breaking news
Clean and Clear
-
సిద్ధిపేటను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుదాం..
సాక్షి, సిద్ధిపేట: గాంధీ మహాత్ముడు ప్రవచించిన స్వచ్ఛతను ఆచరణలోకి తీసుకురావాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయంలో ఐటీసీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వచ్ఛతపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసే విధంగా ర్యాలీ నిర్వహించడం హర్షణీయం అన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా అనర్థాలకు గురవుతున్నామని, సిద్ధిపేటను ప్లాస్టిక్ రహిత సిటీగా మార్చడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. బతుకమ్మ చీరలు పంపిణీ.. బతుకమ్మ,దసరా పండగలను సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చీరలు ఇస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ పరిషత్‌లో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే సిద్ధిపేట ప్లాస్టిక్ రహితంగా మారాలన్నారు. ప్రతిఒక్కరూ తడి,పొడి చెత్తను వేర్వేరుగా చేసి ఇవ్వాలని సూచించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తి కాగానే కొత్త రోడ్లు వేస్తామని చెప్పారు. ప్లాసిక్ వస్తువులు ఇళ్లలో వాడకూడదన్నారు. మాంసం, చికెన్ దుకాణాలకు స్టీల్ డబ్బాలు తీసుకెళ్లాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత అవసరమని తెలిపారు. ఇంటింటికి నల్లా మాదిరి.. ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు పైపులు ద్వారా త్వరలో సరఫరా చేస్తామన్నారు. ఇళ్లు,పరిసర ప్రాంతాల్లో మొక్కలు విధిగా పెంచాలని సూచించారు. అధికారులపై మంత్రి ఆగ్రహం... సిద్ధిపేట పట్టణంలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ఛైర్మన్, పురపాలక అధికారులపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ప్రకటన.. కనిపించుట లేదు..
సావో పాలో.. బ్రెజిల్లో ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద నగరాల్లో ఇదీ ఒకటి.. జనాభా 1.2 కోట్లు.. మీరు ఈ మహా నగరం మొత్తం తిరిగి చూడండి.. ఎక్కడా ఒక్క యాడ్ కూడా కనిపించదు! కనీసం పోస్టర్ కూడా!! మనం మన ఊళ్లో రోడ్డు మీదకెక్కితే ఎక్కడికక్కడ హోర్డింగ్స్ మీద యాడ్స్, పోస్టర్లు, బస్సుల మీద.. ఆటోల మీద ఎక్కడ పడితే అక్కడ ప్రకటనలు.. ఆ సబ్బు అని.. ఈ డ్రింక్ అని.. బట్టలని.. ఇలా ఏదో ఒకదాని గురించి ప్రకటనలు. అయితే, ఇంత పెద్ద మహానగరంలో అది మచ్చుకైనా కనిపించదు. అంతా క్లీన్ అండ్ క్లియర్. ఎందుకంటే.. ఇక్కడ అవుట్ డోర్ యాడ్స్ నిషిద్ధం. 2006 సెప్టెంబర్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ మేరకు చట్టం చేశారు. అది నేటికీ అమలవుతోంది. ఈ చట్టం తేవాలనుకున్నప్పుడు బిజినెస్ పడిపోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తర్వాతి కాలంలో అది తప్పని రుజువైంది. ఆ సమయానికి సిటీలో ఉన్న 15 వేల బిల్‌బోర్డులను తొలగించారు. కొందరు షాపుల ముందు యాడ్లు లాంటివి ఉంచితే.. అలాంటివారి నుంచి మొత్తం రూ.50 కోట్లు జరిమానా వసూలు చేశారు. కొత్తలో యాడ్స్ లేకుండా సిటీ కొంచెం విచిత్రంగా కనిపించినా.. తర్వాత అక్కడి వారికది అలవాటైపోయింది. ఈ చట్టం ఎలాగుందని 2011లో సర్వే చేసినప్పుడు నగరంలోని 70 శాతం మంది దాని వల్ల మంచే జరిగిందని అభిప్రాయపడ్డారు.