breaking news
coleector
-
డిజిటల్ క్లాస్‌రూమ్‌తో మంచి ఫలితాలు
కాకినాడ సిటీ : పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ద్వారా విద్యాబోధన చేసే ప్రయత్నంతో మంచి ఫలితాలు వస్తాయని, ఇందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ కోరారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాల్ నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో డిజిటల్ క్లాస్ రూమ్లపై మండలస్థాయి వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ క్లాస్‌రూమ్‌ల నిర్వహణతో ఉపాధ్యాయులు సహకారంతో పాటు నాణ్యమైన విద్య పెరుగుతుందన్నారు. ఇంటర్నెట్లో ఎక్కువ యాప్‌లు డౌ¯ŒSలోడ్ చేసుకుని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా అన్ని హైస్కూళ్లకు మార్చి నెలాఖరుకు బ్రాడ్ బ్యాండ్ ఇవ్వనున్నామని తెలిపారు. ఈ ఏడాది జిల్లా మొదటి స్థానంలో ఉండేలా ఉపా«ధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎస్ఎస్ఏ పీఓ శేషగిరి, ఇ¯ŒSచార్చి డీఈఓ అబ్రహం, డీవైఈఓ వాడపల్లి పాల్గొన్నారు. -
శ్రద్ధ పెట్టకుంటే చర్యలు
మొక్కల పెంపకంపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ – మొక్కుబడిగా వ్యవహరిస్తే కుదరదని హెచ్చరిక కర్నూలు(అర్బన్): ‘మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించడంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలి.. ఆశామాషీగా తీసుకుని మొక్కుబడిగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు’ అంటూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను హెచ్చరించారు. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నెల 29వతేదీన రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ క్రమంలో మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో 89 శాఖల అధికారులతో కలెక్టర్ ‘వనం–మనం’ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, డీఆర్ఓ గంగాధర్‌గౌడ్, సామాజిక అడవుల డీఎఫ్ఓ సావిత్రీబాయి పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల మైదానాల్లో 29వ తేదీన విద్యార్థులందరి చేత మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని డీఈఓ, డీవీఈఓలను ఆదేశించారు. 30వ తేదీన తాను ర్యాండమ్‌గా ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శిస్తాన ని తెలిపారు. ముందుగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం, నిర్దేశిత ప్రాంతాల్లో మొక్కలు నాటడం అనంతరం మొక్కల పెంపకంపై సమావేశం నిర్వహించాలని మండల నోడల్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓలు రఘుబాబు, సుధాకర్‌రెడ్డి, ఓబులేసు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.