breaking news
bhagavad gita winner
-
భగవద్గీత పఠనంలో గోల్డ్ మెడల్..!
ఆమె ఓ సాధారణ గృహిణి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన సబ్జెక్టులో ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే లక్ష్యాన్ని చేరుకోడానికి ఆమె రేయింబవళ్లు శ్రమించారు. అందుకు తగిన ఫలితాన్ని కూడా అందుకున్నారు. ఆమెనే జ్యోతి చాగంటి. మైసూర్‌లోని శ్రీగణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో అవధూత దత్తపీఠం ప్రతి యేటా నిర్వహించే భగవద్గీత పారాయణ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే జ్యోతి బంగారు పతకాన్ని సాధించారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 701 శ్లోకాలను నిర్విరామంగా పారాయణం చేశారు. రెండు రోజుల క్రితం దుండిగల్‌లోని దత్త ఆశ్రమంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామి నుంచి గోల్డ్‌మెడల్‌తో పాటు సర్టిఫికెట్‌ను అందుకున్నారు. సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆమె నిరూపించారు. హైదరాబాద్ ఫిలింనగర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తనకు లభించిన గుర్తింపు గురించి మాట్లాడారు. ఎనిమిది నెలలు శ్రమించా.. గత ఎనిమిది నెలలుగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో దీనిని అభ్యసించా. మొదటి ప్రయత్నంలోనే గీత పఠనంలో గోల్డ్ మెడల్ సాధించా. జ్యోతి గీత మకరందం గ్రూప్‌లో టి.నాగలక్ష్మి, ఇతరుల నేతృత్వంలో తాత్విక అంశాలను విస్తృతంగా అధ్యయనం చేశాం. ఈ గ్రూపులోని గురువులు విద్యార్థులకు సరైన ఉచ్ఛారణను నేరి్పంచారు. 8 నెలలుగా రోజుకు 7 గంటల పాటు సాధన చేశా. పరీక్షలో పాల్గొనడం అద్భుత అనుభవం. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తదుపరి విద్యార్థులకు గీతను బోధిస్తాను. (చదవండి: మరణ భయాన్ని తొలగించే ధర్మరాజ దశమి!!) -
ఇండియన్ మలాలా... మరియం సిద్ధిఖీ..!
ఆమె ప్రస్తుతం నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలాను తలపిస్తోంది. పేద బాలికల అభ్యున్నతే ధ్యేయంగా... వారికి విద్య సులభతరం చేయాలన్నదే ఆశయంగా ముందుకు సాగుతోంది. పలు పోటీల్లో పాల్గొని గెలిచి, అలా వచ్చిన నగదును పేద విద్యార్థులకు విరాళంగా అందిస్తోంది. ఇటీవల ఇస్కాన్ నిర్వహించిన భగవద్గీత పోటీల్లో అగ్రస్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరచిన ముస్లిం బాలిక మరియం సిద్ధిఖీ.. చిన్న వయసులోనే తన ప్రతిభను ప్రదర్శించడంతోపాటు ఆమె దాతృత్వాన్ని, సేవా దృక్పథాన్ని చాటుతోంది. మహారాష్ట్రలోని 195 పాఠశాలల నుంచి 4వేల మంది విద్యార్థులు పాల్గొన్న పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకొని, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర సంస్థల నుంచే కాక దేశం నలుమూలల నుంచి పలువురి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తనకు బహుమతిగా వచ్చిన డబ్బును సిద్ధిఖీ... పేద బాలికల విద్యకోసం విరాళంగా ఇచ్చింది. ప్రభుత్వం పేద బాలికలకు మెరుగైన విద్య అందించేందుకు ఏర్పాటుచేసిన పథకాల ద్వారా తన బహుమతి నగదును కూడా వారికి వినియోగించాలని మరియం సిద్ధిఖీ అభ్యర్థించింది. గుజరాత్ ముఖ్యమంత్రి అనందిబెన్ పటేల్, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌లు సిద్ధిఖీని సత్కరిస్తున్న సమయంలో ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించింది. ముంబై మహానగరం థానేలోని మీరారోడ్ వద్ద నివసించే ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మరియం సిద్ధిఖీ తండ్రి పేరు ఆసిఫ్ సిద్ధిఖీ. ఓ హిందీ పత్రికలో ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ''మేము ఆర్థికంగా వెనుకబడ్డవారమే అయినా... మా అమ్మాయి పేద బాలల అభ్యున్నతి కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే తన బహుమతి నగదును పేదవిద్యార్థులకు వినియోగించేందుకు విరాళంగా ఇచ్చేసింది'' అని సిద్ధిఖీ తండ్రి అసిఫ్ చెబుతున్నారు. ఆమె త్వరలో మధ్యప్రదేశ్ సీఎంను కూడా కలసి తన ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. తాను చదివిన మీరారోడ్ లోని కాస్మోపాలిటన్ హైస్కూల్‌తో పాటు కొన్ని ప్రదేశాల్లో పర్యటించి, పేద విద్యార్థులకు స్వీట్లు, పండ్లు, డబ్బును పంచారు.