breaking news
Badaun gang rape
-
32ఏళ్ల మహిళపై పాశవిక అత్యాచారం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కేంద్రం ఎన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చిన వాటిని మానవ మృగాళ్లు లెక్క చేయడం లేదు. బదౌన్ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 32ఏళ్ల మహిళ బలైపోయింది. ఈ సామూహిక అత్యాచారానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షాకింగ్ సంఘటన తెరపైకి వచ్చింది. మహిళపై సామూహిక అత్యాచారం 5 నెలల క్రితం జరిగింది. అయితే ఈ సంఘటన వీడియో నెట్లో ప్రసారం అయిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి బాధితురాలు గురువారం (జనవరి 28) పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఐదుగురు మైనర్లు ఉన్నారు.(చదవండి: ఇంటి దొంగే.. రూ.10 కోట్లు డిమాండ్!) ఐదు నెలల క్రితం కట్టెల కోసం దగ్గరలోని అడవికి వెళ్ళినప్పుడు అక్కడ యువకులు తనపై సామూహిక అత్యాచారం పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. నిందితులు గ్యాంగ్‌రేప్‌ను కూడా చిత్రీకరించారని తెలిపింది. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియో వైరల్ చేస్తామని, తన భర్త, పిల్లలను చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు ఆమె తెలిపారు. అయితే, వీడియో ప్రసారం అయిన తర్వాతే ఆ మహిళ ధైర్యాన్ని కూడగట్టుకొని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. బడాన్ జిల్లా ఎస్ఎస్పి సంకల్ప్ శర్మ మాట్లాడుతూ.. నిందితుల్లో ఒకరు ఈ వీడియో క్లిప్‌లను గ్రామ పరిసర ప్రాంతాలలోని కొంతమందికి రూ.300 చొప్పున విక్రయించారని తెలిపారు. దీంతో ఈ వీడియో బయటకి వచ్చినట్లు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కూడా బదౌన్ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 50ఏళ్ల మహిళ అంత్యంత దారుణంగా బలైపోయింది. దేవాలయానికి వెళ్లిన 50ఏళ్ల మహిళపై కామాంధులు విరుచుకుపడ్డారు. ఆమె దేహంతో ఆటబొమ్మతో ఆడుకున్నట్లుగా అత్యంత కిరాతకంగా.. పాశవికంగా ఇష్టమొచ్చినట్లుగా ఆడుకున్నారు. -
యూపీలో అత్యాచారం చిచ్చు
రాష్ట్ర హోం కార్యదర్శి తొలగింపు లక్నోలో సీఎం అఖిలేష్ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం లక్నో/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బదౌన్ సామూహిక అత్యాచారం, హత్యల ఉదంతంపై ఉత్తరప్రదేశ్ సర్కారుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటంతో.. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌గుప్తాను ఆ పదవి నుంచి తప్పించారు. ఆయనకు తదుపరి పోస్టింగ్ ఇచ్చే వరకూ వెయిటింగ్లో ఉంచుతున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు సోమవారం తెలిపారు. గుప్తా స్థానంలో ఇంకా మరో అధికారిని కూడా నియమించలేదు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. లక్నోలో ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ కార్యాలయాన్ని చుట్టుముట్టేందుకు వందలాది మంది నిరసనకారులు ప్రయత్నించటంతో వారిని నిలువరించేందుకు పోలీసులు నీటి ఫిరంగులను వినియోగించారు. ఇదిలావుంటే.. బదౌన్‌లో ఇద్దరు దళిత టీనేజీ అక్కాచెల్లెళ్లపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం చెట్టుకు ఉరివేసి హత్యచేసిన ఘటనకు సంబంధించి నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కఠిన సెక్షన్లతో ఎందుకు కేసు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ యూపీ సర్కారుకు నోటీసు జారీ చేసింది. అయితే.. హత్యకుగురైన బాలికలు దళితులు కారని, ఈ చట్టం వారికి వర్తించదని ఐజీ అమరేంద్రసేంగార్ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో అత్యాచార సంక్షోభ కేంద్రాలు: మేనకాగాంధీ బదౌన్ ఘటన అత్యంత భయానకమైనదని.. యూపీ సర్కారులో ఏమాత్రం స్పందన లేదని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకాగాంధీ ఖండించారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని.. మహిళలైన బాధితులకు అత్యల్పమైన మద్దతు లభించటం దీనికి కారణమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి దారుణాలను తమ మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణిస్తోందని.. ఈ ఏడాది చివరికల్లా దేశమంతటా ప్రతి జిల్లాలో అత్యాచార సంక్షోభ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు. ఈ కేంద్రాల్లో పోలీసులు, న్యాయవాదులు, వైద్యులు సేవలందిస్తారని.. అంబులెన్సులు ఉంటాయని, జాతీయస్థాయి హెల్ప్‌లైన్‌తో పనిచేస్తాయని వివరించారు. ఈ కేంద్రాలకు రూ. 500 కోట్లు కేటాయిస్తామన్నారు. భారత్‌లో మహిళలపై హింసపై దృష్టి సారించాలి: ఐరాస ఐక్యరాజ్యసమితి: బదౌన్ జిల్లాలో ఇద్దరు టీనేజీ బాలికలపై పాశవిక సామూహిక అత్యాచారం, హత్య ఉదంతాన్ని ఐక్యరాజ్యసమితి ఖండించింది. ఈ దురాగతానికి పాల్పడిన వారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, భారతదేశమంతటా మహిళలపై హింస సమస్యను పరిష్కరించాలని పిలుపునిచ్చింది.