breaking news
backwards
-
అడుగులు వెనక్కి.. ఆరోగ్యం ముందుకి..
సాక్షి, సాగుబడి: నడక అంటే సాధారణంగా ముందుకు నడవటమే. అయితే, వెనక్కి నడిచే పద్ధతి కూడా వ్యాయామంలో ఒక భాగం. దీన్నే రివర్స్ వాకింగ్ లేదా రెట్రో వాకింగ్ లేదా బ్యాక్వర్డ్ వాకింగ్ అంటారు. సాధారణ నడక విసుగెత్తినప్పుడు మార్పు కోసం వెనక్కి అడుగులు వేయొచ్చు. దీనితో తొడ వెనుక కండరాలకు చక్కని వ్యాయామం లభిస్తుంది. మడమ శస్త్రచికిత్సల తర్వాత ఫిజియో థెరపీలో భాగంగా వెనక్కి నడిపిస్తారట. ముందుకైనా వెనక్కైనా నడక నడకే కదా.. అప్పుడప్పుడూ రివర్స్ గేరు వెయ్యండి మరి! వెనక్కి నడిస్తే తొడ కండరాలు బలం పుంజుకుంటాయట. అంతకు పూర్వం.. అంతగా వాడని కండరాలకు దీంతో వ్యాయా మం దొరుకుతుందట. అంతేకాదు, శరీరం కొత్తగా వెనక్కి కదులుతున్నప్పుడు మనసు కూడా ఈ కొత్త సవాలుకు దీటుగా స్పందిస్తుందంటున్నారు నిపుణులు. అంటే మెదడుకు కూడా వ్యాయామమే. రివర్స్ వాకింగ్ ఫలితాలపై అమెరికాలోని నెవడ యూనివర్సిటీ ప్రొఫెసర్, బయోమెకనిస్ట్ డా.జానెట్ డ్యుఫెక్ అధ్యయనం చేశారు.ట్రెడ్‌మిల్‌పై సేఫ్!పార్కులోనో, వీధిలోనో వెనక్కి నడిచేటప్పుడు ఇతరులకు ఇబ్బంది లేకుండా, పడిపోకుండా జాగ్రత్తపడాలి. అదే, ట్రెడ్‌మిల్‌పై చేస్తే ఈ ఇబ్బంది ఉండదని అంటున్నారు పర్సనల్ ట్రైనర్లు. అయితే ట్రెడ్‌మిల్‌ను స్విచ్ఆఫ్ చేసి కరెంటు లేనప్పుడు ఉపయోగించాలి. ‘ట్రెడ్మిల్ బెల్ట్‌ను మన పాదాలతోనే నెడుతూ వెనక్కి నడవాలి. అలవాటయ్యే వరకు ఇది కొంచెం ఇబ్బందే. అందుకే మొదట్లో నెమ్మదిగా చేయాలి. కానీ, కండరాలకు ఇదొక భిన్నమైన వ్యాయామం’ అంటున్నారు ఆధునిక ట్రైనర్లు. రోజువారీ వ్యాయామం ప్రారంభంలో వార్మప్స్‌లో భాగంగా కాసేపు వెనక్కి నడిస్తే చాలని సూచిస్తున్నారు. మడమ గాయాల నుంచి కోలుకున్న వారికి లేదా శస్త్రచికిత్సల అనంతరం కోలుకుంటున్న వారికి ఈ రెట్రో వాకింగ్‌ను ఫిజియో థెరపిస్టులు సూచిస్తున్నారు.వృద్ధులకు ఉపయోగం‘ట్రెడ్‌మిల్‌పైన హ్యాండిల్స్ పట్టుకొని పడిపోకుండా వెనక్కి నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ట్రెడ్‌మిల్‌పై వెనక్కి నడవటం వృద్ధులకు ఉపయోగకరం. ఒక నిమిషంతో మొదలు పెట్టి పది నిమిషాల వరకు నెమ్మదిగా పెంచుకుంటూ పోవచ్చు. మీకు సౌలభ్యంగా ఉండేలా వేగాన్ని, దూరాన్ని ట్రెడ్మిల్లో సెట్ చేసుకుని ఈ రివర్స్ వాకింగ్ ప్రయత్నించవచ్చు’ అంటున్నారు డా.డ్యుఫెక్.జంట నడక మేలు!సాధారణంగా వ్యాయామం అంటే ఒక్కరే చేస్తుంటారు. కానీ, ఈ రెట్రో వాకింగ్‌లో స్నేహితులు లేదా భార్యాభర్తలు కలిసి చేసే వెసులుబాటు ఉంది. మీ భాగస్వామికి ఎదురుగా నిలబడి, రెండు చేతులను వేళ్లు చొప్పించి బిగుతుగా పట్టుకొని, ఒకరు ముందుకు నడుస్తుంటే.. మరొకరు వెనక్కి నడవొచ్చు. అంటే ఒకరికి మామూలు నడక.. మరొకరికి వెనక నడక అన్నమాట. కాసేపటి తర్వాత అటు ఇటు మారవచ్చు. ఈ ‘జంట నడక’ అక్కడే ఆగక్కర్లేదు. అలవాటు పడిన తరువాత నెమ్మదిగా జాగింగ్‌లా చేయవచ్చు.