breaking news
chenetha society
-
‘పదేళ్ల తర్వాత.. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభమా?’
హైదరాబాద్, సాక్షి: చేనేత కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టిందని.. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోవట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తాజాగా ఓ ఘాటు లేఖ రాశారాయాన. ‘‘నేతన్నలపై కాంగ్రెస్ కు ఎందుకింత కక్ష?. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా?. కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా??. పదేళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి’’ అని లేఖలో కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమను నమ్ముకున్నవాళ్ల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయని, నేతన్నలకు ఈ ప్రభుత్వం ఆర్డర్లు ఆపేసిందని ఆరోపించారు కేటీఆర్. చేనేత మిత్రా వంటి పథకాల్ని కాంగ్రెస్ సర్కార్ పక్కనపెట్టిందని ప్రస్తావించారాయన. ‘‘గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా అర్డర్లు వేంటనే ఇవ్వాలి. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ప్రస్తుతం అందుతున్న అన్నీ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలి, అవసరం అయితే మరింత సాయం చేయాలి. కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదు.. .. రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు అని లేఖలో కేటీఆర్ హెచ్చరించారు. -
పోచంపల్లి ఇక్కత్‌కళ ఎంతో అద్భుతం! : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
సాక్షి, యాదాద్రి: పోచంపల్లి ఇక్కత్‌కళ ఎంతో అద్భుతంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. బుధవారం ఆమె భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. మొదట ఆమె శ్రీరంజన్ సిల్క్ వీవ్స్ యూనిట్‌ను సందర్శించి దారం నుంచి వస్త్రం తయారయ్యే ప్రక్రియలను స్వయంగా పరిశీలించారు. కూకున్స్ నుంచి సింగిల్ యారన్ దారం తయారీ, దారాన్ని డబులింగ్, ట్విస్టింగ్, వార్పింగ్, వెప్టింగ్ చేసి చివరకు 2ప్లే దారాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు. పట్టుగూళ్ల నుంచి ముడి పట్టును తీసి, మేలు రకమైన పట్టుదారం తయారు చేయడం, దాని నుంచి పడుగు, పేకలను రూపొందించి రంగులద్ది, టై అండ్ డైలో డిజైన్లను రూపొందించడం, ఆసు యంత్రపై చిటికిపోసి పలు రకాల డిజైన్లతో చీరలు తయారు చేయడం తదితర విషయాలను శ్రీరంజన్ వీవ్స్ యజమాని ఎన్నం శివకుమార్ రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి స్పందిస్తూ.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో టస్సార్ సిల్క్‌ను వినియోగిస్తారని, కానీ మల్బరీ సిల్క్ నాణ్యత బాగుందని తన స్వరాష్ట్రమైన ఒడిశాలో కూడా మల్టీ హ్యాండ్లూమ్ యూనిట్లు నెలకొల్పేందుకు తన పర్యటన ఎంతో దోహదపడిందని అభిప్రాయపడ్డారు. థీమ్ పెవిలియన్‌లో పర్యటన.. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెవిలియన్ థీమ్‌లో చేనేతకు సంబంధించిన పలు వస్త్రాల తయారీపై చేనేత కళాకారులు రాష్ట్రపతికి వివరించారు. పుట్టపాకకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.. నూనెలో దారాన్ని నానబెట్టి ప్రాసెసింగ్ చేసి తేలియారుమాల్ వస్త్రాన్ని తయారు చేసే విధానాన్ని వివరించారు. తేలియా రుమాల్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించిందని చెప్పారు. భూదాన్‌పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీరలు, గద్వాల సిల్క్ చీరలు, వరంగల్ రామప్ప చీర, భూపాలపల్లి టస్సర్ చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరల గురించి చేనేత జౌళిశాఖ డీడీ అరుణ్‌కుమార్ వివరించారు. నారాయణపేట సిల్క్, కాటన్ చీరలు, వరంగల్ దుర్రీస్ తివాచీలు, 14వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగాబాద్‌లో నేసిన హిమ్రా చీరల (అప్పట్లో రాయల్ ఫ్యామిలీలకు బహుమతిగా ఇచ్చేవారు) గురించి జౌళిశాఖ డీడీ వెంకటేశం రాష్ట్రపతికి వివరించారు. ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు ఇక్కత్ వస్త్రాలు, గద్వాల చీరలు, గొల్లభామ చీరల కోసం ఏర్పాటు చేసిన స్టాల్‌ను రాష్ట్రపతి సందర్శించారు. చేనేత కళాకారులు ఆమెకు ఆయా వస్త్రాల తయారీ గురించి చెప్పారు. ఆన్లైన్ మార్కెటింగ్‌లో వస్త్రాల అమ్మకం గురించి సాయిని భరత్, ఎన్జీఓ సుధ రాష్ట్రపతికి వివరించారు. పడుగు, పేకల కోసం వినియోగించే 30 చరఖా (రాట్నం)లను మహిళలు తిప్పుతుండగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వాటిని పరిశీలించారు. చరఖా పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన మగ్గంపై నేత తీరును పరిశీలించారు. పద్మశ్రీ చింతకింది మల్లేషం రూపొందించిన ఆసు యంత్రాన్ని పరిశీలించి దాని పనితనాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్రీరంజన్ వీవ్స్ మల్టీ యూనిట్లో పనిచేస్తున్న చేనేత కార్మికుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఎన్ని సంవత్సరాలుగా మగ్గం పనిచేస్తున్నారని, ఈ వృత్తి వల్ల నెలకు ఎంత కూలి లభిస్తుందని అడిగి తెలుసుకున్నారు. ఒడిశా చేనేత కళాకారులను తాము మెహర్ అని పిలుచుకుంటున్నామని చెప్పారు. ఇక్కడి చేనేత కళాకారుల నేత నైపుణ్యం గొప్పగా ఉందని కొనియాడారు. అనంతరం చేనేత కార్మికులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా శ్రీరంజన్ వీవ్స్ యజమాని ఎన్నం శివకుమార్ దంపతులు రాష్ట్రపతికి సంబల్పురి డిజైన్ కలిగిన పోచంపల్లి ఇక్కత్ చీర, పోచంపల్లి డబుల్ ఇక్కత్ చీరను అందజేశారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సెక్రటరీ రచన సాహు, రాష్ట్ర చేనేత జౌళి శాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి, భువనగిరి కలెక్టర్ హనుమంత్ కె.జెండగే ఉన్నారు. పోచంపల్లిలో రెండు గంటలు గడిపిన రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్‌పోచంపల్లిలో రెండుగంటల పాటు గడిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక చాపర్‌లో పోచంపల్లికి చేరుకున్నారు. శ్రీరంజన్ వీవ్స్ యూనిట్లో 20 నిమిషాల పాటు వీవింగ్, ట్విస్టింగ్ ప్రక్రియలను పరిశీలించారు. 10.55 గంటలకు బాలాజీ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్‌ను సందర్శించారు. అనంతరం గాంఽధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చరఖా రూమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా భూదానోద్యమ పిత ఆచార్య వినోబాభావే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భూదానోద్యమ చరిత్ర ఫొటో గ్యాలరీని తిలకించారు. అక్కడి నుంచి 11.30 గంటలకు సభావేదిక వద్దకు చేరుకున్నారు. చేనేత కార్మికులచే సన్మానం పొందారు. 12.15 గంటలకు రాష్ట్రపతి చేనేత కార్మికులనుద్దేశించి పది నిమిషాలు మాట్లాడారు. అనంతరం 12.30 గంటలకు హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. 12.40 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఇవి కూడా చదవండి: ఎన్నికల సంఘం కసరత్తులో.. సమరానికి ఇంకొంత సమయం! -
మరో 10 క్లస్టర్లివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో చేనేత రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇప్పటికే మంజూరు చేసిన హ్యాండ్లూమ్ క్లస్టర్లకు అదనంగా మరో 10 కొత్త వాటిని మంజూరు చేయాలని కేంద్ర జౌళి మంత్రి స్మృతీ ఇరానీని రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు కోరారు. మంగళవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసిన కేటీఆర్ చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇప్పటికే రూ.1,200 కోట్ల బడ్జెట్‌తో నేతన్నకు చేయూత, చేనేత మిత్ర లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇప్పటికే మంజూరు చేసిన హ్యాండ్లూమ్ క్లస్టర్లకు అదనంగా మరో 10 క్లస్టర్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి జౌళి శాఖ సంయుక్త కార్యదర్శితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు కేటీఆర్ మీడియాకు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 8 వేల పవర్‌లూమ్స్‌ను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటోందని, దీనికయ్యే ఖర్చులో కేంద్రం నుంచి రావాల్సిన సగం వాటా నిధుల విడుదల ఆలస్యం కావడంతో పనులు జరగడం లేదని వివరించారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరానన్నారు. ఈ నిధుల విడుదలపై ముంబైలోని జౌళి శాఖ కమిషనర్‌తో కేంద్ర మంత్రి మాట్లాడినట్లు వివరించారు. -
రూ.500 కోట్లతో వీవర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
చేనేత కులాల సమాఖ్య డిమాండ్ కాకినాడ సిటీ : చేనేత వర్గాలను ఆదుకునేవిధంగా రూ.500 కోట్లతో వీవర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చేనేత కులాల సమాఖ్య డిమాండ్ చేసింది. శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చేనేత కులాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పంపన రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో చేనేత రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదన్నారు. సొసైటీ క్యాష్ క్రెడిట్స్ రూ.34 కోట్లు పూర్తిగా మాఫీ చేయాలని, ఆప్కో బకాయిలు రూ.40 కోట్లు వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డులు చేనేత కార్మికులకు అమలు చేయాలని, చేనేత కార్మికులకు ప్రత్యేకంగా గృహ నిర్మాణ పథకాన్ని చేనేత ఔళిశాఖ ద్వారా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా చేనేత సొసైటీ అధ్యక్షుడు చింతకింద రామారావు, కో–ఆపరేటివ్ సెంట్రల్‌బ్యాంక్ డైరెక్టర్ పేరిశెట్టి లాలయ్య, చేనేత సంఘ నాయకులు దుర్గారమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.