breaking news
bike burnt case
-
బైక్ ఇవ్వనందుకు తగులబెట్టాడు
హిమాయత్‌నగర్: మద్యం తెచ్చుకోవాలి బైక్ ఇవ్వు అని అడగ్గా...నిరాకరించినందుకు బైకునే తగులబెట్టాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. హిమాయత్‌నగర్ స్ట్రీట్ –? లో నివాసముండే ఆనంద్, వినీత్‌లు అర్ధరాత్రి మద్యం తెచ్చుకోడానికి ఇదే ప్రాంతానికి చెందిన అవినాష్‌రెడ్డిని బైక్ అడిగారు. నా బైక్ లో పెట్రోల్ లేదు ఇవ్వడం కష్టం అంటూ అవినాష్‌రెడ్డి బదులిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆనంద్...అవినాష్‌రెడ్డి బైక్‌ను పార్క్ చేసిన ప్రాంతానికి వెళ్లి దానికి నిప్పంటించాడు. అనంతరం ఏమి తెలియనట్లు నటించి బైక్ కాలిపోతోందంటూ అందర్నీ నమ్మించాడు. దీనిపై ఆందోళనకు గురైన అవినాష్‌రెడ్డి డయల్–???కి ఫోన్‌కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న అబిడ్స్ ఏసీపీ భిక్షం రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మంగళవారం ఆనంద్, వినీత్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
నిందితుడికి ఏడాది జైలు శిక్ష
గుంతకల్లు టౌన్ : రాత్రి వేళల్లో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైక్‌లకు నిప్పు పెట్టిన కేసులో కేరళకు చెందిన జాన్సన్ పౌల్ అనే నిందితుడికి ఏడాది పాటు జైలుశిక్షతో పాటు రూ.100 జరిమానా విధిస్తూ గుంతకల్లు జేఎఫ్‌సీఎం వాసుదేవరావు గురువారం తీర్పునిచ్చారని పోలీసులు తెలిపారు. గుంతకల్లు భాగ్యనగర్‌లో గత ఏడాది నవంబర్ 7న పార్కింగ్ చేసిన బైక్‌లను తగులబెట్టిన కేసులో అతనిపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ జడ్జి పై విధంగా తీర్చుచెప్పారన్నారు.