breaking news
co workers
-
సహోద్యోగి చెవి కొరికిన ప్రవాస భారతీయునికి జైలు శిక్ష
సహోద్యోగి చెవి కొరికినందుకు సింగపూర్‌లో ప్రవాస భారతీయునికి ఐదు నెలల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మోహన్ శంకర్, తమిళనాడు నుంచి వెళ్లి సహచరులతో కలిసి సింగపూర్‌లో నిర్మాణ రంగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2020లో మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడగా.. ప్రస్తుతం కోర్టు తీర్పునిచ్చింది. మద్యం మత్తులో సహోద్యోగిపై వాగ్వాదానికి దిగిన మోహన్.. అనంతరం అతనిపై దాడికి దిగాడు. ఈ క్రమంలో సహోద్యోగి చెవిని కొరికేశాడని పోలీసులు తెలిపారు. బాధితున్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుని కోలుకున్నాడు. కాగా.. మోహన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణ తర్వాత ఈ మేరకు ఐదు నెలల జైలు శిక్షను విధించింది. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: జాలరిని నీళ్లలోకి లాగేసిన సొరచేప.. వీడియో వైరల్.. -
రైల్వే ఉద్యోగినిపై.. సహోద్యోగుల గ్యాంగ్ రేప్
కోల్‌కతా: మధ్యవయస్కురాలైన రైల్వే ఉద్యోగినిపై నలుగురు సహోద్యోగులే కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న దారుణ ఘటన కొల్కతాలో వెలుగు చూసింది. బాధితురాలిపై ఆ నలుగురు కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ ఉదంతాన్ని ఫొటోలు కూడా తీశారు. విషయాన్ని ఎవరికైనా చెప్పినా.. తమకు సహకరించకపోయినా.. ఆ ఫొటోలను నెట్లో పెట్టడంతోపాటు చంపేస్తామని ఆమెను బెదిరించారు. అయితే, ఆమె తనపై జరిగిన అకృత్యాన్ని ఓ టీవీ చానల్‌తో శనివారం పంచుకోవడంతో విషయం వెలుగు చూసింది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. రైల్వే ఉద్యోగి అయిన బాధితురాలి భర్త.. 2010లో జరిగిన జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమెకు రైల్వేలో ఉద్యోగం లభించింది. అనంతరం కొన్నాళ్లకు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇదిలావుంటే, రైల్వే శాఖలో విధి నిర్వహణలో పరిచయం అయిన నలుగురు ఉద్యోగులు ఆమెను శారీరకంగా వేధించడం ప్రారంభించారు. భర్తకు విడాకులు ఇచ్చి తమను పెళ్లి చేసుకోవాలని కూడా ఒత్తిడి తెచ్చారు. ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో అతను ఆత్మహ త్యా యత్నం చేశాడు. మరోపక్క, ఆ నలుగురు బాధితురాలిపై చిత్పూర్ రైల్వేయార్డులోని ఖాళీ రైలు బోగీలో పలు దఫాలుగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నారు. తాను నిండు గర్భిణిని అని వేడుకున్నా నిందితులు కనికరించలేదని బాధితురాలు వాపోయింది. స్పందించిన డండం జీఆర్పీ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి, నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.