breaking news
chinnu
-
‘లవ్ యూ రా’ కడుపుబ్బా నవ్వించేస్తుంది: హీరో చిన్ను
చిన్ను హీరోగా, గీతికా రతన్ హీరోయిన్గా సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలుగా రానున్న చిత్రం ‘లవ్ యూ రా’. ఈ మూవీకి ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ను సోమవారం (ఆగస్ట్ 18) నాడు నిర్వహించారు. ఈ క్రమంలో ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ అనే పాటలను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్లో..హీరో చిన్ను మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ నాకు మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ ప్రయాణంలో మా వెన్నంటే నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చారు. ‘లవ్ యూ రా’ ఆద్యంతం అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. గీతిక పాత్రకు ప్రాణం పోశారు. కృష్ణ సాయి కారెక్టర్ అందరినీ నవ్విస్తుంది. చంద్ర శేఖర్ గారి పాత్ర చాలా బాగా వచ్చింది. మా చిత్రంలో హారర్, కామెడీ, లవ్ ఇలా అన్ని అంశాలుంటాయి. ఈశ్వర్ గారు మాకు మంచి పాటలు ఇచ్చారు. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. మీడియా సపోర్ట్ ఉంటేనే మాలాంటి వాళ్లు ఆడియెన్స్ వరకు చేరుకుంటాం. మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.చంద్రశేఖర్ మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ చిత్రం సెప్టెంబర్ 5న రాబోతోంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. శ్రీనాథ్ గారు చెప్పినట్టుగా ఈ మూవీ వందకు రెండొందల శాతం సక్సెస్ అవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.హీరోయిన్ గీతిక మాట్లాడుతూ .. ‘‘లవ్ యూ రా’ టీం అంతా కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
భార్య సీమంతం వేడుకల్లో టాలీవుడ్ విలన్ (ఫొటోలు)
-
భవనం పై నుంచి కిందపడ్డ యువకుడు.. 10 గంటలు చీకట్లో నరకయాతన..
రాజన్న: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డ యువకుడు చీకట్లో ఎవరూ చూడకపోవడంతో దాదాపు 10 గంటలు నరకయాతన పడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన శాతాని లింగారెడ్డి కుమారుడు శాతాని చిన్ను(26) గురువారం రాత్రి భోజనం అనంతరం భవనంపైకి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. చీకటి కావడంతో ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లలేదు. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లే రైతులు గమనించి చిన్ను కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
కరెంటు షాక్‌తో యువకుడి మృతి
మాలియల్ : కరీంనగర్ జిల్లా మాలియల్ మండలం నూకపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామశివారులో ఉన్న ఓ వ్యవసాయ బావి వద్ద కూలీ పనులు చేస్తుండగా చిన్ను(23) అనే యువకుడు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.