breaking news
Bhoothnath Retunrs
-
భూత్నాథ్ మళ్లీ వచ్చాడు
-
భూత్నాథ్ మళ్లీ వచ్చాడు!!
టీ-సిరీస్ సమర్పణలో గుల్షన్ కుమార్, బీసీ చోప్రా కలిసి తీసిన భూత్నాథ్ రిటర్న్స్ చిత్రం థియేటర్ ట్రయల్ విడుదలైంది. భూత్ నాథ్ చిత్రంతో పిల్లలు, పెద్దలు.. అందరినీ ఆకట్టుకున్న అమితాబ్ బచ్చన్, ఇప్పుడు దాని సీక్వెల్‌తో మళ్లీ అభిమానుల ముందుకు వచ్చారు. ఏడు పదుల వయసు దాటినా ఇప్పటికీ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని డాన్సులు చేసి నిరూపించుకున్నారు. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకోడానికి తొందరలోనే వచ్చేస్తోంది. ఈలోపు రెండున్నర నిమిషాల పాటు వచ్చిన థియేటర్ ట్రయల్ చూసి ఆనందిచండి.