breaking news
babitha
-
వెనక్కి నడవమంటున్నారా?
మహిళల భద్రత కోసమని చెబుతూ ఈమధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. వాటి ప్రకారం... మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదు; మగవాళ్లు జిమ్ముల్లో ఆడవాళ్లకు ట్రెయినర్లుగా ఉండకూడదు. వాళ్ల ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ ఇది ఇంకో రకమైన తాలిబనిజం అవుతుంది. ఎందుకంటే, ఇలాంటివి చివరకు మహిళలకు కీడే చేస్తాయి. వారి వ్యక్తిగత ఎంపికకు భంగం కలిగిస్తాయి. ఇది ఇంతటితోనే ఆగుతుందా? ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేయాలా? అందుకే ఈ ప్రతిపాదనలు హాస్యాస్పదమైనవే కాదు, అర్థంలేనివి కూడా!మన మంచి కోసమేనని చెబుతూ కొందరు తరచూ కొన్ని పిచ్చి సూచనలు చేస్తూంటారు. వీటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఈ మధ్య ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ కొన్ని మూర్ఖపు సలహాలిచ్చింది. అవి ఎంత మూర్ఖమైనవంటే మనం వాటిని గట్టిగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపట్ల మౌనంగా ఉంటే, అవన్నీ సమ్మతమే అనుకునే ప్రమాదముంది.‘బహిరంగ, వాణిజ్య స్థలాల్లో మహిళల భద్రతను పెంచడం ఎలా?’ అన్న అంశంపై ఈ సూచనలు వచ్చాయి. ఉద్దేశం చాలామంచిది. కానీ ప్రతిపాదించిన సలహాలు మాత్రం నవ్వు పుట్టించేలా ఉన్నాయి. మగ టైలర్లు ఆడవాళ్ల దుస్తుల కొలతలు తీసుకోకూడదన్నది ఒకానొక సలహా. అలాంటప్పుడు పురుషులు మహిళల వస్త్రాలు కూడా తయారు చేయకూడదా? మహిళలు మాత్రమే సిద్ధం చేయాలా? బహుశా ఇది ఇకపై అమల్లోకి తెస్తారేమో! సెలూన్లలోనూ మహిళలకు క్షౌర క్రియలు చేయడం ఇకపై పురుషులకు నిషిద్ధం. అలాగే జిమ్, యోగా సెషన్లలోనూ మగవాళ్లు మహిళలకు శిక్షణ ఇవ్వడానికి అనుమతి లేదు.ఇంతటితో అయిపోయిందనుకోకండి. అన్ని పాఠశాలల బస్సు ల్లోనూ మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఉండాలన్న సలహా కూడా వచ్చింది. బహుశా పురుషులు ఎవరూ యువతులను, చిన్న పిల్లలను భద్రంగా ఉంచలేరని అనుకున్నారో... వారి నుంచి ముప్పే ఉందను కున్నారో మరి! మహిళల వస్త్రాలమ్మే చోట మహిళా సిబ్బంది మాత్రమే ఉండాలట. పురుషులను అస్సలు నమ్మకూడదన్న కాన్సెప్టు నడుస్తోందిక్కడ. మహిళలను ప్రమాదంలో పడేయకుండా పురుషులు వారికి సేవలు అందించలేరన్నమాట.ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ ఈ సలహాలు, సూచనలపై ఏమంటున్నారంటే... మహిళల భద్రతను పటిష్ఠం చేసేందుకు మాత్రమే కాకుండా, మహిళల ఉపాధి అవకాశా లను మెరుగుపరిచేందుకు కూడా వీటిని ఉద్దేశించినట్లు చెబుతున్నారు. ఈ సలహాలను ‘‘మహిళల భద్రత కోణంలోనూ, అలాగే ఉపాధి కల్పన కోణంలోనూ’’ ఇచ్చినట్టు మొహమాటం లేకుండా ఆమె చెబు తున్నారు. ఇంకోలా చెప్పాలంటే, రకరకాల ఉద్యోగాల్లో పురుషులపై నిషేధం విధిస్తున్నారన్నమాట. తద్వారా మహిళలకు కొత్త రకమైన అవకాశాలు కల్పిస్తున్నారనుకోవాలి. సరే... వీటి ద్వారా మనకర్థమయ్యేది ఏమిటి? అసలు ఏమైనా అర్థముందా వాటిల్లో? అలాటి ప్రతిపాదనలు అవసరమా? న్యాయ మైనవేనా? అనవసరంగా తీసుకొచ్చారా? మరీ నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయా? ఇప్పటివరకూ చెప్పినదాన్ని బట్టి నా ఆలోచన ఏమిటన్నది మీకు అర్థమై ఉంటుంది. కొంచెం వివరంగా చూద్దాం. మొదటగా చెప్పు కోవాల్సింది... ఈ ప్రతిపాదనల వెనుక పురుషులపై ఉన్న అప నమ్మకం గురించి! పురుష టైలర్లు, క్షురకులు, దుకాణాల్లో పనిచేసే వారి సమక్షంలో మహిళల భద్రతకు ముప్పు ఉందని భావిస్తున్నారు. చిన్నపిల్లల రక్షణ విషయంలోనూ మనం మగ సిబ్బందిని నమ్మడం లేదంటే... వాళ్లకేదో దురుద్దేశాలను ఆపాదిస్తున్నట్లే! పైగా... ఈ ప్రతిపాదనలు కాస్తా మహిళల జీవితాల తాలూకు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేవి కూడా! తాము సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా చేస్తున్నాయి. పురుషులు బాగా రాణిస్తున్న రంగాల్లో, వారి సేవలను తాను వినియోగించు కోవాలని ఒక మహిళ నిర్ణయించుకుంటే ఈ ప్రతిపాదనల పుణ్యమా అని అది అసాధ్యమవుతుంది. ఇంకోలా చూస్తే ఇది తాలిబనిజంకు ఇంకో దిశలో ఉన్న ప్రతిపా దనలు అని చెప్పాలి. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు మహిళలను తిరస్క రిస్తున్నారు. ఇక్కడ పురుషులను మహిళలకు దూరంగా ఉంచు తున్నారు. వారి దుర్మార్గమైన మనసులను విశ్వసించకూడదు; కాబట్టి వారిని మహిళలకు దూరంగా ఉంచాలి.ఇప్పుడు చెప్పండి... ఈ ప్రతిపాదనలు వాస్తవంగా అవసరమా? ఇలాగైతే పురుషుల దుస్తులమ్మే దుకాణాల్లో మహిళలు పని చేయకూడదు మరి! మహిళా జిమ్ శిక్షకులు పురుషులకు ట్రెయినింగ్ ఇవ్వకూడదు. ఫిజియోథెరపిస్టులుగా, దంతవైద్యులుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏమిటి? వీరందరినీ కేవలం మహిళలకు మాత్రమే సేవలందించేలా చేద్దామా?పురుష రోగులకు, వినియోగదారులకు సేవలు అందించడానికి అను మతిద్దామా? మగ శిక్షకులు, దుకాణాల్లోని మగ సేవకులను నమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు... స్త్రీలు పేషెంట్లుగా, వినియోగదారులుగా వచ్చినప్పుడు వాళ్లు ఎలా ఎక్కువ నమ్మకస్తులవుతారు?నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానో మీకు ఇప్పటికి అర్థమైందనే అనుకుంటున్నా. పురుషులు నిర్వహిస్తున్న పనులపై నమ్మకం లేకపోతే... మహిళలపై కూడా అదే అవిశ్వాసం ఉంటుంది కదా! అప్పుడు అదే ప్రశ్న కదా ఉత్పన్నమయ్యేది! పురుషులను అస్సలు నమ్మడం లేదని చెప్పడం ద్వారా ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏ రకమైన సందేశం ఇవ్వదలచుకున్నారు?కొంచెం ఆలోచించి చూడండి. మహిళల విషయంలో వివక్ష చూపేవారిని మిసోజినిస్ట్ అంటూ ఉంటారు. ఈ లెక్కన బబితా చౌహాన్‌ను మిసాండ్రిస్ట్ అనాలి. మహి ళల పట్ల వివక్ష చూపడం ఎంత తప్పో... పురుషులపై చూపడం కూడా అంతే తప్పు. అయితే మిసోజినీ గురించి మనకు కొద్దోగొప్పో పరిచయం ఉంది కానీ మిసాండ్రిస్టుల విషయం నేర్చుకోవాల్సే ఉంది. ఈ పనికిమాలిన విషయానికి మనం బబితా చౌహాన్‌కు కృతజ్ఞులుగా ఉండాలి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సీనియర్ నటి రీఎంట్రీ.. ఐటెం సాంగ్స్ అయినా ఒకే అట
తమిళసినిమా: నటిగా, శృంగార తారగా 1980 ప్రాంతంలో ఊపేసిన తార బబిత. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో 150కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కమలహాసన్ కథానాయకుడిగా నటించిన నాయగన్ చిత్రంలో నాన్ సిరిత్తాల్ దీపావళి పాట వినగానే గుర్తొచ్చేది నటి బబిత పేరే. తెలుగులోనూ మొరటోడు నా మొగుడు వంటి పలు చిత్రాల్లో నటించారు. కె.భాగ్యరాజ్ హీరోగా నటించిన చిన్నవీడు చిత్రంలో ఆయనకు రెండో భార్యగా నటించి అలరించారు. ఈమెది సినీ కుటుంబం అనే చెప్పాలి. ఈమె తండ్రి జస్టిస్ ఎంజీఆర్‌కు పలు చిత్రాల్లో విలన్‌గా నటించడంతో పాటు నిజ జీవితంలోనూ ఆయనకు నీడలా నిలిచిన వ్యక్తి. ఇక బబిత భర్త ఫైట్ మాస్టర్‌గా పలు చిత్రాలకు పని చేశారు. కాగా వివాహ అనంతరం నటి బబిత నటనకు దూరంగా ఉండి పిల్లలతో బాధ్యత గల తల్లిగా నడుచుకున్నారు. కొన్నేళ్ల క్రితం తన పెద్ద కూతురు లక్ష్యను హీరోయిన్ చేస్తూ స్వీయ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించారు. అయితే అనివార్య కారణాలతో ఈ చిత్రం పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తరువాత బబిత నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ నటిగా ఎంత పేరు తెచ్చుకున్నా సినిమా రంగంలో సాంబార్ ఇడ్లీ తినకపోతే ఉండలేకపోతున్నానన్నారు. అందుకే మళ్లీ నటించడానికి సిద్ధమయ్యా నని ఆమె తెలిపారు. ప్రస్తుతం మహల్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. దీనికి పొస్ కుమరస్ దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. మళ్లీ శృంగార తారగా ఐటమ్ డాన్స్ చేయడానికి కైనా.. అక్క, అమ్మ పాత్రలకైనా సిద్ధమని ప్రకటించారు. -
ప్రేమే గెలిచింది..!
