breaking news
best awards in work
-
పోలీస్ అయితే పెళ్లి సంబంధాలు రావన్నారు..
పోలీసు కుటుంబంలో జన్మించారు సుప్రజ. విధి నిర్వహణలో తన తాత, తండ్రి ఎదుర్కొన్న కష్టాలను చూసి కూడా భయపడలేదు. ఆడపిల్ల పెద్ద చదువులు చదివితే, అందులోనూ పోలీసు అయితే పెళ్లి సంబంధాలు రావని ఎవరెంతగా నిరుత్సాహపరిచినా లక్ష్య పెట్టకుండా కష్టపడి చదివారు. 2015లో గ్రూప్–1 అధికారిగా విధుల్లో చేరారు. చేరిన తొలి రోజు నుంచే సామాన్యులకు రక్షణగా నిలిచారు. ఏడు నెలల వ్యవధిలో 74 మందిపై రౌడీషీట్లు తెరిచి నేరస్థులకు సింహస్వప్నంగా నిలిచారు. ఉత్తమ పిసిఆర్ అవార్డు విజేత అయ్యారు. కడప జిల్లా నందలూరుకు చెందిన కోర్లకుంట సుప్రజ.. గర్భిణిగా ఉండి కూడా కరోనాకు వెరవకుండా సుప్రజాసేవ నిర్వహించినందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ నవాంగ్ నుంచి ఉత్తమ డీఎస్పీగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ► మీ విధి నిర్వహణలోని సవాళ్లు, ఒత్తిళ్లు ఎలాంటివి? రెండు ఘటనల గురించి చెబుతాను. కర్నూలు జిల్లాలో పనిచేసేటప్పుడు గ్రామ సర్పంచ్ తన భార్య తప్పిపోయిందని ఫిర్యాదు చేశాడు. నాకెందుకో అతని మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేయించాను. అతనికున్న రాజకీయ పలుకు బడితో అధికారులు, నాయకులు నాపై వత్తిడి తెచ్చినప్పటికీ, అతని నేరాలను నిరూపించి అరెస్టు చేశాము. గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహించేటప్పుడు నా కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న ఓ కాల్‌మనీ మోసగాడిని అరెస్టు చేసి అతడి దగ్గర నుంచి 40 లక్షలు రికవరీ చేసాను. అప్పుడు అనేక వత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ► ట్రైనింగ్ సమయంలోని ఫిజికల్ ట్రైనింగ్ విధి నిర్వహణలో ఉపయోగపడిందంటారా? అవును. గుంటూరు ఈస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఐదు నెలల గర్భిణిని. పెద్ద మొత్తంలో గంజాయి రవాణా జరుగుతున్న బస్సు గుంటూరు దాటి వెళ్లిపోతోందని విన్నాను. వాహనంలో వేగంగా ఛేజింగ్ చేసి బస్సు ఆపించి, కిటికీలో నుంచి దూకి పారిపోతున్న నిందితులను వెంటాడి పట్టుకున్నాము. నలభై కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. కర్నూలు జిల్లాలో అడవుల్లో పలు నక్సలైట్ డంప్‌లు స్వాధీనం చేసుకునే సమయంలోనూ కొన్ని సాహసాలు చేయాల్సి వచ్చింది. ► మహిళగా మహిళలకు జరిగే అన్యాయాలపై మీ స్పందన ఎలా ఉంటుంది? జాప్యం అయితే జరగదు. నా ప్రసవం అనంతరం ఓ రాత్రి పదిన్నర సమయంలో కార్యాలయంలో ఉండగా ‘బాబు పాల కోసం ఏడుస్తున్నాడు (బాబుకు నా పాలే ఫీడ్ చేస్తాను). వెంటనే రమ్మని’ అమ్మ ఫోన్ చే యడంతో బయటకు వచ్చాను. ఓ యువతి ఏడుస్తూ వాకిట్లో కనిపించింది. లోపలకు పిలిచాను. భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింట్లో ఉన్నానని, అయినా నిఘా పెట్టి వేధిస్తున్నాడని ఆమె చెప్పడంతో లోతుగా విచారణ జరిపి ఆమె భర్తను అరెస్ట్ చేశాం. అలాగే ఓ 80 సంవత్సరాల వృద్ధుడు ఒకటిన్నర సంవత్సరాల బాలికపై దారుణంగా లైంగిక దాడి చేసిన ఘటనలో అతడిని అరెస్టు చేశాము. దిశా పోలీస్టేషన్ డిఎస్పీగా పలువురు మహిళలకు అండగా నిలబడ్డ సంఘటనలు కూడా అనేకం సంతృప్తినిచ్చాయి. ► లాక్డౌన్ సమయంలో గర్భిణి అయి ఉండీ మీరు విధులు నిర్వహించిన విషయాన్ని డిపార్ట్మెంట్లో గొప్పగా చెబుతుంటారు! (నవ్వుతూ..) ఆ సమయంలో గర్భిణిగా ఉండడంతోపాటు ఇంట్లో రెండు సంవత్సరాల కుమార్తె ఉన్నా ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలోనూ పని చేశాను. ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ వార్డులు, అనాథల షెల్టర్ ల ఏర్పాట్ల పర్యవేక్షణ, నిర్వహణ నా దేశానికి చేసిన సేవగా భావిస్తున్నాను. ఇక నేను నా విధులను సక్రమంగా నిర్వర్తించగలుగుతున్నానంటే అదంతా నా భర్త ఐఆర్ఎస్ ప్రేమ్‌కుమార్, కుటుంబ సభ్యుల సహకారం వల్లనే అన్నది నిజం. డీజీపి గౌతమ్ సవాంగ్ నుండి పిసిఆర్ అవార్డు అందుకుంటున్న డిఎస్పీ సుప్రజ తల్లి , తండ్రి, భర్తతో సుప్రజ – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ -
ఉత్తమ సేవలకు పురస్కారాలు
కాకినాడ సిటీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉత్తమ సేవా పురస్కారాలను అందుకున్నారు. కాకినాడలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో సోమవారం జరిగిన స్వాతంత్య్రదిన వేడుకల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సేవా పురస్కారాల ప్రశంసాపత్రాలను 232 మందికి అందజేశారు. కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎస్పీ రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పురస్కారాలు అందుకున్న వారు వీరే... జిల్లాలోని విలీనమండలాల్లో చింతూరు ప్రాంతానికి చెందిన దూబి భద్రయ్య ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి జిల్లాకు పేరుతీసుకురావడంతో అతనిని అభినందించి ఉత్తమ పురస్కార అవార్డును అందజేశారు. రెవెన్యూ శాఖ: వీఆర్వోలు జి.రామకృష్ణమూర్తి, ఏవీఎస్వీ ప్రసాద్‌చౌదరి, ఎస్.గణేష్‌కుమార్, వి.సత్యప్రసాద్, ఏవీఎస్ రాజేష్, వీవీ సుబ్బారావు, వీకేడీ మహాలక్ష్మి, బి.సూర్యప్రకాష్, పి.నాగేశ్వరరావు, జి.రాంబాబు, కె.సుగుణ. ఎం.రామాయమ్మ, బి.విజయదుర్గ, కె.నాగరాజు, కె.చంద్రశేఖర్, పీఎస్ఎస్ఎన్ ప్రసాద్, ఎన్బీఎన్వీఎల్ ప్రసాదరావు, కె.నాగేశ్వరరావు, డి.అబ్బులు, వీవీవీ సత్యనారాయణ, జె.మాధవస్వామి, ఎం.సూర్యకుమారి, వీఆర్ఏలు జె.లక్ష్మీదుర్గ, ఎన్.వెంకట్రావు, ఎం.మణిరాజు, జి.నారాయణరావు, జె.రమేష్‌కుమార్, కె.లోవమూర్తి, ఎస్.దుర్గారెడ్డి, డి.శంకర్, బి.శిరీష, కె.రామిరెడ్డి. ఎం.శ్రీనివాస్, డి.శివకృష్ణ. పోలీసుశాఖ: డీఎస్పీలు ఎస్.వెంకటేశ్వరరావు(కాకినాడ), డి.రామకృష్ణ, జె.కులశేఖర్(రాజమహేంద్రవరం). సీఐలు పీవీ రమణ, ఎస్పీ వీరయ్యగౌడ్. ఎస్సైలు ఎం.జానకి రామ్, హెచ్.నాగరాజు, వి.పెద్దిరాజు, తాజుల్లా రెహ్మాన్, ఎస్.శివప్రసాద్. ఏఎస్సైలు కె.లక్ష్మీనారాయణ, పి.సత్యనారాయణ, ఇ.నాగరాజు, పీవీ సూర్యనారాయణమూర్తి, సీహెచ్‌వీ నాగేశ్వరరావు. ఆర్ఎస్సైలు ఎం.సురేష్, కేవీవీఎస్‌వీ ప్రసాద్. హెడ్‌కానిస్టేబుళ్లు పి.వెంకటేశ్వరరావు, కె.రంగబాబు, పి.సత్యనారాయణ, ఎస్.నరసింహరావు, ఎస్.శ్రీనుబాబు, బి.శ్రీను, పి.