మేం విడాకులు తీసుకున్నాం.. కానీ పాప విషయంలో
'ఇరుముడి' ఇంతలా హిట్ అవ్వడంలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్‌ది కూడా కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఓవైపు వరస సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పటికీ మరోవైపు హీరోగానూ పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అలా 'ఇమ్మోర్టల్' అనే తమిళ మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి మాట్లాడాడు. కూతురి విషయంలో తీసుకున్న నిర్ణయం గురించి స్పందించాడు.(ఇదీ చదవండి: ఇన్నాళ్లు ఫ్యాన్ వార్స్.. ఇప్పుడు యష్ తల్లి కూడా)'సైంధవి(మాజీ భార్య), నేను స్కూల్ రోజుల నుంచి ఫ్రెండ్స్. ప్రస్తుతం మేమిద్దరం విడిపోయాం. అయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నాం. మా కూతురు అన్విని ఇద్దరం కలిసి కో-పేరెంటింగ్ చేస్తున్నాం. అన్వి నాలో ఒక భాగం. సైంధవి, అన్వి ఇద్దరూ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులు. చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండటం వల్ల విడిపోయిన తర్వాత కూడా మంచి రిలేషన్ మెంటైన్ చేస్తున్నాం. ఒకరినొకరం గౌరవించుకుంటాం. అందుకే మా కుమార్తెని కలిసి పెంచగలుగుతున్నాం' అని జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పుకొచ్చాడు.జీవీ ప్రకాశ్ కుమార్‌కి ఏఆర్ రెహమాన్ మామ అవుతాడు. అలా చిన్నప్పుడే సింగర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తర్వాత సంగీత దర్శకుడిగానూ జీవీ మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని పలు చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ జీవీ బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్నాడు. వ్యక్తిగత విషయానికొస్తే.. 2013లో సైంధవిని పెళ్లి చేసుకున్నాడు. కానీ 2024లో ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: వేరేలా కష్టపడొచ్చుగా.. హిజ్రాల తీరుపై బిగ్‌బాస్ అరియానా వీడియో)