breaking news
cigrates
-
ఈ సింపుల్ చిట్కాతో సిగరెట్ మానేయండి
-
పొగ తాగితే పగబడతది
సాక్షి, హైదరాబాద్: ధూమపానం అలవాటున్న వారికి కరోనా వైరస్ సోకితే నాలుగు రెట్లు ఎక్కువ ప్రమాదమని జాతీయ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిస్తోంది. పొగతాగే వారితో పాటు ఆ పొగ పీల్చే వారి (పాసింగ్ స్మోకర్) పరిస్థితి సైతం కాస్త ఆందోళనకరమేనని చెబుతోంది. ధూమపానం చేసేవారిలో శ్వాసకోశ నాళాలు బలహీనమవుతాయి. ఊపిరితిత్తుల పనితీరు నెమ్మదిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్–19 వ్యాప్తి చెంది తీవ్రమైతే సంకటస్థితిలో పడినట్టే. ప్రస్తుతం శ్వాసకోశ సంబంధ లక్షణాలు తీవ్రమై మరణిస్తున్న వారిలో 63శాతం మంది స్మోకర్స్ ఉంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన గణితాత్మక విశ్లేషణలో తేలింది. ఈ క్రమంలో ధూమపానం, హుక్కా పీల్చే అలవాటును మానుకోవా లని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.పొగాకు అలవాటున్న వారు వైరస్ సంక్రమిత వ్యాధుల బారినపడితే వేగంగా నీరసించిపోతారని వైద్యులు చెబుతున్నారు. నీరసం నుంచి ఉత్తేజితమయ్యేందుకు ఎక్కువసార్లు పొగ తాగేందుకు ఇష్టం చూపే అవకాశాలున్నా యి. ఇలా పొగతాగే అలవాటింకా పెరిగి కార్డియోవాస్క్యులర్, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం లాంటి వ్యాధులు దాడిచేస్తాయి. వీరిలో క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. ఈ దశకు చేరుకున్న వారికి కోవిడ్–19 సోకితే ఒక్కసారిగా శరీరం కుప్పకూలి పోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధులున్న వారు కోవిడ్ బారినపడితే.. జాతీయ స్థాయిలో దాదాపు 10శాతం మంది హైరిస్క్ లోకి వెళ్తున్నట్లు గుర్తించారు. తక్షణమే ధూమపానాన్ని మానేసిన 24 గంటల్లోనే వారి రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ తీవ్రత భారీగా తగ్గుతుంది. అలాగే, 2 నుంచి 12 వారాల్లో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడతాయని, 9 నెలల తర్వాత శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని కేంద్ర వైద, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు పొగాకు ఉత్పత్తులైన గుట్కా, ఖైనీ, పాన్, జర్దా తినే వారు బహిరంగంగా ఉమ్మివేస్తుంటారని, వీరంతా కోవిడ్–19 వ్యాప్తికి కారకులయ్యే అవకాశం ఉందని చెబుతోంది. అలాంటి అలవాట్లకు చెక్‌పెడితే వారిలో అనారోగ్య సమస్యలు సైతం తగ్గుతాయని సూచిస్తోంది. -
'రూపాయి' సిగరెట్ దండయాత్ర
♦ బంగ్లాదేశ్, మలేసియా నుంచి అక్రమ రవాణా ♦ ప్రైవేట్ బస్సులు, రైళ్ల ద్వారా హైదరాబాద్‌కు సరఫరా ♦ బేగంబజార్‌లోని మూడు ఏజెన్సీల ద్వారా దిగుమతి ♦ ఇక్కడి నుంచే తెలంగాణ, ఏపీలకు పంపిణీ.. విక్రయం ♦ వాణిజ్యపన్నుల శాఖ దాడులతో వెలుగులోకి ♦ ఒక గోడౌన్ సీజ్.. రూ. 15 లక్షల పన్ను వసూలు సాక్షి, హైదరాబాద్: బంగారం.. మత్తుమందులు.. ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న ఈ జాబితాలోకి ఇప్పుడు సిగరెట్లు కూడా చేరిపోయాయి. సాధారణంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులన్నీ కాస్ట్లీగానే ఉంటాయి. కానీ సిగరెట్ల దగ్గరికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. తక్కువ ధర.. చీప్ సిగరెట్లు కుప్పలుతెప్పలుగా వచ్చి రాష్ట్రంలో పడుతున్నాయి. ఇవికాస్తా.. రూపాయికే సిగరెట్ పేరిట.. పేద, మధ్యతరగతి వర్గాలు, కాయకష్టం చేసుకునే కూలీలు, కార్మికులే లక్ష్యంగా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సుంకాలు, రాష్ట్ర అమ్మకం పన్ను చెల్లించకుండా యథేచ్ఛగా పాన్‌డబ్బాలకు చేరిపోతున్నాయి. బంగ్లాదేశ్, మలేసియాలో తయారయ్యే ఈ ఘాటైన సిగరెట్లకు రాష్ట్రంలో