breaking news
Bio Park
-
నెల్లిమర్లలో ‘బయోపార్క్’
చుట్టూ పచ్చదనం పరచుకునే వనాలు... గుబురుగా పెరిగే చెట్లు... ప్రకృతి సిద్ధమైన సౌందర్యం... ఆహ్లాదాన్ని పంచే వాతావరణం... రకరకాల పక్షుల కిలకిలారావాలు... అందులోనే విహారానికి అనువైన ఏర్పాట్లు... పర్వతారోహకులను ప్రోత్సహించే సౌకర్యాలు... ఇవన్నీ ఒకే చోట ఉంటే అది ఇలలో వెలసిన స్వర్గం అంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి ప్రాంతాన్నే జిల్లాలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు నెల్లిమర్ల ప్రాంతాన్ని అటవీశాఖాధికారులు ఎంపిక చేశారు. ఇదే పూర్తయితే పర్యాటకంగా ఈ ప్రాంతానికి ఓ గుర్తింపు లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నెల్లిమర్ల : పచ్చనైన వనం మధ్యన పిల్ల లకు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. అడవి మధ్యలో ఆటలాడుకునేందుకు పార్కులు, కొండలెక్కేందుకు ట్రెక్కింగ్, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు నెల్లిమర్ల పరిధిలోని సారిపల్లి సెంట్రల్ నర్సరీలో బయోపార్క్ ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాని కోసం అటవీశాఖ అధికారులు 10హెక్టార్లు కే టాయించారు. అంతేగాకుండా ఆ పార్కులో వివిధ పనులు చేపట్టేందు కు మొదటి విడతగా ప్రభుత్వం తాజాగా రూ కోటి కేటాయించింది. నగరవనం స్థానే బయోపార్కు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ నగరవనాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచించిన సంగతి తెలిసిందే. అడవులు అంతరించిపోతున్న నేపథ్యంలో నగరాలకు సమీపంలో ఎక్కువ విస్థీర్ణంలో మొక్కలను పెంచాలన్నది దాని లక్ష్యం. అంతేగాకుండా అదే నగరవనంలో అన్నివర్గాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా అవసరమయ్యే పార్క్‌లు, ట్రాక్‌లు ఏర్పాటుచేయాలని పేర్కొంది. విజయనగరంలో మాత్రం ఇంతవరకు నగరవనం ఏర్పాటుకాలేదు. దాని స్థానంలో ‘బయోపార్క్’ ఏర్పాటుచేయాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. సారిపల్లి సెంట్రల్ నర్సరీలో ఏర్పాట్లు జిల్లాకు తాజాగా వచ్చిన ఆ శాఖ పీసీసీఎఫ్(రాష్ట్ర ప్రధాన అటవీశాఖ అధికారి) ఈ మేరకు బయోపార్క్ వెంటనే ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు విజయనగరం–నెల్లిమర్ల ప్రధాన రహదారినుంచి సారిపల్లి గ్రామానికి వెళ్లేదారిలో ఉన్న ‘సారిపల్లి సెంట్రల్ నర్సరీ’లో బయో పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో వనాల ప్రాధాన్యాన్ని వివరించేందుకు ‘వనవిజ్ఞాన కేంద్రం’ నెలకొల్పుతున్నారు. ఈ కేంద్రంలో వివిధరకాల మొక్కలు, వాటి ప్రాధాన్యతను వివరిస్తారు. అలాగే చిన్నపిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్ పార్క్, ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా సెంటర్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేస్తారు. సమీపంలోనున్న కొండను ఎక్కేందుకు ట్రెక్కింగ్ సౌకర్యం కల్పిస్తారు. అంతేగాకుండా వివిధరకాల ఔషధ మొక్కలతో రాశివనం, నక్షత్రవనం