breaking news
big laddu
-
హైదరాబాద్ నుంచి అయోధ్యకు 1265 కిలోల లడ్డు..!
-
లడ్డూ కావాలా ..గణనాథా!
వినాయక చవితి ... ప్రకృతితో అనుబంధం ... పండ్లు, పత్రాలు, తోరణాలే గుర్తుకు వస్తాయి... పిండి వంటల్లోకి వస్తే ఉండ్రాళ్లు. ఇదంతా గతం. నేటితరం గణనాథులు కొంగొత్త అవతారాల్లో సాక్షాత్కరిస్తున్నారు. ఆ అలంకరణలకు అనుగుణంగా హైటెక్ పూజలు అందుకుంటున్నాడు ఆ పార్వతీ పుత్రుడు. విగ్రహం ఎత్తులోనే కాదు పెట్టే ప్రసాదంలోనూ పోటాపోటీయే. ఉండ్రాళ్ల స్థానంలో లడ్డూలు ప్రత్యక్షమయ్యాయి. ‘ఇంతింతై వటుడింతై..’ చందంగా కొండంతై ప్రపంచ రికార్డుల కోసం పరుగులు తీస్తున్నాయి. ఇందుకు జిల్లాలోని మండపేట మండలం తాపేశ్వరం కొన్నేళ్లుగా వేదికవుతోంది. ఇక్కడి ప్రముఖ స్వీట్ సంస్థలు ‘దీక్షా’దక్షతలతో సృష్టిస్తున్న మహాలడ్డూలు భక్తులకు కను‘విందు’ చేస్తున్నాయి. -
గిన్నిస్ రికార్డు కోసం 13 టన్నుల మహాలడ్డు
తాపేశ్వరం (మండపేట) : మహా లడ్డూల తయారీతో ఐదుసార్లు గిన్నిస్ రికార్డులు సాధించిన తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీట్స్ సంస్థ మరోసారి రికార్డు సాధించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది వినాయక చవితి వేడుకల సందర్భంగా 13,000 కేజీలకు పైగా భారీ లడ్డూ తయారు చేయనున్నట్టు సంస్థ అధినేత సలాది శ్రీనుబాబు శుక్రవారం విలేకరులకు తెలిపారు. తమ సంస్థ మహా లడ్డూల తయారీలో 2011 నుంచి వరుసగా ఐదుసార్లు గిన్నిస్ రికార్డులు నెలకొల్పిందన్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా లడ్డూల తయారీలో తమ సంస్థ ఇప్పటికే 72 జాతీయ, అంతర్జాతీయ రికార్డులను సాధించిందన్నారు. పాత రికార్డులను తిరగరాసే విధంగా ఈ ఏడాది 13 టన్నులకుపైగా లడ్డూను తయారు చేస్తున్నట్టు చెప్పారు. విజయవాడలోని డూండీ గణేష్ కమిటీకి 8,500 కేజీల లడ్డూతోపాటు అక్కడ ప్రతిషి్ఠంచే వినాయకుని చేతిలో ఉంచేందుకు మరో వెయ్యి కేజీల లడ్డూను కానుకగా అందజేయనున్నట్టు తెలిపారు. లడ్డూల తయారీ కోసం 13 మంది సిబ్బంది గణేష్ మాలలు ధరించి బూందీ తీయడంతోపాటు డ్రైఫ్రూట్స్ను సిద్ధం చేస్తున్నారన్నారు.