ఉన్న డిమాండ్ దృష్ట్యా వ్యాపారులు దొంగ మార్గాల ద్వారా దిగుమతి చేసుకుంటున్నారు. వాణిజ్యపన్నుల శాఖ తాజాగా నిర్వహించిన దాడులతో సిగరెట్ దందా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతా మీదుగా దేశంలోకి..: తక్కువ ధరలో లభించే ఈ సిగరెట్లు విదేశాల నుంచి రాష్ట్రానికి అక్రమంగా దిగుమతి అవుతున్నాయి. బంగ్లాదేశ్, మలేసియా నుంచి కోల్‌కతా మీదుగా దేశంలోకి వస్తున్న ఈ సిగరెట్లు ప్రైవేటు బస్సులు, రైలు మార్గాలతో పాటు ట్రాన్స్పోర్ట్ కంపెనీల ద్వారా హైదరాబాద్‌కు చేరుకుంటున్నాయి. ఎలాంటి పన్నులూ చెల్లించకుండా తరలిస్తున్న ఈ సిగరెట్లను బేగంబజార్‌లోని మూడు ఏజెన్సీలు దిగుమతి చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాయి. ఇటీవల వాణిజ్యపన్నుల శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేసిన దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. బహిరంగ మార్కెట్లో సిగరెట్ ప్యాకెట్ల ధరలు భారీగా పెరగడం, సిగరెట్లపై 20 శాతం వ్యాట్ విధిస్తుండడంతో బంగ్లాదేశ్, మలేసియాల నుంచి వచ్చే ఘాటైన సిగరెట్లకు డిమాండ్ పెరిగింది. వివిధ కంపెనీల పేర్లతో రూపాయికి ఒక సిగరెట్ చొప్పున రూ.10కే ప్యాకెట్ లభిస్తుండడంతో పేద, మధ్యతరగతి వర్గాలు, కాయకష్టం చేసుకునే కూలీలు, కార్మికులు వీటికి అలవాటుపడ్డారు. దీనిని ఆసరాగా చేసుకుని బేగంబజార్‌కు చెందిన పలువురు వ్యాపారులు కొన్నేళ్లుగా బస్సులు, రైళ్ల ద్వారా సిగరెట్లను దర్జాగా రవాణా చేస్తున్నారు. చేపల కోసం కోల్‌కతా నుంచి వచ్చే ట్రక్కుల ద్వారా కూడా సిగరెట్ల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌కు వచ్చే ఈ సిగరెట్ ప్యాకెట్లను భారతీయ కంపెనీల సిగరెట్లతో కలిపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలకు రవాణా చేస్తున్నారు. దేశీయ సిగరెట్లు సైతం.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో తయారయ్యే సిగరెట్లను కూడా పన్ను చెల్లించకుండా ఆయా కంపెనీలు హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ తనిఖీల్లో తేలింది. ఈ రాష్ట్రాల్లోని సిగరెట్ ఫ్యాక్టరీల్లో తయారయ్యే ప్యాకెట్లను వివిధ మార్గాల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నా అధికార యంత్రాంగం కళ్లు మూసుకుంది. విదేశీ, దేశీయ సిగరెట్ల జీరో దందాపై ఇటీవల వాణిజ్యపన్నుల శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నిఘా పెంచడంతో మూడు ఏజెన్సీల్లో రూ. లక్షల విలువైన సిగరెట్ పాకె ట్లు లభించాయి. ప్రియా నావెల్టీస్, మహేష్ ట్రేడర్స్, పూజ ఏజెన్సీస్‌కు చెందిన గోడౌన్లలో వీటిని అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన సిగరెట్లపై పన్ను, అపరాధరుసుము కింద సుమారు రూ. 15 లక్షలు వసూలు చేసి.. నామమాత్రపు కేసులు నమోదు చేసి వదిలేశారు. ఈ సందర్భంగా ఓ గోడౌన్‌ను కూడా సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 20 శాతం వ్యాట్ చెల్లిస్తున్న బడా కంపెనీలు ఐటీసీతో పాటు ఇతర సిగరె ట్ కంపెనీలు ప్రతి సిగరెట్ విక్రయంపై ప్రభుత్వానికి 20 శాతం పన్ను రూపంలో చెల్లిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గుట్కాలను కేంద్రం నిషేధించడంతో వీటిపై వచ్చే పన్ను నిలిచిపోయింది. అయినా గుట్కాల అమ్మకాలు మాత్రం యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అక్రమంగా దిగుమతి అవుతున్న రూపాయి సిటరెట్ల వల్ల ప్రభుత్వానికి సిగరెట్లపై వచ్చే పన్ను ఆదాయం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. పన్ను చెల్లించే బడా కంపెనీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన వాణిజ్యపన్నుల శాఖ అధికారులు రూపాయి సిగరెట్ల గుట్టును రట్టు చేశారు.