తదితరాలను ఏర్పాటుచేస్తున్నారు. అలాగే అటవీ ఉత్పత్తులతో కూడిన క్యాంటీన్, ప్రదర్శనలు ఉంటాయి. ఇప్పటికే సారిపల్లి సెంట్రల్ నర్సరీలో బయోపార్క్ పనులు ప్రారంభమయ్యాయి. క్యాంటీన్, వన ఉత్పత్తుల ప్రదర్శనలకు సంబంధించిన భవనాల నిర్మాణం పూర్తయ్యింది. నక్షత్రవనం, రాశివనాల ఏర్పాటు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. చురుగ్గా బయోపార్కు పనులు వనాల ప్రాముఖ్యాన్ని వివరించేందుకు, వనాల్లో అన్నివర్గాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు బయోపార్క్ ఏర్పాటు చేస్తున్నాం. సారిపల్లి సెంట్రల్ నర్సరీలో 10 హెక్టార్లలో పార్క్ ఏర్పాటవుతోంది. ఆ పార్క్‌లో వనవిజ్ఞాన కేంద్రం, చిల్డ్రన్స్ పా ర్క్, యోగాకేంద్రం, ట్రెక్కింగ్ తదితరాలను ఏర్పాటు చేస్తున్నాం. మొదటి విడతగా మంజూరైన రూ కోటితో ఆ పనులు ప్రస్థుతం చురుగ్గా జరుగుతున్నాయి. – గంపా లక్ష్మణ్, డీఎఫ్ఓ, విజయనగరం -
బయో పార్క్‌కు మంత్రి శంకుస్థాపన
యాదగిరి, న్యూస్‌లైన్ : భవిష్యత్తులో ఇంధన కొరతను అధిగమించేందుకు జైవిక ఇంధనం ఉత్పాదనకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసిందని, అందుకు జిల్లాలోని తింథణి గ్రామం వద్ద 42 ఎకరాలు కొండ ప్రాంతాన్ని తీసుకుని రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్ణాటక రాష్ట్ర జైవిక అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో రూ. 6 కోట్ల వ్యయంతో బయో ఉద్యానవాన్ని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ్.ఆంజనేయ పేర్కొన్నారు. ఆయన సోమవారం యాదగిరి జిల్లా తింథణి వద్ద బయో పార్క్‌కు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ పార్క్ నిర్మాణం కోసం ప్రస్తుతం రూ.92 లక్షలు కేటాయించామని, మార్చి నెలాఖరులోగా మరో రూ.20 లక్షలు సమకూర్చుతామన్నారు. హైదరాబాద్-కర్ణాటకలోనే ఇది అతి పెద్ద పార్క్ అన్నారు. ఇప్పటికే వేప, జత్రోపా తదితర మొక్కలు నాటారని, వచ్చే ఐదేళ్లలో ఈ మొక్కల ద్వారా ప్రతి రోజూ 100 లీటర్ల ఇంధనం తయారు చేస్తారన్నారు. విధానసౌధలోని గది గోడను పగులగొట్టమని తాను ఏ అధికారికి సూచించలేదని, అయితే గది గోడను పగులగొట్టడం వల్ల విధానసౌధ పునాదులకు ఎలాంటి ప్రమాదం లేదని, గోడ పగులగొట్టడం తప్పేమీ కాదన్నారు. జిల్లాలోని అనేక సాంఘిక సంక్షేమ శాఖ వసతి నిలయాలకు సొంత భవనాలు లేక అద్దె గదుల్లో నడిపిస్తున్నారని, అందువల్ల జిల్లా కేంద్రంలో అన్ని వసతి నిలయాలను ఒకే చోట నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామని, ఇందుకు రూ.8 కోట్లు అవసరమవుతాయన్నారు. భవన నిర్మాణాలకు 10 ఎకరాల భూమిని కూడా అవసరముందని తెలిపారు. త్వరలో సిబ్బంది నియామకం : సాంఘిక సంక్షేమ శాఖ వసతి నిలయాల్లో సిబ్బంది కొరత ఉండటంతో పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని, త్వరలో సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాబురావ్ చించనసూరు, దేవదుర్గ ఎమ్మెల్యే వెంక టేశ్ నాయక్, ఏహెచ్.హొన్నప్ప, జిల్లాధికారి ఎఫ్ఆర్.జమాదార తదితరులు పాల్గొన్నారు.