breaking news
COE
-
బీసీసీఐలో చేరిన హర్భజన్ సింగ్
భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐలో చేరాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, యువ స్పిన్నర్లకు మార్గదర్శకత్వం చేయనున్నాడు. ఇప్పటికే మరో భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఫాస్ట్ బౌలర్లతో పని చేస్తున్నాడు. తాజాగా హర్భజన్ సింగ్ ఈ జాబితాలో చేరాడు.బీసీసీఐ మార్చి మొదటి వారంలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రాంలో రెడ్ బాల్ స్పెషలైజ్డ్ క్యాంపులు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ శిబిరాలు అండర్-19 మరియు ఇండియా A జట్లలో ప్రతిభ చూపిన ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వీరిని త్వరలోనే సీనియర్ జట్టులోకి తీసుకురావడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. మరో దిగ్గజం కూడా..!యువ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత మాజీలు క్యూ కడుతున్నారు. జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ ఇప్పటికే రంగంలోకి దిగగా.. మరో దిగ్గజ బౌలర్ కూడా తన స్పెషలైజేషన్‌లో యువ బౌలర్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆల్‌టైమ్ గ్రేట్ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రిస్ట్ స్పిన్నర్ల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం కార్యక్రమాన్ని మరో భారత దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సమన్వయం చేస్తున్నారు. ఇతర మాజీ ఆటగాళ్లను కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి అతను సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, బీసీసీఐలో ఇలాంటి శిక్షణా శిబిరాలు కొత్తవి కావు. జగ్మోహన్ దాల్మియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మాజీ ఆటగాళ్లను యువ క్రికెటర్లకు మార్గదర్శకులుగా ఆహ్వానించే పద్ధతి ప్రారంభమైంది. అప్పట్లో చందు బోర్డే, ఎరపల్లి ప్రసన్న, సయ్యద్ కిర్మాణి వంటి ప్రముఖులు జోనల్ అకాడమీ శిబిరాల్లో శిక్షణ ఇచ్చారు. -
హైదరాబాద్‌లో కాగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వివిధ విభాగాల్లోని సిబ్బందికి అత్యుత్తమ ఆడిట్ విధానాల్లో శిక్షణనిచ్చేందుకు హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ని ఏర్పాటు చేయనుంది. 32వ అకౌంటెంట్స్ జనరల్ కాన్ఫరెన్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాగ్ కె. సంజయ్ మూర్తి ఈ మేరకు ప్రకటన చేశారు.ఆవిష్కరణలు, పరిశోధనలు మొదలైన వాటికి ఇది జాతీయ స్థాయి హబ్‌గా ఉంటుందని డిప్యుటీ కాగ్ ఏఎం బజాజ్ తెలిపారు. అంతర్జాతీయంగా పాటించే అత్యుత్తమ ప్రమాణాల అమలు, అధునాతన నైపుణ్యాలను పెంపొందించేందుకు, నాణ్యమైన ఆడిట్ విధానాలను వివిధ విభాగాలవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇన్క్యుబేటరుగా ఉంటుందని వివరించారు. డేటా, ఏఐని ఉపయోగించుకుని ఆడిట్ విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ఇది తోడ్పడుతుందని తెలిపారు. -
మెట్రిక్‌స్ట్రీమ్‌తో టెక్‌మహీంద్రా జట్టు
బెంగళూరు: అమెరికాకు చెందిన మెట్రిక్‌స్ట్రీమ్ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. గవర్నెన్స్, రిస్కు తదితర అంశాలకు సంబంధించి (జీఆర్సీ) సర్వీసులను మెట్రిక్‌స్ట్రీమ్ అందిస్తోంది. భాగస్వామ్య ఒప్పందం ప్రకారం టెక్‌మహీంద్రా ప్రత్యేకమైన మెట్రిక్‌స్ట్రీమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ని బెంగళూరులో ఏర్పాటు చేసింది. -
తెయూ సీఓఈ సస్పెన్షన్
తెయూ(డిచ్ పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి (సీఓఈ) డాక్టర్ మామిడాల ప్రవీణ్‌ను సస్పెండ్ చేస్తూ గత ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చే సిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వర్సీటీవర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, 2014 జనవరి నాలుగున కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు వర్సి టీలో పలువురు శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరారు. వారితోపాటు ఎంపికైన ప్రవీణ్ పది రోజుల తర్వాత తెయూ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయనను పరీక్షల నియంత్రణాధికారిగా నియమిస్తూ జూలై ఎనిమిదిన అప్పటి ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధర్మరాజు ఉత్తర్వులు జారీ చేశారు. తెయూలో చేరక ముందు డాక్టర్ ప్రవీణ్ ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పని చేశారు. ఇక్కడ చేరిన తర్వాత ఓయూలో వెంటనే రాజీ నామా చేయలేదని సమాచారం. ఇక్కడా, అక్కడా వేతనం పొందినట్లు తెలిసింది. ఒకే సమయంలో రెండు యూనివర్సిటీల్లో వేతనాలు పొందినట్లు అందిన ఫిర్యాదు మేరకు గత నెల 16న ప్రవీణ్‌ను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి శనివారం వెలుగు చూశాయి. అప్పటి నుంచి సెలవులో వెళ్లిన ప్రవీణ్, సస్పెన్షన్ ఉత్తర్వులు ఉపసంహరింపజేసుకునేందుకు ఉన్నత విద్యామండలితోపాటు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. ప్రొబేషనరీ సమయంలో ఉన్న ప్రవీణ్ ఉద్దేశ పూర్వకంగా రెండు చోట్ల వేతనాలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు భావిస్తే క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. పీహెచ్డీ తెలుగు అడ్మిషన్లు రద్దు తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన పీహెచ్డీ తెలుగు విభాగం అడ్మిషన్లను రద్దు చేస్తూ గత ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యార్ డిసెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా ఆల స్యంగా వెలుగు చూసింది. అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు అప్పుడు ఫిర్యా దు చేశారు. దీంతో ఈ అంశంపై విచారణ జరిపేందుకు ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం డీన్ ప్రొఫెసర్ నాగేశ్వరరావును ఏక సభ్య కమిటీగా నియమించారు. ఆయన విచారణ జరిపి నివేదికను ఇన్చార్జి వీసీకి అందజేశారు. అనంతరం అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చిన వీసీ, ఆర్ట్స్ డీన్ ధర్మరాజు, తెలుగు హెచ్ఓడీ కనకయ్యలకు చార్జ్ మెమో లు జారీ చే శారు. అడ్మిషన్లను రద్దు చేశారు. ఈ విషయమై వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ లింబాద్రిని సంప్రదించగా ఉత్తర్వులు అందిన మాట వాస్తమేనని తెలిపారు.


