఖోయ్ 30 ఎమ్కేఐ, జాగ్వార్, మిరాజ్ 2000 విమానాల వంటి ఫ్రంట్‌లైన్ ఫైటర్ జెట్లను లద్దాఖ్‌లోని సరిహద్దు స్థావరాలతో పాటు పలు ప్రాంతాలలో ఉంచారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్ధి అయిన ఎయిర్ మార్షల్ చౌదరి 1982 డిసెంబర్ 29 న ఐఏఎఫ్‌లో చేరారు. ఆయన మిగ్ -21, మిగ్ -23 ఎమ్ఎఫ్, మిగ్ -29, ఎస్‌యూ -30 ఎంకేఐలతో సహా పలు విమానాలను నడిపారు. చదవండి: లద్దాఖ్‌కు యుద్ధ విమానాలు -
కమాండర్ ఇన్ చీఫ్‌గా జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడికి మరో హోదా బీజింగ్: చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అధికార కిరీటంలో మరో శక్తి చేరింది. ఆయన చైనా సంయుక్త దళాల జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్.. కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన చైనా ఆర్మీపై ఆయనకు పూర్తి నియంత్రణ లభించినట్లయింది. ఇప్పటికే జిన్‌పింగ్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు. బుధవారం కమాండ్ సెంటర్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ బాధ్యతలు చేపట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రపంచ ప్రస్తుత పరిస్థితిని బట్టి యుద్ధ దళాల చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని జిన్‌పింగ్ చెప్పారు.