సత్యనారాయణ, కె.శ్రీనివాసరావు, జి.సంపదకుమార్, ఎంకే దొర, బి.సత్యనారాయణ, కె.సురేష్‌కుమార్, ఎస్ఎన్ వలి, ఎస్. వెంకటరమణ, సూర్యనారాయణ, కె.సింహాచలం. కానిస్టేబుళ్లు ఎ.శ్రీనివాసరావు, పీబీ రాంబాబు, ఎన్.సత్యనారాయణ, బి.ఉపేంద్ర, ఎ.వీరబాబు, సీహెచ్ ఏసుకుమార్, డి.పెద్దబ్బాయి, ఎస్.రమేష్, కె.లలిత, ఎన్ఎస్ నారాయణ, వీవీవీ కామేశ్వరరావు, కె.శివప్రసాద్, జి.నరసింహరావు, జీఎస్సీ బోస్, ఎస్బీహెచ్ రాజు, టీవీడీ ప్రసాద్, కె.లోవరాజు, బీవీ గిరి, టి.నాగార్జున, ఎం.అప్పారావు, కేవీఎల్ రావు, టి.త్రిమూర్తులు, బి.రవికిరణ్, వి.సురేష్‌బాబు, ఎస్.బాలగంగాధర్. ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు సీహెచ్ అచ్యుతకుమార్, పి.రాజ్‌కుమార్. ఏఆర్ కానిస్టేబుళ్లు సీహెచ్ వెంకటరమణ, వి.శ్రీనివాస్, ఎంవీ నాగసాయి. విద్యుత్‌శాఖ : లైన్ ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ, లైన్మెన్లు జి.చెల్లారావు, ఎస్.సత్యనారాయణ, అసిస్టెంట్ లైన్మెన్ కేఎస్ సూర్యభాస్కరరావు, జూనియర్లైన్మెన్ ఎండీ అమీదుల్లాసాహెబ్. వ్యవసాయశాఖ: ఏఈఓలు జేఎంవీవీ మనోహర్కృష్ణ, పీవీ శ్రీనివాస్, ఎం.గాంధీ, ఎంపీఈఓలు బి.శ్రీరామ్, పి.రాజేష్, పి.చిట్టిబాబు, పశుసంవర్థకశాఖ : ఆఫీస్ సబార్డినేట్ పి.పల్లంరాజు, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ కేవీ రామారావు. బ్యాంకర్లు: బీహెచ్ఎస్వీఎస్ భాస్కరరాజు (డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్), పి.భాస్కరరావు (లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కాకినాడ డీజీఎం), రెడ్డి వెంకటకృష్ణారావు ( బ్రాంచ్‌మేనేజర్ జి.రాగంపేట), డీఎస్ఆర్ సాయిబాబా (ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ), జి.వసంతకుమారి (బ్రాంచ్ మేనేజర్, సీజీజీబీ, వల్లూరు), ఎంసీవీ సుబ్బారావు (బ్రాంచ్ మేనేజర్, ఎస్బీహెచ్ అయినవిల్లి). ప్రణాళికశాఖ: ఏఎస్ఓలు డి.గాయత్రిదేవి, పి.ఎం.బి. ప్రసాద్. జిల్లా నీటి యాజమాన్యసంస్థ : ఫీల్డ్ లెవెల్ అసిస్టెంట్లు ఎం.ఆదిశేషు, కె.సూరిబాబు, సీహెచ్ వెంకటరమణ, జి.సత్తిబాబు. సీనియర్మేక్లు ఎస్.రామస్వామి, బి.సూర్యనారాయణ, కె.వరప్రసాద్. అగ్నిమాపకశాఖ: ఫైర్మెన్లు ఐవీ సుబ్రహ్మణ్యం, జి.దుర్గాప్రసాద్, ఎన్.కృష్ణంరాజు (డ్రైవర్ ఆపరేటర్), లీడింగ్ ఫైర్మెన్లు ఎం.సత్యనారాయణ, కేఎస్ఎం మూర్తి. అటవీశాఖ: ఎఫ్‌బీఓలు పి.శ్యామ్‌కుమార్, ఎస్.అరుణ, కె.ధనుంజయరావు. ఐసీడీఎస్: అంగన్వాడీ వర్కర్లు ఎంజీ పార్వతి, డీకే నాగేశ్వరి, ఆర్.కనకదుర్గ, హెల్పర్లు వి.సీతామహాలక్ష్మి, వై.సత్యవతి, ఎం.కొండమ్మ. ఆరోగ్యశాఖ: హెడ్‌నర్సు ఎస్.హారతి, స్టాఫ్‌నర్సు కె.మంజుల, భాగ్యలక్ష్మి, ఎంఎన్ఓ సీహెచ్ కల్లిరావు, ఎంపీహెచ్ఏ (ఎఫ్) పి.ఉత్తర, సీతమ్మ, ఎస్.మాధురి, పి.వెంకటలక్ష్మి, ఆశ వర్కర్లు వై.బేబి, గనికమ్మ. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్: కానిస్టేబుళ్లు ఎస్ఎన్వీ సతీష్, కె.సత్యనారాయణ, ఎన్.రామకృష్ణ. ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుళ్లు వి.ఆదిత్య. విజిలెన్స్ హెడ్‌కానిస్టేబుల్ సీహెచ్ రామారావు.