breaking news
bike - lorry collisioned
-
ఘోర రోడ్డుప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు బీటీపీఎస్ ప్లాంట్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి కుమార్తె, కొడుకుతో కలిసి ఓ తండ్రి బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తండ్రి, కొడుకు ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, కూతురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యమంలో మరణించింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బైకు, లారీ ఢీ: ఒకరి మృతి
సండేపల్లి(వైఎస్సార్ జిల్లా): వేగంగా వెళ్తున్న బైకు ను ఓ లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా సండేపల్లి మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని కర్నూలు - చిత్తూరు రహదారిపై దేవపట్ల వద్ద బైకును లారీ ఢీకొట్టింది. దీంతో బైకు పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు.. పుత్తూరు రామంజిగా పోలీసులు నిర్ధరించారు.