ఎన్ని ప్రయోజనాలో...⇒ అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అంచనాల ప్రకారం.. మామూలు వాకింగ్‌తో పోలిస్తే రెట్రో వాకింగ్ వల్ల దాదాపు రెట్టింపు సంఖ్యలో కేలరీలు ఖర్చవుతాయి. ⇒ నడుము నొప్పి, జాయింట్ పెయిన్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవాళ్లకు ఇది మంచి వ్యాయామం అని నిపుణులు చెబుతున్నారు.⇒ రెట్రో వాకింగ్ వల్ల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి⇒ ఎక్కువ మంది ఉన్నప్పుడు, వాహనాలు తిరిగే ప్రదేశాల్లో రెట్రో వాకింగ్ చేయవద్దు.⇒ గరుకుగా ఉన్న ఉపరితలం లేదా రాళ్లు వంటివి ఉండే ప్రదేశాల్లో వద్దు.⇒ హడావుడిగా, కంగారుగా చేయకూడదు.⇒ తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సూచనలు తీసుకోవాలి. -
ఎక్కువ క్యాలరీలు ఖర్చవ్వాలంటే..రివర్స్ వాకింగ్ ట్రై చేశారా?
ఆరోగ్యకరమైన అలవాట్లు ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో మనిషికి చాలా ఆరోగ్య ప్రయోజనాలను లభిస్తాయి. చక్కని ఆరోగ్యంతోపాటు, చక్కని శరీరాకృతితో బరువు పెరగకుండా ఉండేందుకు చాలా వ్యాయమాలను చేస్తాం. అయితే వెనుకకు నడవడం లేదా రివర్స్ వాకింగ్ ఉత్తమమైన వ్యాయామమని మీకు తెలుసా? చిన్నతనంలో ఏదో సరదాగా ఆటల్లో భాగంగా అలా చేసే ఉంటారు కదా. కానీ పెద్దయ్యాక కూడా రివర్స్ వాకింగ్ వల్ల చాలా లాభాలున్నాయి. ఇది వింతగా అనిపించినప్పటికీ ఇది ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.రివర్స్ వాకింగ్ మన సమతుల్యతను, స్థిరత్వాన్ని కాపాడుతుంది. తూలి పడిపోయే ప్రమాదం నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా పెద్ద వయసువారిలో పడిపోవడం వల్ల ఎముకలు విరగడం లాంటి ప్రమాదాలను నివారించవచ్చు.ఈ టెక్నిక్‌తో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రతతో మరింత స్థిరంగా ఉండటానికి దోహదపడుతుంది. ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి కూడా వేగవంతమైన నడక కంటే రివర్స్ వాకింగ్‌తో 40 శాతం ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.రివర్స్ వాకింగ్ కీళ్ల పనితీరు మెరుగుపడుతుంది. కాళ్లలోని కండరాలు బలపడతాయి. కండరాలు ఎక్కువగా సాగుతాయి. మోకాళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది.వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రివర్స్ వాకింగ్ కింది వీపుపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కూడా బాగా పనిచేస్తుంది. వెనుకకు నడిచేటప్పుడు ఏకాగ్రత అవసరం. కనుక శరీరంలోని మెదడు, ఇతర అవయవాల మధ్య సమన్వయం పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. గుండె, ఇతర అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచి, ప్రసరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది అథ్లెట్లకు, ముఖ్యంగా రన్నర్లకు, ఇది బాగా ఉపయోగకరం. ఎలా చేయాలి?