శుభం కార్డులు పడేది సినిమాలకే.. జీవితాలకు కాదు. మూడు గంటల పాటు ఏదేదో చూపించి చివరగా ఓ హ్యాపీ ఎండింగ్ ఇవ్వడం సినిమాలకే సాధ్యమయ్యే విషయం. నిజజీవితంలో ఇలాంటి హ్యాపీ ఎండింగ్లు ఆశించడం కాస్త కష్టమే! కానీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన తాపేశ్వర్ జీవితానికి మాత్రం సినిమా తరహా శుభం కార్డే పడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది నెలల వెతుకులాటకు చక్కని ముగింపు దొరికింది. ఆ కథేంటో మీరూ తెలుసుకోండి..! నాలుగేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని ధర్మశాలలో తొలిసారిగా బబితను కలిశాడు తాపేశ్వర్. అప్పటికే ఆమె పిచ్చిచూపులు చూస్తోంది. ఎవరో ఏంటో కనుక్కుందామని ప్రయత్నించాడు. మాట కలిపాడు. మాటల్లో భాగంగా అర్థమైంది అతడికి.. ఆమె గతమేంటో.. భవిష్యత్తేంటో..! బబిత మొదట్నుంచీ మానసిక రోగి. ఆరోగ్యస్థితి సరిగా లేకపోవడంతో పిచ్చిపనులు చేస్తూ కుటుంబానికి భారంగా తయారైంది. ఆ భారాన్ని వదిలించుకోవడానికే ఆమె కుటుంబ సభ్యులు ధర్మశాలలో వదిలేసి వెళ్లిపోయారు. ముప్పై ఆరేళ్ల తాపేశ్వర్ మరేం ఆలోచించలేదు. బబితను వెంటబెట్టుకుని తన స్వస్థలమైన మీరట్‌కు చేరుకున్నాడు. ఆమెను వివాహం చేసుకుని, ఇద్దరూ సరికొత్త జీవితం మొదలుపెట్టారు. ఈ ఏడాది మార్చి వరకూ వరకూ అంతా బాగానే ఉంది. కానీ, ఉన్నట్టుండి బబిత మాయమవ్వడంతో తాపేశ్వర్ కష్టాలు మొదలయ్యాయి. భార్య కోసం ఊరంతా గాలించాడు. ఎక్కడా ఆమె జాడలేదు. పోస్టర్లు అతికించి, ఇంటింటికీ తిరిగి ఆమె ఆచూకీ అడిగాడు. అయినా, ప్రయోజనం లేదు. అప్పటినుంచి తాపేశ్వర్కు సరిగా నిద్రకూడా పట్టేది కాదు. మానసికంగా బలహీనమైన తన భార్య ఎలాంటి పరిస్థితుల్లో ఉందోనని కుమిలిపోయేవాడు. తన జీవనాధారమైన కూలిపనిని కూడా వదిలిపెట్టి, భార్య కోసం సైకిల్‌పై వెదుకులాట మొదలుపెట్టాడు. అలా దాదాపు ఎనిమిది నెలల పాటు సైకిల్‌పై తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడికక్కడ అతికించిన పోస్టర్ల ఆధారంగా భార్య ఆచూకీ దొరుకుతుందనేది ఆయన ఆశ. కొన్నాళ్లకు బంధువుల్లో కొందరు బబితను చూశామన్నారు. ఆమెను కొందరు బలవంతంగా వేశ్యాగృహాలకు అమ్మేశారని చెప్పారు. దాంతో రెడ్‌లైట్ ఏరియాల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఎక్కడా ఆమె ఆనవాళ్లు కనిపించలేదు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించాడు. చివరకు ఓ రోజు హరిద్వార్ నుంచి ఓ ఫోన్ అందుకున్నాడు. బబితను గుర్తుపట్టిన ఓ వ్యక్తి, ఆమె భిక్షమెత్తుకుంటోందని తాపేశ్వర్కు సమాచారమిచ్చాడు. రెక్కలు కట్టుకుమరీ వాలిపోయిన ఆయన.. తన భార్య దుస్థితికి కుమిలిపోయాడు. అక్కున దగ్గరకు తీసుకుని గుండెల నిండా హత్తుకున్నాడు. ఆశ చంపుకోకుండా.. పట్టు విడువకుండా తాపేశ్వర్ చేసిన ప్రయత్నం వారి ప్రేమను గెలిపించింది. చివరకు ప్రేమే గెలిచింది!!