ఆరుబయట, విశాలమైన పార్క్ లేదా ప్రశాతంగా ఉండే నిశ్శబ్ద పరిసరాలు, సురక్షితమైన ఖాళీ స్థలాన్ని ఎంచుకోవాలి. ఎటువంటి అడ్డంకులు, ట్రాఫిక్ లేని ప్రాంతాలను ఎంచుకోండి. వెనుకకు నెమ్మదిగా అడుగులు వేస్తూ నడవాలి. ట్రెడ్‌మిల్‌పై కూడా చేయవచ్చు.ఈ రివర్స్వాకింగ్ను నెమ్మదిగా ప్రారంభించాలి. ఆరంభంలో ఎవరైనా తోడు ఉంటే ఇంకా మంచిది. అలవాటయ్యే కొద్దీ, ఈ వాకింగ్ సమయాన్ని, దూరాన్ని పెంచుకోవచ్చు. సపోర్ట్ ఇచ్చే ఫిట్టింగ్ పాదరక్షలను ధరించండినోట్ : మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పితో బాధపడేవారు వైద్య సలహా మేరకు రివర్స్వాకింగ్ చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. తూలిపడే తత్వం, ఉదాహరణకు వర్టిగోతో బాధపడుతున్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. -
నన్ను ఉరితీసినా.. అందుకు అంగీకరించను
-
నన్ను ఉరితీసినా.. అందుకు అంగీకరించను
పట్నా: రిజర్వేషన్లను సమీక్షించాలన్న ఆర్ఎస్ఎస్ నేత వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ విరుచుకుపడ్డారు. తనను ఉరి తీసినా రిజర్వేషన్లను ఎత్తివేయడానికి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. పేదలు, వెనకబడిన వర్గాల వారికి రాజ్యాంగం కల్పిస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసే ప్రయత్నాలను తాను గానీ, తన పార్టీగాని ఒప్పుకునేది లేదని లాలూ తెగేసి చెప్పారు. బీసీ వర్గాలకు, పేదలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లౌకికవాదానికి తూట్లు పొడిచే ప్రయత్నాలను తాను ఎట్టి పరిస్థితిల్లోనూ ఉపేక్షించబోనని లాలూ అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్‌పై లాలూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయంలో మోదీ ...యునైటెడ్ నేషన్స్ కు తన మీద పిటిషన్ ఇచ్చినా ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. దీంతో పాటు రిజర్వేషన్లకు ఎత్తివేతకు ప్రయత్నిస్తున్న భగవత్‌కు భారతరత్న ఇచ్చి గౌరవించండంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇటీవల ఎస్టీ, ఎస్టీ, బిసి వర్గాలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లను సమీక్షించాలని ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రకటనపై దుమారం చెలరేగింది. ఆర్ఎస్ఎస్, బిజెపి కుట్రలో భాగంగానే అగ్రకులాల పెత్తనాన్ని మరింత పెంచేందుకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పలు సంఘాలు మండిపడుతున్నాయి.


